For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిర కాలం పాటు మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొనే మార్గం..

|

ఆధునిక జీవనశైలిలో అధిక బరువు, మధుమేహం, రక్తపోటు సహజ రుగ్మతలుగా మారిపోయాయి. వృద్ధాప్యంలో రావాల్సిన వ్యాధులు చిన్నవయస్సులోనే ఆవహిస్తున్నాయి. జీవనశైలి, ఆహార నియమాలు, మానసిక ఒత్తిళ్లే ఈ సమస్యలకు ప్రధాన కారణాలు. రుగ్మత ఏదైనప్పటికి దాని ప్రభావం గుండెపై పడుతుంది. రక్తపోటు పెంచి, గుండెపోటుకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో గుండెను పదిలపర్చుకోడానికి సప్త సూత్రాలు పాటిస్తే సరిపోతుందంటున్నారు డాక్టర్లు, సైకాలజిస్టులు, న్యూట్రిషనిష్టులు.

అందువల్లే గుండె పోటు వచ్చిన తర్వాత బాధపడేకంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. హార్ట్ హెల్తీ టిప్స్ ఫాలో చేయడం చాలా సహాయపడుతుంది. దాంతో గుండె కొట్టుకోవడానికి సహాయపడుతుంది. అంతే కాదు గుండె సంబంధిత సమస్యలు లేకుండా కాపాడటంతో పాటు రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది . అందుకు మంచి డైట్ ను పాటించాలి. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండే ఆహారాలను తీసుకోకుండా, న్యూట్రిషియన్స్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల మీ గుండెను మాత్రమే కాదు పూర్తి ఆరోగ్యంతో సంపూర్ణంగా జీవితాన్ని గడపవచ్చు.

హెల్తీడైట్ మాత్రమే కాకుండా కొంత శారీరక శ్రమ కూడా అవసరం. అందుకు జాగింగ్, వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, ఏరోబిక్ మరియు కార్డియో ఎక్సర్ సైజ్ చేయడం వల్ల గుండెకు మాత్రమే కాదు పూర్తి శరీర ఆరోగ్యానికి మంచిది. కాబట్టి, మీరు మీ గుండె ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ క్రింది ఇచ్చిన సులభ పద్దతులను ఫాలో అయిపోవడమే...

మన గుండెను..మనమే కాపాడుకొనే టాప్ సీక్రెట్...!

ఫ్యాట్ ఫుడ్స్ మినహాయించాలి: వేయించిన ఆహారాలు, రుచికరమైన ఆహారాలు గుండెకు హాని కలిగిస్తాయి. మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, మీ రెగ్యులర్ డైట్ నుండి కొవ్వు పదార్థాలను మినహాయించాలి. వాటికి బదులు హెల్తీ ఫ్యాటీ యాసిడ్స్ ను చేర్చుకోవాలి. ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ చేపల్లో కనుగొనబడింది.

మన గుండెను..మనమే కాపాడుకొనే టాప్ సీక్రెట్...!

కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయాలి: గుండెకు చెడు కొలెస్ట్రాల్ చాలా హాని కలిగిస్తుంది. కాబట్టి మీ కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ ఉంచుకోవడం చాలా అవసరం. రక్తం గడ్డకట్టడానికి మరియు గుండె పోటుకు ఎల్ డిఎల్ ప్రధాన కారణం.

మన గుండెను..మనమే కాపాడుకొనే టాప్ సీక్రెట్...!

బరువు తగ్గాలి: అధిక బరువు, స్థూలకాయం గుండెకు ప్రథమ శతృవు అంటారు విజ్ఞులు. వ్యక్తి ఎత్తుకు తగ్గ బరువు ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. బరువు పెరిగేకొద్దీ రక్తపోటు పెరుగుతుంది. బరువు అధికమైతే మధుమేహం, కీళ్ళనొప్పులు దగ్గరవుతాయి. కాబట్టి ప్రతి వ్యక్తి బరువును నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. ఆహార నియమాలు పాటిస్తూ బరువును తగ్గించుకోవాలి.

మన గుండెను..మనమే కాపాడుకొనే టాప్ సీక్రెట్...!

వ్యాయామం: సాధారణ వ్యాయామం వల్ల లాభాలు భౌతిక ఆరోగ్యం లో ఏకగ్రీవ ఉన్నాయి. స్టడీస్ సాధారణ అంశాలు గుండె దాడులు మరియు ఇతర హృదయ రోగాల నష్టాలు తగ్గించబడ్డాయి తేలింది. కాబట్టి ప్రతి రోజూ అరగంట పాటు వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దాంతో గుండె వ్యాధులను నివారించుకోవచ్చు.

మన గుండెను..మనమే కాపాడుకొనే టాప్ సీక్రెట్...!

నో స్మోకింగ్: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే దూమపానానికి దూరంగా ఉండాలి. ధూమపానం చేయని వారికంటే ధూమపానం చేసే వారిలో 25%మందిలో గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువని గుర్తించారు. అందువల్ల పొగ త్రాగేవారు సాధ్యమైనంత వరకూ పొగత్రాడం మానేయాలి. దాంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.

మన గుండెను..మనమే కాపాడుకొనే టాప్ సీక్రెట్...!

యోగ: గుండె సంబంధిత ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను అధికం చేయడంలో డిప్రెషన్ కూడా ఒకటి. కాబట్టి అనవసరమైన విషయాలను ఆందోళన చెందకుండా జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. ఎప్పుడూ సంతోషంగా గడపడానికి అలవాటు చేసుకోవాలి. అందుకు యోగ చేయడం వల్ల మీ శరీరాన్ని,మనస్సును, విశ్రాంతి పరుస్తుంది. కాబట్టి యోగాసన ప్రాక్టీస్ చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోండి.

మన గుండెను..మనమే కాపాడుకొనే టాప్ సీక్రెట్...!

రెడ్ వైన్: రెడ్ వైన్: రెడ్ వైన్ త్రాగడం వల్ల శరీరంలో జీవక్రియలు క్రమబద్దంగా ఉండి ఇది గుండె ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది మంచి కొలెస్ట్రాల్ హెడి ఎల్ లెవల్స్ ను పెంచుతుంది. వ్యాధి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.

మన గుండెను..మనమే కాపాడుకొనే టాప్ సీక్రెట్...!

ఉప్పు తగ్గించాలి: ఉప్పు తీసుకోవడం తగ్గించడం వల్ల బిపి తగ్గించుకోవచ్చు. మరియు గుండె సంబంధిత సమస్యలు లేకుండా రక్షణ కల్పించవచ్చు. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మీ రెగ్యులర్ డైట్ లో ఉప్పును తగ్గించుకోవాలి.

మన గుండెను..మనమే కాపాడుకొనే టాప్ సీక్రెట్...!

ట్రైగ్లిజరైడ్స్: ఇది రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ వంటి కొవ్వు. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధుల హానిని పెంచుతుంది. ట్రైగ్లిజరైడ్స్ లో సంతృప్త మరియు క్రొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండటం వల్ల వాటిని తీసుకోవడం నివారించడం చాలా అవసరం..

మన గుండెను..మనమే కాపాడుకొనే టాప్ సీక్రెట్...!

థైరాయిడ్: థైరాయిడ్ సమస్య వల్ల కార్డియో వ్యాస్కులర్ వ్యాధులను పెంచుతుంది. ఇది మహిళల్లో చాలా ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతుంది.

English summary

Ways To Improve Your Heart Health

In this hectic life, we all need to look after our heart. Rising heart problems can trigger people of any age. Gone are the days when men and women in early 30's used to be protected by heart diseases.
Story first published: Saturday, June 8, 2013, 16:08 [IST]
Desktop Bottom Promotion