Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మిమ్మల్ని స్మార్ట్ గా మార్చే 10 బెస్ట్ డ్రింక్స్
సాధారణం కొన్ని సూపర్ మార్కెట్లలో కూల్ డ్రింక్ బాటిల్ లేబుల్స్ ను గమనించినట్లైతే వాటి మీద ‘గెట్ స్మార్ట్',‘బి స్ట్రాంగ్', ‘ఫౌంటైన్ ఆఫ్ యూత్', ‘లూజ్ వెయిట్', మరియు ‘లిఫ్ట్ మై మూడ్' వంటి పదాలెన్నో లేబుల్స్ ను మనం గుర్తింవచ్చు . అయితే అనుకోకుండా ఇవన్నీజరగకపోవచ్చు. ఎందుకంటే బరువు తగ్గిస్తాయి లేదా మీకు పూర్తి స్ట్రెంగ్త్ అందిస్తాయి అన్న ప్యాక్ ఉన్నవాటిలో చాలా వరకూ షుగర్ తో తయారుచేయబడి ఉంటాయి. అటువంటివి మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు, ఈ ఆర్టికల్లో నిజంగా మీ బ్రెయిన్ పవర్ ను పెంచే కొన్ని పానీయాల లిస్ట్ ను ఎంపిక చేసుకోవడం జరిగింది.
ఈ డ్రింక్స్ ను మీరు త్రాగినప్పుడు మీ ఐక్యూ లెవల్స్ మెరుగుపడవచ్చు లేదా పెరగవచ్చు. ఈ పానీయాలు ప్రత్యేకించి ఎటువంటి కంపెనీలు తయారుచేయబడినవి కావు, స్వతహాగా, నేచురల్ గా మనమే తయారుచేసుకోగలిగిన పానియాలా ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఎంపిక. అలాగే బ్రెయిన్ పవర్ కానీ, మనలో శక్తి సామర్థ్యాలు కానీ మెరుగుపడాలంటే ఎటువంటి పానియాలు తీసుకోవాలి. ఎటువంటి పానీయాలు తీసుకోకూడదని వాటి గురించి తెలుసుకొని ఉండాలి. మోడ్రన్ గా తయారుచేసిన ఆల్కహాల్ తీసుకోవడం ఒక విధంగా మంచిదే మరియు ప్రయోజనకరమే. కానీ అతిగా సేవించడం వల్ల కాలేయం పాడవడం, బ్రెయిన్ పవర్ తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది.
షుగర్ డ్రింక్ హార్ట్ మరియు అధిక బరువు వల్ల నడుము వద్ద క్రొవ్వు పెరిగి ఆరోగ్యానికి హాని తలపెట్టడం మాత్రమే కాదు, కాస్త నిధానంగా నరాల సమస్యలకు, మెమరీ మరియు ఏకాగ్రత మీద ప్రభావం చూపుతుంది. ఆర్టిఫిషియల్ స్వీట్ నర్స్ మరియు హెయిర్ డైస్ వంటివి బ్రెయిన్ మీద ప్రభావం చూపుతుంది. చివరకు సాధారణ జ్ఞానం మీద కూడా ప్రభావం చూపుతుంది. చాలా పరిశోధనల ప్రకారం కార్సినోజెనిక్ మరియు మ్యూటాజెనిక్ దారితీస్తుందని నిరూపించబడ్డాయి. కాబట్టి మీ స్మార్ట్ ఫోన్ లో కొన్ని బ్రెయిన్ గేమ్స్ ను ఆడటం ప్రారంభించండి. అలాగే పాతపద్దతుల క్రాస్ ఓర్డ్ పజిల్స్ ఆడటం మరియు కొన్ని హెల్తీ డ్రింక్ త్రాగడం వల్ల మీ మేధస్సు మెరుగుపడుతుంది. మరి మేధస్సును పెంచే కొన్ని హెల్తీ డ్రింక్స్ మీకోసం...

దానిమ్మ జ్యూస్:
ఈ అన్యదేశపు పండులో జ్ఞాపకశక్తిని మరియు మెమరీ పవర్ ను మెరుగుపరిచే అత్యద్భుతమైన యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి దానిమ్మ గింజల జ్యూస్ ను రెగ్యులర్ గా మీరు తీసుకోవడం వల్ల మిమ్మల్నితెలివివంతులుగా చేస్తుంది.

గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ
టీ:
ఒక కప్పు గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ ఎంపిక చేసుకోవచ్చు. ఒక కప్పు గ్రీన్ టీ త్రాగడం వల్ల మెదడును చురుకుగా ఉంచుతుంది. అందుకు అవసరం అయ్యే ఇజిసిజి, లేదా ఎపిగలోకొటెచిన్-3-గల్లేట్ ను గ్రీన్ టీలో కనుగొనబడినది. ఇవి బ్రెయిన్ సెల్స్ ఉత్పత్తిని పెంచడంతో పాటు, బ్రెయిన్ ను షార్ప్ గా ఉంచుతుంది. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి మరియు ఒక కప్పుబ్లాక్ టీ ని రెగ్యులర్ గా త్రాగడం వల్ల రియాక్షన్ టైమ్ ను మనం గమనించవచ్చు.

డార్క్ చాక్లెట్ కోక:
కోకాలో ఉండే ఫ్లేవనాయిడ్స్ బ్లడ్ వెజల్స్ విశ్రాంతి పొందడానికి సహాయపడుతాయి. మొత్తంలో బ్రెయిన్ డ్యామేజింగ్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఒక కప్పు హాట్ చాక్లెట్ త్రాగడం వల్ల స్ట్రోక్ మరియు జన్మసిద్ధ లోపాల యొక్క ప్రమాధాన్ని తగ్గించవచ్చు.

బెర్రీ స్మూతీస్
బెర్రీస్ మరియు బ్లూబెర్రీస్ రెండింటిలోనూ బ్రెయిన్ కు సంబంధించిన న్యూరోనల్ యాక్టివిటి మరియు బ్రెయిన్ కు అనుసందానించబడినది మరియు మెంటల్ డిక్లెయిన్ ను నివారిస్తుంది. అంతే కాదు మెమీరితో పాటు జ్జాన నైపుణ్యం మెరుగుపరుస్తుంది.

దాల్చిన చెక్క మరియు పసుపు టీ:
ఇది ఒక డైలీ సీక్రెట్ డ్రింక్, మరియు మరికొన్ని హెర్బ్స్ తో తీసుకోవచ్చు, దాల్చిన చెక్కలో ప్రోయంతోసైయాంధిన్ మరియు సినామల్ డిహైడే అనే రెండు కాంపౌంట్స్ ఉన్నాయి. ఇది మొదడులో ప్రోటీన్స్ ను తగ్గిస్తుంది.
పసుపు క్రియాశీల భాగం, ఇందులో ఉండే కుర్క్ మిన్ అనే కాంపోనెంట్ వల్ల చిత్తవైకల్యాలను ప్రేరేపిస్తాయని చూపించబడినది. ఓలియోకాంతల్ కాంపౌండ్ కలిగిన ఆలివ్ ఆయిల్ ను కూడా చేర్చుకోవచ్చు. ఆల్జైమర్స్ కు వ్యతి రేకంగా పనిచేస్తుంది.

ఆల్కహాల్ :
ఆల్కహాల్లో వోడ్కా, బీర్ లేదా వైన్ మెదడులోని కంటి ఫంక్షన్ ను మెరుగుపరుస్తాయి. అయితే మీలో బిఎసి 0.07కు మించకూడదు. ఎందుకంటే ఇది అధికమవ్వడంతో ఆరోగ్యానికి హాని చేస్తుంది.

నీళ్ళు:
రోజూ కనీసం మూడు లీటర్ల నీళ్లు తీసుకోవాలి. జీవనశైలిని బట్టి ఆ మోతాదును పెంచుకోవచ్చు. నీరు, చర్మం లోని తేమను కాపాడుతుంది. కాలుష్యాన్ని బయటికి పంపుతుంది. రక్తాన్ని శుద్దిచేస్తుంది. బయటికివెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నీళ్లుతీసుకెళ్లడం మంచిది. వేసవిలో దాహంగా అనిపించేదాకా ఆగక్కర్లేదు. తీరికి దొరికినప్పుడుల్లా గొంతు తడుపుకోవడమే మంచిది. తగినన్ని నీరు త్రాగడం వల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్ అందించబడి, మెదడు చురుకుగా పనిచేసేందుకు సహాయపడుతుంది. అందువల్ల మీరు ఎప్పుడు డీహైడ్రేషన్ కు గురైనా మరేది ఆలోచించి తలనొప్పికి గురికాకుండా వెంటనే నీరు త్రాగాలి.

రెడ్ వైన్:
రెడ్ వైన్ లో ఫాలీఫినాల్స్ కనుగొనబడినది. ఇది మెదడకు రక్తప్రసరణను పెంచుతుంది, అందువల్ల మొదడు సామర్థ్యం పెంచుకోవడానికి ఇది ఒక బూస్ట్ లా పనిచేస్తుంది. కాబట్టి మితంగా రెడ్ వైన్ తీసుకోవడం మెదడకు మంచిది.

బీట్ రూట్, క్యారెట్ మరియు ఆపిల్ జ్యూస్:
బీట్ రూట్, క్యారెట్ మరియు ఆపిల్ జ్యూస్: ఇవి ఫుడ్ బ్లెండర్స్ . అంతే కాదు, ఇవి కలర్ఫుల్ బెవరేజస్ మాత్రమే కాదు, వీటిలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి.
బీట్ రూట్ మొదడులో నైట్రస్ ఆక్సైడ్ ను పెంచుతుంది, అది, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. క్యారెట్ లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది ఇది కళ్ళు ఆరోగ్యానికి మాత్రమే కాదు, మెదడు క్షీణత స్ధంబనకు సహాయపడుతుంది. ఆపిల్స్ న్యూరోడిజనరేటివ్ డిసీజ్ మరియు ఆల్జైమర్స్ ను నివారిస్తుంది. అందుకే రోజుకు ఒక్క ఆపిల్ తింటే డాక్టర్ల అవసరం ఉండదంటారు.

కొబ్బరి నీళ్ళు:
కొబ్బరినీళ్లు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే మరో హెల్దీ డ్రింక్. కొవ్వు అసలే ఉండదు. చెక్కర శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది.ఇది మొత్తం ఆరోగ్యానికి సహాయపడుతుంది. ముఖ్యంగా బ్రెయిన్ హెల్త్ కు మంచిది. శరీరాన్ని చల్లబరుస్తుంది. డిహైడ్రేట్ అయిన శరీరాన్ని తిరిగి హైడ్రేట్ చేస్తుంది. జీర్ణక్రియను వృద్ధి చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. క్యాన్సర్ కారకాలను తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచడం మొదలుకొని మూత్రపిండాల్ని శుభ్రం చేయడం దాకా..బోలెడన్ని ఆరోగ్య సేవలు అందిస్తుంది. కొబ్బరి నీళ్లలో చిటికెడు ఉప్పు, పంచదార కలుపుకుని తాగితే డీహైడ్రేషన్ సమస్య ఉండదు. కొబ్బరి నీళ్ళలో ఉండే ఎలక్ట్రోలైట్స్, విటమిన్స్ మరియు మినిరల్స్ బ్లడ్ సర్కులేషన్ ను మరియు బ్లడ్ ఫ్లోను మెరుగుపరుస్తుంది.



Click it and Unblock the Notifications











