Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ఆరోగ్యమైన దంత సంరక్షణ కోసం ఫ్లాసింగ్
రోజూ ఫ్లాసి౦గ్ చేయడం సరైన దంత పరిశుభ్రతకు ముఖ్యమైన అంశం. చిగురువాపుకు దారి తీసే గారగా మారే పాచిని, చిగురు వ్యాధులను ఇది తొలగిస్తుంది. దంత వైద్యుడు లేదా పరిశుభ్రత నిపుణుడి చేత క్రమం తప్పకుండా శుభ్రం చేయించుకోవడం వల్ల గారను తగ్గించుకోవచ్చు. ఫ్లాసి౦గ్ గుండె పోటును, గుండె జబ్బులను కూడా నిరోధిస్తుందని అధ్యయనాలు నిరూపించాయి. మీ ఆరోగ్యాన్ని, చిరునవ్వును మెరుగుపరచుకోవడానికి ప్రతిరోజూ ఫ్లాసింగ్ చేయ౦డి.
ప్రాముఖ్య౦:
టూత్ బ్రష్ చేరడానికి వీలులేని ప్రదేశాలలో పేరుకుపోయిన పాచిని, ఆహార అణువులను తొలగించడానికి ప్రజలు కనీసం రోజుకు ఒకసారి ఫ్లాసి౦గ్ చేయాలి. బాక్టీరియా ని కలిగిఉండి, దంతక్షయానికి కారణమయ్యే ఈ పాచి చిగుళ్ళ వాపు, చిగుళ్ళ వ్యాధికి కూడా దారితీస్తుంది. బ్రష్ చేసిన తరువాత నాలుగు గంటలలోనే ఈ పాచి ఏర్పడుతుంది. ఈ పాచిని తొలగించక పోతే, అది గట్టిపడిపోయి గారగా మారుతుంది. ఈ గారని దంతవైద్యుడు, పరిశుభ్రత నిపుణుడు మాత్రమె తొలగించగలరు.
హెచ్చరికలు:
ఎక్కువ ప్రమాదకరమైన సూక్ష్మ క్రిములు గారను పెంపొందించి, విష పదార్ధాలను అభివృద్ది పరుస్తుంది. ఈ విషక్రిములు మనిషి చిగుళ్ళకు దురద కలిగించి, చిగురు వాపును కలిగిస్తాయి. చిగురువాపు వ్యాధి మరింత ముదిరి విషపదార్ధాలు దంతాలకు ఆధారంగా వుండే ఎముకలపై దాడి చేసే పెరియోడాన్టిస్ వ్యాధికి దారి తీస్తాయి. దీని వల్ల ఎముక అరిగిపోయి పళ్ళు వదులౌతాయి, ఒక్కోసారి పడి పోవచ్చు కూడా.
అంశాలు:
ఫ్లాసింగ్ వల్ల గుండె పోటులు, గుండె వ్యాధులు కూడా నివారించవచ్చని అధ్యయనాలు నిరూపించాయి. శరీరంలో నిరంతరం వాపు వుండడం వల్ల పెరియోడాన్టిస్ లేదా చిగురువాపు వ్యాధి రెండూ గుండెజబ్బులకు దారితీసే ప్రమాదకరమైన వ్యాధులు. గుండె పోటు వచ్చిన రోగులలో జరిపిన ఒక అధ్యయనంలో తీవ్రమైన పెరియోడాన్టిస్ రావడం వల్ల గుండె పోటు వచ్చే అవకాశం గణనీయంగా పెరిగినట్టు తెలిసింది.

నివారణ/పరిష్కారం:
ఫ్లాసింగ్ వల్ల సౌ౦దర్యపరమైన ప్రయోజనాలు కూడా వున్నాయి. అసహ్యంగా కనిపించే గార పట్టడాన్ని అది ఆపుతుంది, నోటి దుర్వాసనను నివారిస్తుంది. ఫ్లాసింగ్ నోటి దుర్వాసనను ఎలా నివారిస్తుందో తెలియాలంటే ఒక సారి ఫ్లాసింగ్ చేసి తీసేవేసిన మురికిని వాసన చూస్తె సరి.
రకాలు:
మైనం పూసినవి, పూయనివి, వెడల్పువి, సాదావి, మింట్, లవంగం లాంటి రుచులతో ఉండేవి లాంటి చాలా రకాల ఫ్లాస్ లు దొరుకుతాయి. అన్నీ ఒకేలా పని చేస్తాయి. మీ పళ్ళ మధ్య ఖాళీ ఎక్కువుంటే వెడల్పుగా వుండే ఫ్లాస్ వాడాల్సి రావచ్చు కానీ, అసలంటూ ఒక ఫ్లాస్ తీసుకుని రోజూ వాడడం ముఖ్యం. గారను తొలగించలేవు కాబట్టి వాటర్ పిక్ లు ఫ్లాస్ అంత సమర్ధంగా పనిచేయవు.
పని తీరు: ఫ్లాస్ ను మెల్లిగా పళ్ళ మధ్యలో పైకి, క్రిందికి, అలాగే చిగుళ్ళకి పళ్ళకి మధ్యా రుద్దుతూ వుండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
