సూర్యరశ్మి వల్ల అశ్చర్యకరమైన ఆరోగ్యప్రయోజనాలు..!

చాలా మంది ఎండలోకి వెలితే కందిపోతాం, నల్లబడిపోతాం అని ఎండమొహం చూడకుండానే ఉంటారు. అయితే ఎండ వల్ల ఎంత ఆరోగ్యప్రయోజనం ఉందో బహుశా వారికి తెలసుండకపోవచ్చు. సూర్య రశ్మి ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగమంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అతని ఇల్లు గాలి, వెలుతురు, సక్రమంగా వచ్చిపోతుండేలా చర్యలు తీసుకోవాలని వైద్యులుసూచిస్తున్నారు. ఒకప్పుడు సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే భారతదేశంలో.. ప్రజలకు అసలు 'విటమిన్‌-డి'లోపమనేదే ఉండదని భావించేవారు. కానీ నేడది వట్టి అపోహేనని తాజా అధ్యయా నాలన్నీ రుజువు చేస్తున్నాయి.

ప్రస్తుతం మన దేశంలో 90% మందికి విటమిన్‌-డి లోపం ఉంది. శారీరక శ్రమ లోపించ టం..వూబకాయం.. ధూమపానం.. వీటన్నింటి మూలంగా నానాటికీ మన శరీరంలో విటమిన్‌-డి' అవసరాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఎండ ముఖం చూడకుండా... ఎక్కడా ఒంటికి సూర్యరశ్మి సోకకుండా... నెలలు, సంవత్సరాలూ నీడ పట్టునే గడపటం పెరిగిపో తోంది. ఫలితం.. ఎంతో మందిలో ఎంతోకొంత విటమిన్‌-డి లోపం కనబడుతోంది. మన శరీరంలో, మన ఆరోగ్య పరిరక్షణలో ఈ విటమిన్‌-డికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా... ఇది అస్సలు మంచి పరిణామం కాదు.

శరీరానికి గాలి, నీరు, ఆహారం అవసరమైనట్లే, సూర్యరశ్మీ కూడా కావలసి ఉంటుంది. సూర్యరశ్మి శరీరారోగ్యానికి ఔషధంలాంటిది. సూర్యరశ్మి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతివారికీ కావలసిన విటమిన్‌ డి సూర్యరశ్మి ద్వారానే శరీరానికి అందుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో సూర్యరశ్మి కూడా అంతే అవసరం. సూర్యరశ్మి మనిషి శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా అవసరమే. మనకు వీటిలో ఏది అందకపోయినా అనారోగ్యం బారిన పడతాం. కాబట్టి సూర్యరశ్మిని నిర్లక్ష్యం చేయకూడదు. 'డి' విటమిన్‌ లోపం వల్ల ఎముకలకు సంబంధించిన రికెట్స్‌ వ్యాధి వస్తుంది. ఒక్క రికెట్స్ వ్యాధి మాత్రమే కాదు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎదురౌవుతాయి.

అయితే సూర్య రశ్మి వల్ల విటమిన్ ఉత్పత్తి మాత్రమే కాకుండా, ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయన్న విషయం మనకు తెలియదు. మీరు ప్రతి రోజూ ఉదయం సూర్యరశ్మిలో గడపడం వల్ల అనేక చర్మ సమస్యలను మరియు ఇతర అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. కాబట్టి, మీరందరూ ప్రతి రోజూ ఉదయాన్ని నిద్రలేచి అంతో ఇంతో సూర్యరశ్మి శరీరం మీద పడేలా చేసుకోండి..

సూర్యరశ్మి వల్ల అశ్చర్యకరమైన ఆరోగ్యప్రయోజనాలు..!

విటమిన్ డి ఉత్పత్తి: ఉదయం ఏర్పడే సూర్యరశ్మిలో కొంత సమయం గడపడం ద్వారా శరీరానికి కావల్సిన విటమిన్ డి, మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఎముకలకు విటమిన్‌ డితో ఏమిటి లాభం : ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం చాలా అవసరం. మనం తీసుకునే ఆహారంలోని క్యాల్షియం పేగుల ద్వారా రక్తంలో కలిసేలా చూసేది ఈ విటమిన్‌-డినే. అలాగే ఇది రక్తంలోని క్యాల్షి యంను ఎముకల్లోకి పంపిస్తుంది, ఎముకల క్షయం కాకుండా, అవి క్షీణించకుండా నిలువరిస్తుంటుంది.

సూర్యరశ్మి వల్ల అశ్చర్యకరమైన ఆరోగ్యప్రయోజనాలు..!

మూడ్ లిప్టర్: మీరు చాలా రోజుల నుండి క్యాబిన్ పీవర్ సిండ్రోమ్ తో బాధపడుతున్నట్లేతే. మీకు తగినంత సూర్యరశ్మి అందక, నిస్తేజమైన వాతారణంలో గడపడం వల్ల, అది మానసిక స్థితి పై ఎక్కువ డిప్రెషియేట్ ప్రభావం చూపెడుతుంది. కాబట్టి సూర్యరశ్శిలోకి వెళ్ళ కొంత వేడిని పొందడం దర్వా ఈ ఒత్తిడి రుగ్మతలను నివారించుకోవచ్చు.

సూర్యరశ్మి వల్ల అశ్చర్యకరమైన ఆరోగ్యప్రయోజనాలు..!

ఏకాగ్రత: ఎవరైతే రోజులో ఎక్కువ సమయం ఎండలో గడుపుతారో, వారు సాయంత్రపు సూర్యరశ్మి మీద ఎక్కువ శ్రద్ద మరియు హెచ్చరికలు నమ్ముతారు. ఎందుకంటే సాయంత్రపు సూర్యరశ్మి అలసటను పారద్రోలటంలో బాగా సహాయపడుతుంది. ఏకాగ్రతను పెంచుతుంది.

సూర్యరశ్మి వల్ల అశ్చర్యకరమైన ఆరోగ్యప్రయోజనాలు..!

బాడీ క్లాక్: నిరంతరం ఎండ తగలని ప్రదేశంలో నివసించడం వల్ల శరీరంలోని కొన్ని జీవక్రియలు బద్దకిస్తాయి. దాంతో కొన్ని హార్మోనుల మీద ప్రభావం చూపెడుతుంది. కాబట్టి, ప్రతి రోజూ సూర్య రశ్మి శరీరానికి తాకడం వల్ల, శరీరంలోని జీవక్రియల్లో ఉత్తేజం చెంది హార్మోనుల అభివ్రుద్దికి సహాయపడుతాయి. దాంతో సూర్య రశ్మి నేచురల్ బాడీ క్లాక్ లా పనిచేస్తుంది.

సూర్యరశ్మి వల్ల అశ్చర్యకరమైన ఆరోగ్యప్రయోజనాలు..!

కొవ్వును కరిగిస్తుంది: సూర్యరశ్మి వల్ల చర్మాంతర్గతంలో ఉండే కొవ్వును కరిగించబడుతుందని ఇటీవల ఓ సైంటిఫిక్ స్టడీ సూచించింది. ఇది ప్రాధమికంగా చర్మ క్రింద నిల్వ ఉన్న కొవ్వును కరిగిస్తుంది. ఈ కొవ్వును కరిగించడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మరియు ఖచ్చితంగా మీరు సన్నగా మారడానికి కూడా సహాయపడుతుంది.

సూర్యరశ్మి వల్ల అశ్చర్యకరమైన ఆరోగ్యప్రయోజనాలు..!

నొప్పులను నివారిస్తుంది: సూర్యరశ్మి ఒకరకంగా పెయిన్ కిల్లర్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే, సూర్య రశ్మి నుండి అందే విటమిన్ డి నొప్పినివారిణిగా పనిచేస్తుంది. కాబట్టి సూర్యరశ్మిలో గడిపి ఒంటి నొప్పులను నివారించుకోమని కొన్ని అధ్యనాలు సూచిస్తున్నాయి.

సూర్యరశ్మి వల్ల అశ్చర్యకరమైన ఆరోగ్యప్రయోజనాలు..!

ఆటోఇమ్యూన్ వ్యాధులు: ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయటంలో సూర్య రశ్మి నుండి వెలువడే విటమిన్‌-డి కీలక పాత్ర పోషిస్తుంది. సూర్యకాంతినుండి వెలువడే యూవీ కిరణాలు రోగనిరోధక వ్యవస్థను అణిచివేసేందుకు సహాయపడుతుంది. సోరియాసిస్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడి, శరీరానికి రక్షణ కల్పిస్తుంది. తెల్లరక్తకణాలు చురుకుగా ఉండి, రోగకారక క్రిములతో పోరాడాలంటే మన శరీరంలో విటమిన్‌-డి తగినంత ఉండటం చాలా అవసరం.

సూర్యరశ్మి వల్ల అశ్చర్యకరమైన ఆరోగ్యప్రయోజనాలు..!

ఆస్తమా(ఉబ్బసం): అలెర్జీగా ఉన్న ఆస్తమా ప్రధానంగా ఒక శ్వాస రుగ్మత. ఈ అలెర్జీలను తగ్గించడానికి సూర్యకాంతిని నుండి వెలువడే కిరణాలు బాగా సహాయపడుతాయి. సూర్య రశ్మిలో గడపడం వల్ల కొన్ని అలెర్జీలతో పాటు ఆస్తమాను కూడా తగ్గిస్తుంది.

సూర్యరశ్మి వల్ల అశ్చర్యకరమైన ఆరోగ్యప్రయోజనాలు..!

అల్జీమర్ రోగులకు సహాయపడుతుంది: అమెరికన్ మెడికల్ అసోసియేషన్ యొక్క జర్నల్ నిర్వహించిన ఒక పరిశోధన ఫలితంగా సూర్యరశ్మి లో కొన్ని గంటల అల్జీమర్ రోగులు నిలబడటం వల్ల మెమెరీ పెరుగుదలలో మంచి ఫలితాలను పొందారని చెప్పారు .

సూర్యరశ్మి వల్ల అశ్చర్యకరమైన ఆరోగ్యప్రయోజనాలు..!

టైప్2 డయాబెటిస్: విటమిన్‌-డి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్లోమంలోని బీటా కణాల మీద పని చేసి ఇన్సులిన్‌ ఉత్పత్తి సజావుగా సాగుతుండేలా చేస్తుంది. ఇన్సులిన్‌ తయారు చేసే కణాల విభజననూ నియంత్రిస్తుంటుంది. శరీర కణాలు ఇన్సులిన్‌ను గ్రహించేలా చూడటంలో కూడా దీనిది కీలక పాత్ర. చిన్న పిల్లల్లో టైప్‌-1 మధుమేహం రావటానికి విటమిన్‌-డిలోపమూ ఒకప్రధాన కారణమని గుర్తించారు. దీనిపై ఎన్నో పరిశోధనలు సాగుతున్నాయి. సరియైన మోతాదులో విటమిన్-డీ తీసుకునే వారిలో (సూర్యరశ్మి తగిలే వారిలో) ఈ వ్యాధి లక్షణాలు కనబడటంలేదని మెల్‌బోర్న్‌కు చెందిన వ్యాధి విజ్ఞాన శాస్త్ర నిపుణులు తెలిపారు.

సూర్యరశ్మి వల్ల అశ్చర్యకరమైన ఆరోగ్యప్రయోజనాలు..!

క్యాన్సర్ నివారిణి: సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్ ద్వారా లభ్యమయ్యే విటమిన్ 'డి ' క్యాన్సర్‌ను అరికడుతున్నట్లు తెలిపారు. అయితే, సూర్యరశ్మి సమపాళ్ళలో అందని వ్యక్తులు క్యాన్సర్‌కు త్వరితంగా గురవుతున్నారని హెచ్చరించారు. విటమిన్‌-డికి ఉన్న మరో కీలకమైన ప్రయోజనం- ఇది శరీరంలో కణ విభజనను నియంత్రిస్తుంటుంది. ఇది లోపించి కణ విభజన శ్రుతి తప్పితే.. పరిస్థితి క్యాన్సర్‌కు దారి తీస్తుంది. ముఖ్యంగా విటమిన్‌-డిలోపం వల్ల పెద్దపేగు క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌, ప్రోస్టేటు గ్రంధి క్యాన్సర్‌, క్లోమం క్యాన్సర్ల ముప్పు పెరుగుతోందని అధ్యయనాల్లో కూడా నిరూపణ అయ్యింది. కాబట్టి శరీరంలో విటమిన్‌-డి స్థాయిలు సజావుగా ఉండేలా చూసుకోవటమన్నది క్యాన్సర్ల నివారణలో కూడా ముఖ్యమైన అంశం.

రోజులో కొన్ని గంటలపాటైనా సూర్యరశ్మి తగిలేలా ఆరుబయట గడప టం అన్ని విధాలా శ్రేయస్కరం. మనదేశంలో యూవీ కాంతి ఎక్కువే. అలాగే సముద్రతీర ప్రాంతంలోనూ, ఎత్తయిన కొండ ప్రాంతాల్లోనూ యూవీ కిరణాలు మరింత తీక్షణంగా ఉంటాయి. అయినా కూడా మన భారతదేశంలో...మిగతా అన్నిప్రాంతాలతో పాటు కొండ ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో కూడా విటమిన్‌-డి లోపం ఎక్కువగా ఉందని అధ్యయనాల్లో గుర్తించారు. బయటకు వెళ్ళని గృహిణులు, కార్లలో తిరుగుతూ ఎ.సి గదుల్లో పనిచేసే ఉద్యోగులు, సూర్యరశ్మి సోకని ఇళ్ళల్లో నివసించేవారు తప్పనిసరిగా సాయంత్రం లేదా ఉదయం సమయాల్లో కొంత సమయం ఎండలో ఉండాలి. గృహిణులు ఆరుబయట నీరెండలో కొన్ని పనులను చేయడం ద్వారా సూర్యరశ్మి దేహానికి అందుతుంది.

Desktop Bottom Promotion