ఉద్యోగం చేసే వారికి బరువు తగ్గటానికి చిట్కాలు

సాదారణంగా బరువు కోల్పోవటం అనేది చాలా క్లిష్టమైన పనిగా చెప్పవచ్చు. ప్రతి రోజు ఆఫీసుకు వెళ్ళే వ్యక్తులు ఒక ముఖ్యమైన ఆహార ప్రణాళిక గురించి తెలుసుకోవటం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వారు పని చేస్తున్నప్పుడు అనాలోచితంగా ఒక ఖచ్చితమైన ఆహారం ప్రణాళికను అనుసరించరు.

తీవ్రమైన జీవనశైలి మరియు పని ఒత్తిడి వలన పనిచేసే చాలా మంది వ్యక్తులు బరువు తగ్గటం అనే అంశం గురించి మర్చిపోతారు. అయితే మీరు మీ పనికి ఇబ్బందికి లేకుండా బరువు తగ్గవచ్చు. మీ పొట్ట,కొవ్వు తగ్గటానికి అనుసరించాల్సిన కొన్ని సాధారణ మరియు స్మార్ట్ చిట్కాలు ఉన్నాయి.

వైట్ కాలర్ ఉద్యోగాలు బరువు పెరుగుదల మిమ్మల్ని మరింత అనుకూలంగా మారేలా చేస్తాయి. పనిచేస్తున్న కొన్ని నెలల తర్వాత మీ పొట్ట ఒక కుండ వలె ఉండటం అనేది అసాధారణం కాదు. ప్రాథమికంగా ఒక ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక తరువాత కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలతో మీరు బరువు తగ్గవచ్చు.

పని చేసే ప్రజలు వారి ఆకలిని నియంత్రించటానికి జంక్ మరియు స్నాక్స్ తినడానికి మొగ్గుచూపుతారు. వారు జంక్ స్నాక్స్ తినడానికి బదులు ఒక ఆపిల్ లేదా బాదం వంటి ఆరోగ్యకరమైన మరియు తక్కువ కొవ్వు ఉన్న ఆహారాలు తినవచ్చు. పనిచేసే ప్రజలు అనవసరమైన బరువు పెరుగుతామని కొన్ని అవివేక ఆరోగ్య పొరపాట్లను చేస్తారు. ఉదాహరణకు పనిచేస్తున్న ప్రజలు దాదాపు ప్రతి రోజు అల్పాహారం లేదా భోజనం మొత్తం మానివేయటం అనేది అత్యంత సాధారణ పొరపాట్లలో ఒకటి. భోజనం మానివేయటం వలన ఆహారం కొవ్వుగా నిలువ అయ్యి ఆటోమేటిక్ గా బరువు పెరుగుదలకు దారి తీస్తుంది. పనిచేస్తున్న ప్రజలు బరువు తగ్గటం కొరకు ఆకలిని నియంత్రించుకోవటం అనేది మరొక సాధారణ పొరపాటు అని చెప్పవచ్చు. మీరు పనిచేస్తూ మరియు బరువు కోల్పోవాలని అనుకుంటున్నారా? అయితే మీరు ఇక్కడ ఉన్న కొన్ని స్మార్ట్ ఆరోగ్యకరమైన ఆహార చిట్కాలను అనుసరించండి.

స్నాక్స్ ఆపాలి

స్నాక్స్ ఆపాలి

పనిచేస్తున్న వ్యక్తులకు అనుసరించడానికి అవసరమైన అతి ముఖ్యమైన ఆరోగ్య సూచనలలో ఇది ఒకటి. సమర్థవంతమైన బరువు కోల్పోవడం కొరకు మీరు జంక్ మరియు వేయించిన ఆహారంతో అల్పాహారంను నిలిపివేయాలి. దానికి బదులుగా పండ్లు లేదా బాదం మరియు అక్రోట్ల వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవాలి.

చక్కెర నియంత్రణ

చక్కెర నియంత్రణ

ఒక కప్పు కాఫీ లో రెండు టీస్పూన్లు పంచదార వేసుకుంటే నిజానికి దానిలో కొవ్వు కలిగి ఉంటుంది. చక్కెర రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అంతేకాక బరువు పెరుగుదలకు దారితీస్తుంది. పనిచేస్తున్న ప్రజలు బరువు కోల్పోవడం కొరకు చక్కెరకు బదులుగా తేనె వాడవలసిన అవసరం ఉంది.

లెమన్ వాటర్

లెమన్ వాటర్

పనిచేస్తున్న ప్రజలు ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ వేడి నీటిలో నిమ్మరసం,తేనే కలిపి త్రాగాలి. ఇది బరువు తగ్గడం కొరకు సహాయం చేస్తుంది. అంతేకాక హానికరమైన విషాన్ని మరియు ఫ్రీ రాడికల్స్ ను శరీరం నుండి నిర్విషీకరణ చేస్తుంది.

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లు మరియు బెర్రీలు బరువు కోల్పోవడం కొరకు సులభమైన మార్గం అని చెప్పవచ్చు. పనిచేసే ప్రజల అల్పాహారం లేదా భోజనం సమయాల్లో కొన్ని సిట్రస్ పండ్లను అల్పాహారంలో ఉపయోగించవచ్చు.

ఓట్స్

ఓట్స్

అల్పాహారం మానివేయటం అనేది సరైన ఎంపిక కాదు. తక్కువ కాలరీలు గల అల్పాహారంను తీసుకోవాలి. పనిచేస్తున్న ప్రజలు బరువు తగ్గటానికి వోట్మీల్ ఒక ఆదర్శవంతమైన అల్పాహారం అని చెప్పవచ్చు. దీనిలో రుచి కొరకు డ్రై ఫ్రూట్స్,పండ్లను జోడించండి.

లిఫ్ట్ వాడటం మానాలి

లిఫ్ట్ వాడటం మానాలి

లిఫ్ట్కి బదులుగా మెట్లు ఎక్కటం అలవాటు చేసుకోండి. ఈ విధంగా చేయుట వల్ల హృదయ స్పందన రేటు మరియు రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతేకాక కొవ్వును కరిగిస్తుంది.

నీరు త్రాగాలి

నీరు త్రాగాలి

నీరు మిమ్మల్ని సంపూర్ణంగాను మరియు హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. నీటిని ఎక్కువగా త్రాగటానికి ప్రయత్నించాలి. ఇది శరీరం నుండి విషాన్ని బయటకు తొలగించి వేస్తుంది. అంతేకాక ఆకలిని నియంత్రిస్తుంది.

సలాడ్

సలాడ్

మీరు భోజనం కొరకు దోసకాయ,టమోటా మరియు క్యారట్లు వంటి కొన్ని తాజా కూరగాయలతో సలాడ్ లను సిద్దం చేసుకోండి. ఇవి తేలికగా ఉండటమే కాకుండా కడుపు నిండుతుంది. కూరగాయలలో ఉప్పు కలపకండి. ఎందుకంటే ఉప్పు కలపటం వల్ల ఎక్కువ నీటిని స్రవిస్తాయి.

డైజిస్టివ్ బిస్కట్స్

డైజిస్టివ్ బిస్కట్స్

సాదారణంగా మనము కాఫీ లేదా టీ తో క్రీము బిస్కెట్లను ఇష్టపడతాము. క్రీమ్ బిస్కెట్లలో కృత్రిమ తియ్యని పదార్థాలు ఉండుట వల్ల బరువు పెరుగుట మరియు మధుమేహంనకు దారితీస్తుంది. కాబట్టి క్రీము బిస్కెట్లకు బదులుగా డైజిస్టివ్ బిస్కట్స్ తీసుకోవాలి.

పఫ్స్

పఫ్స్

మీరు పని మరియు బరువు తగ్గాలని అనుకుంటే బేకరీ ఫుడ్ ను మర్చిపోవలసిన అవసరం ఎంతైనా ఉంది. వేయించిన పఫ్స్ మరియు పఫ్స్ కేవలం శరీరంలో కొవ్వు నిల్వలను పెంచుతాయి.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

గ్రీన్ టీ బరువు తగ్గటానికి మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం చాలా ప్రాచుర్యం పొందింది.

భారీ లంచ్ తగ్గించాలి

భారీ లంచ్ తగ్గించాలి

బరువు తగ్గాలనుకొనే వారు పాటించాల్సిన ఆరోగ్య చిట్కాలలో మొదటిది భారీ లంచ్ తగ్గించటం. మీరు ఎక్కువగా లంచ్ చేయుట వల్ల సోమరితనము మరియు నిద్ర వస్తుంది. అంతేకాక శరీరం లో కొవ్వు కూడా చేరుతుంది. ఎందుకంటే లంచ్ తర్వాత శరీర కదలికలు లేకపోవడం వలన అని చెప్పవచ్చు.

గ్రిల్డ్ (కాల్చిన ) ఆహారం

గ్రిల్డ్ (కాల్చిన ) ఆహారం

మాంసాహారులు కాల్చిన చికెన్, చేపల వంటి ఆహారపదార్ధాలను అతిగా తీసుకుంటారు. జిడ్డు గల ఇటువంటి ఆహార పదార్దాలు ఆరోగ్యకరమైనవి కావు.

నిద్ర సమయాలు

నిద్ర సమయాలు

చాలా మంది పని చేసే నిపుణులు చాల లేటుగా పడుకోవటం అలవాటుగా ఉంటుంది. మీ శరీరం తక్షణమే ప్రభావితం కావాలంటే సరైన నిద్ర అవసరము. నిద్ర లేకపోవడం వలన ఒత్తిడి,బరువు పెరుగుట,నిద్రలేమి వంటి మొదలైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

రాత్రి భోజనం

రాత్రి భోజనం

పడుకోవటానికి రెండు గంటల ముందు రాత్రి భోజనం చేయాలి. ఇది బరువు తగ్గాలనుకొనే వారికీ అనుసరించవల్సిన సమర్థవంతమైన ఆరోగ్య సూచన అని చెప్పవచ్చు. రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పొతే బరువు పెరుగుట మరియు అజీర్ణంనకు దారితీస్తుంది. కాబట్టి రాత్రి భోజనమునకు పడుకోవటానికి మద్య కనీసం రెండు గంటల విరామం ఉండాలి.

Story first published: Tuesday, September 10, 2013, 10:34 [IST]
Desktop Bottom Promotion