Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
బ్రేక్ ఫాస్ట్ ను తినకుండా ఎందుకు ఉండకూడదు?
ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం అనేది, ఆరోజుకు అత్యంత ముఖ్యమైనటువంటి భోజం(మీల్). ఎట్టిపరిస్థితుల్లోనూ బ్రేక్ ఫాస్ట్ ను మానకూడదు. ఉదయం తీసుకొనే ఆహారం ఏదో ఒకటి తినాలని అంటుంటారు. ఇంకా బ్రేక్ ఫాస్ట్ ను కింగ్ లా తినాలి అంటారు. అయితే ఎంత మంది ఇలా చేస్తారు?బ్రేక్ ఫాస్ట్ ను దాటవేయడానికి అనేక కారణాలను చెబుతుంటారు. బ్రేక్ ఫాస్ట్ ను తినకపోవడం వల్ల మనంతట మనం మన శరీరాన్ని, ఆనారోగ్యానికి గురిచేస్తుంటాం.
పెద్దలు కానీ, పిల్లలు కానీ, ముఖ్యంగా మహిళలు బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం చాలా చెడ్డ అలవాటు. ఎందుకంటే, ఎప్పైడైతే మనం బ్రేక్ ఫాస్ట్ ను దాటవేస్తామో, అప్పుడు మన శరీరంలో శక్తి తగ్గిపోతుంది. జీవక్రియలు ఆలస్యం అవుతాయి. అది మన శరీర ఆరోగ్యానికి మంచిది కాదు.
మీరు లేట్ గా నిద్రలేవడం మరియు బ్రేక్ ఫాస్ట్ ను తినకపోవడం, వంటివి రొటీన్ గా ఉన్నట్లైతే, వెంటనే మీరు ఈ పద్దతిని మార్చుకోవాలి. మీరు డైట్ లో ఉన్నప్పుడు, మీరు ఖచ్చితంగా హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు లాస్ట్ మీల్స్ తీసుకొన్న 7-8గంటల తర్వాత బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా అవసరం. ఆ ఏడు, ఎనిమిది గంటల్లో మీరు కోల్పోయిన ఎనర్జీని తిరిగి పొందడానికి, ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. మరియు అవసరం. అయినా కూడా మీరు ఇప్పటికీ బ్రేక్ ఫాస్ట్ ను దాటవేయాలని చూస్తుంటే, దాని వల్ల ఎదురయ్యే సమస్యలు ఈ క్రింది విధంగా ఉన్నాయి వాటిని పరిశీలించండి...

ఎనర్జీని అంధిస్తుంది:
మీరు రోజుకు సరిపడా శక్తిని పొందాలంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ఉడికించిన గుడ్లను తీసుకోవచ్చ. ఎందుకంటే ఉడికించిన గుడ్లలో అత్యధికంగా ప్రోటీనులు ఉంటాయి. ఇవి మీలో ఎనర్జీ లెవల్స్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి. ముఖ్యంగా, ఇది మీరు తిరిగి రెండవసారి భోజనం తీసుకొనే సమయం వరకూ ఆకలి కాకుండా ఉండేందుకు సహాయపడుతుంది

మీలో అప్రమత్తతను మెరుగుపరుస్తుంది:
మీరు బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్(దాటవేసినప్పుడు)చేసినప్పుడు, మీరు నిద్ర వచ్చినట్లు అనిపిస్తుంది మరియు నీరసంగా ఉంటారు?అయితే, ఎప్పుడైతే మీరు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటారో అప్పుడు తేడాను గమనించండి. బ్రేక్ ఫాస్ట్ ను ఎందుకు స్కిప్ చేయకూడదు అన్నదానికి ఇది ఒక ప్రధానమైన కారణం.

బరువు తగ్గించే మార్గం:
బ్రేక్ ఫాస్ట్ ను ఎందుకు దాటవేయకూడదు అన్నదానికి మరో ముఖ్య కారణం ఇది వెయింట్ లాస్ ప్రోగ్రామ్ ను అటకాయిస్తుంది. బరువు తగ్గాలనుకొనే వారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ఓట్స్ ను తీసుకోవడం ఆరోగ్యకరం మరియు బరువు తగ్గిస్తుంది.

డయాబెటిస్ తగ్గిస్తుంది:
మధుమేహంతో బాధపడుతున్నారా? బ్రేక్ ఫాస్ట్ ను దాటవేయకూడదన్నడానికి మరో ముఖ్య కారణం మధుమేమం. బ్రేక్ ఫాస్ట్ ను దాటవేయడం వల్ల రక్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్ హఠాత్తుగా పెరుగుతుంది. కాబట్టి, ఈ సమస్యలన్నింటిని నివారించడానికి ఒక ఆరోగ్యకరమైన మీల్ ను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు.

బ్లడ్ ప్రెజర్ మెరుగుపరుస్తుంది:
మీకు గుడ్లు అంటే ఇష్టమైతే, మీరు మీ రక్తపోటును ట్రాక్ చేయాలి. హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడేవారి సమస్యను నివారించడానికి గుడ్డులోని తెల్లని పదార్థం అద్భుతంగా సహాయపడుతుంది.

గుండె పోటు ప్రమాధం ఉండదు:
మీ శరీరానికి తగినంత ఎనర్జీని అంధించినప్పుడు, మీ శరీరంలో అవయవాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. మరియు శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె . రెగ్యులర్ గా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత రోగాలను దూరంగా ఉంచే న్యూట్రీషియన్స్ మరియు ఎనర్జీని మీ గుండెకు అంధిస్తాయి.

తరచూ మనస్సు మారడాన్ని నిరోధిస్తుంది :
పరిశోధనల ప్రకారం, హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల, తరచూ మనస్సు మారడాన్ని నిరోధిస్తుంది. కాబట్టి, మూడ్ స్వింగ్స్ నివారించడానికి రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం.



Click it and Unblock the Notifications
