Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
ఆఫీస్ లో ప్రాక్టీస్ చేసేందుకు టాప్ 6 యోగ భంగిమలు
యోగ,ధ్యానం ద్వారా మీ మనస్సు మరియు శరీరం యొక్క నియంత్రణతో సహా డిసిప్లేన్ అండ్ ప్రాక్టీస్ కొరకు పురాతన హిందూ మత రూపంగా చెప్పవచ్చు. నిర్దిష్ట శరీర భంగిమలలో శ్వాస మరియు అనుకరణను 'ఆసన' అని పిలుస్తారు. యోగ అనేది మీ మనస్సు మరియు శరీరం యొక్క నియంత్రణ కొరకు సహాయపడుతుంది. తద్వారా మీరు మీ జీవితంలో ఒక గట్టి పట్టును సాధిస్తారు. ఇది మీ జీవితంనకు బ్యాలెన్స్ తీసుకురావడానికి మరియు ప్రకృతితో శాంతి మరియు సామరస్యంగా నివసించటానికి సహాయపడుతుంది. యోగా అనేది కేవలం శరీరంనకు ఫిట్ నెస్ తీసుకురావటానికి ఒక వ్యాయామం వంటిదని విస్తృతంగా ఒక దురభిప్రాయం ఉంది.
మన జీవన విధానానికి యోగ క్రమం తప్పకుండా సాధన చేస్తే సమర్థవంతంగా పనిచేస్తుంది. మాస్టర్ ఆఫ్ యోగ సాహిత్యపరంగా తనను తాను విశ్వం యొక్క మాస్టర్ గా అనువదించారు. యోగ మీ ఆలోచనలను, జీవనశైలి,కోరికలు మరియు మీ శరీరం మొత్తం నియంత్రణకు సహాయపడుతుంది. మీరు మీ భౌతిక సామర్ధ్యాల పరిమితిని మరియు మీ ఆకలిని నియంత్రించవచ్చు. మీ శ్వాసను నియంత్రించడం ద్వారా మీ కోపం నియంత్రణ లోకి వస్తుంది.
నేటి జీవనశైలిలో యోగ మొత్తంను పరిమిత కాలంలో సాధన చేయటం కష్టం అని చెప్పవచ్చు. యోగా అందం మీ అవసరం మరియు దాని స్వీకృతి మీద ఆధారపడి ఉంటుంది. యోగా లో భాగంగా శ్వాస పీల్చుటలో ప్రాక్టీస్ చెయ్యవచ్చును. ధ్యానంలో భాగంగా ఆసనాలు అభ్యాసం చేయుటవలన మీ శారీరక దృఢత్వానికి సహాయపడుతుంది. అనేక ఆసనాలను కలిపి సమయాన్ని బట్టి సాధన చేయవచ్చు.
రోజులో ఎక్కువ భాగం కుర్చీలు మరియు కంప్యూటర్లకు పరిమితమైన వ్యక్తుల కోసం ఈ కొన్ని ఆసనాలు క్రమం తప్పకుండా మీ కార్యాలయంలో వద్ద కూడా సాధన చేయవచ్చు.

డీప్ శ్వాస
కుర్చీలో లేదా చదునుగా ఉన్న నేలపై వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోవాలి. దిగువ ఊపిరితిత్తులు, మధ్య ఊపిరితిత్తులు,ఎగువ ఊపిరితిత్తులు మరియు ఛాతీ మరియు మీ బొడ్డులోకి డీప్ గా గాలిని లోనికి పీల్చుకోవాలి. అప్పుడు నెమ్మదిగా బొడ్డు నుండి మీ ఎగువ ఊపిరితిత్తులు,మధ్య ఊపిరితిత్తులు,దిగువ ఊపిరితిత్తుల నుండి గాలిని తొలగించాలి. మీరు పూర్తిగా గాలి మీద దృష్టి పెట్టాలి. దీనిని మీరు కళ్ళు మూసుకొని 5 సార్లు రిపీట్ చేయాలి.

మెడ రోల్ చేయుట
మీరు కళ్ళు మూసుకొని మీ గడ్డాన్ని చాతి వైపు క్రిందికి వంచాలి. మొదటిగా సవ్యదిశలో మీ మెడను నెమ్మదిగా వృత్తాకార మోషన్ లో ప్రారంభించి ఆపై అపసవ్య దిశలో చేయాలి. మీరు పూర్తి వలయాలను చెవి మరియు భుజం తాకుతూ చేస్తున్నారని నిర్దారించుకోండి. మీ మనస్సు మరియు శరీరం రిలేక్స్ అవుతుంది.

పాద హస్తాసనము
మీ రెండు కాళ్ళ పాదాలను దగ్గరగా పెట్టాలి. ఇప్పుడు మీరు నెమ్మదిగా క్రిందికి వంగి మీ వ్రేళ్ళతో మీ పాదాలను పట్టుకోవాలి. మొత్తం ప్రక్రియలో మీ చేతులను సాగదీసి ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా యదా స్థానానికి రావాలి.

పశ్చిమోత్తానాసనం
నేల మీద క్రింద కూర్చుని రెండు కాళ్ళు ముందుకు చాపాలి. మీ చేతులు మరియు శరీరంను ముందుకు చాచి మరియు మీ మోకాలు బెండింగ్ లేకుండా మీ పాదాలను తాకే ప్రయత్నం చేయండి. ఈ ఆసనము మీ చేతులు,భుజాలు,మీ వెన్నెముకకు మంచి స్ట్రెచ్ ని ఇస్తుంది. అంతేకాక అదనపు బొడ్డు కొవ్వు తగ్గిస్తుంది. వ్యాధులు నుండి మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

వారియర్ భంగిమ
మీరు నిటారుగా నిల్చొని మీ పాదాల మధ్య 4 అంగుళాల దూరం ఉండాలి. గాలిలో మీ చేతులు పైకెత్తి వాటిని చాచాలి. ఇప్పుడు కుడి వైపున 90 డిగ్రీలకు మీ కుడి కాలు,చెయ్యి చాచాలి. తర్వాత అదేవిధంగా మీ ఎడమ కాలు,చెయ్యి చేయాలి. తర్వాత యదా స్థానానికి రావాలి. అప్పుడు రెండు చేతులను పైకి ఎత్తి ఆకాశం వైపు చూడాలి.

ఉత్థిత హస్త పదన్గుస్తాసన
తడాసనలో నేరుగా నిలబడాలి. ఇప్పుడు ఊర్ధ్వ దిశలో మీ ఎడమ కాలిని పైకి ఎత్తటానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీ ఎడమ చేతితో మీ ఎడమ కాలి చీలమండను తాకే ప్రయత్నం చేయండి. దీనిని ఇతర మార్గాలలో కూడా ప్రయతించవచ్చు. ఈ ఆసనము మీ వెన్నెముక,లోయర్ బ్యాక్,పిరుదులు,కాళ్లు, చేతులకు ఒక మంచి మసాజ్ ను ఇస్తుంది. అంతేకాక శరీర ప్రాంతాల్లో ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications











