For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్రకు ఉపక్రమింపచేసే 13 ఆశ్చర్యకరమైన ఆహారాలు

|

నిద్రలేమి..ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, సరైన ఆహారం తీసుకోకపోవడం...ఇలా పలు రకాల కారణాల వల్ల చాలమంది నిద్రకు దూరమైపోతున్నారు. రాత్రి పూట కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్రపోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

అలాగే రాత్రుళ్ళు హాయిగా, ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల మనసంతా ఉత్సాహంగా ఉంటుంది. దీనితో పాటు శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడం, బీపి అదుపులో ఉండటం, చర్మానికి మెరుపు...ఇలా చాలా రకాలుగా మేలు జరుగుతుంది. ఈక్రమంలో రాత్రుళ్లు హాయిగా నిద్ర పట్టాలంటే ఏయే ఆహార పదార్థాలు మన రెగ్యులర్ డైట్ లో ఉండాలో చూద్దాం...

గుడ్డు:

గుడ్డు:

తీసుకునే ఆహారంలో ప్రోటీన్ల లేమి కూడా నిద్రలేమికి కారణం కావచ్చు. కాబట్టి ప్రోటీన్లు ఎక్కువగా లభించే ఉడికించిన కోడిగుడ్లను తినడం మంచిది.

పాలు:

పాలు:

రాత్రిళ్ళలో పడుకొనే ముందు ఓ గ్లాసు గోరువెచ్చటి పాలు తాగితే ఎలాంటి ఒత్తిడైనా మాయమై ప్రశాంతంగా నిద్రపడుతుంది. అందుకు కారణం పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లమే. అలాగే పాలలో అధిక మొత్తంలో ఉండే క్యాల్షియం శరీంరలో మెలటోనిన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. పాలు మాత్రమే కాకుండా పెరుగు, నెయ్యి, లాంటి పాల పదార్థాల్ని కూడా ఆహారంలో భాగంగా తినడం వల్ల రాత్రుళ్ళు బాగా నిద్రపట్టే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది రాత్రుళ్ళు పడుకునే ముందు పాలు తాగడం మనం చూస్తూనే ఉంటాం..

పాలకూర:

పాలకూర:

పాలకూరలో అధికంగా లభించే పొటాషియం, క్యాల్షియం..అనే పోషకాలు రాత్రుళ్ళు హాయిగా నిద్రపోవడానికి సహకరిస్తాయి. అలాగే ప్రతి రోజూ పాలకూర తినే వాళ్లకు ఒత్తిళ్లు, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పుల బాధలు దరిచేరకుండా ఉంటాయి. దీంతో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖంగా నిద్రపోవచ్చు. అలాగే ఇది కూడా ప్రయత్నించవచ్చు. ఒక కప్పు నీటిలో రెండు పాలకూర ఆకులు వేసి ఐదు నిముషాలు మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారేదాకా అలాగే ఉంచి తర్వాత వడకట్టి చక్కెర వేసుకోవాలి. బాగా కలుపుకొని నిద్రపోవడానికి అరగంట ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

చెర్రీలు:

చెర్రీలు:

ప్రతి రోజూ రాత్రి పడుకోవడానికి కొన్ని గంటల ముందు కొన్ని చెర్రీలను తింటే చాలా హాయిగా నిద్రపడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. దీనికి కారణం..వీటిలో ుండే మెలనిన్ అనే రసాయనమే. దీని వల్ల శరీరంలోని అవయవాల పనితీరు సక్రమంగా జరుగుతుంది.

బాదం:

బాదం:

మన శరీరంలో ఎప్పుడైతే మెగ్నీషియం స్థాయిలు బాగా తగ్గిపోతాయో..అప్పుడు అస్సలు నిద్రపట్టదని ఓ అధ్యయనం వెల్లడించింది. కాబట్టి మెగ్నీషియం ఎక్కువగా లభించే బాదం పప్పును ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఈ ఖనిజం కండరాలను విశ్రాంత పరిచి సుఖనిద్రకు కారణం అవుతుంది. అలాగే బాదంపప్పులో ఉండే ప్రోటీన్లు రక్తంలోని చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచడంలో సమాయపడుతాయి. కాబట్టి, రాత్రుళ్లు త్వరగా నిద్రపట్టాలంటే పడుకోవడానికి కనీసం గంట ముందు కొన్ని వేయించిన బాదం పప్పుల్ని లేదా బాదం పప్పుతో తయారైనా బటర్ ను ఒక చెంచా తినడం మంచిది.

వేరుశెనగ:

వేరుశెనగ:

వేరుశెనగలో ఉండే నియాసిన్ వల్ల శరీరంలో సెరటోనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఒత్తిళ్ళన్నింటి నుంచి విముక్తి కలిగించి నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది. కాబట్టి ప్రతి రోజూ వీటిని ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. ఇవేకాకుండా మెలటోనిన్, ట్రిప్టోఫాన్ అధికంగా లభించే వాల్ నట్స్ కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలి.

ఓట్ మీల్:

ఓట్ మీల్:

ఓట్ మీల్ కూడా రాత్రుళ్లు బాగా నిద్రపట్టడానికి సహకరిస్తుంది. కాబట్టి పడుకోవడానికి ముందు ఒక కప్పు ఓట్స్ పాలతో తీసుకోవడం అలవాటు చేసుకోండి. దీనిలో క్యాల్షియం, ఫాస్పరస్, పొటీషియం, సిలికాన్, మెగ్నీషియం, ట్రిప్టోఫాన్..వంటివి అధికంగా లభిస్తాయి. అలాగే ఇది తినడం వల్ల మన శరీంరలో సెరొటోనిన్ అనే హార్మోన్ కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఫలితంగా బాగా నిద్రపడుతుంది.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

ఇంట్లో అప్పుడప్పుడూ బరువులు ఎత్తడం వల్ల కండరాల్లో నొప్పులు ఎదురవుతుంటాయి. దాంతో అసలు నిద్రపట్టదు. కాబట్టి, కండరాల్ని విశ్రాంతి పరిచే గుణం అరటిపండ్లలో ఉండే మెగ్నీసియం, పొటాషియం, వంటి ఖనిజాలకు ఉంది. కాబట్టి ప్రతి రోజూ అరటిపండ్లు తినడం మంచిది. దీనికోసం బాగా పండిన అరటిపండును తీసుకొని దాన్ని ఒక కప్పు పాలలో వేసి బాగా కలపండి. ఇలా తయారైన మిశ్రమాన్ని రాత్రి పడుకోవడానికి కనీసం గంట ముందు తీసుకుంటే సుఖంగా నిద్రపడుతుంది. అలాగే ఈ పండ్లలో నిద్రకు సహాకరించే విటమిన్ బి6, కార్భోహైడ్రేట్లు ఉంటాయి. విటమిన్ బి6 నిద్రకు ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఫలితంగా మాయిగా నిద్రపడుతుంది.

హెర్బల్ టీ:

హెర్బల్ టీ:

కెఫిన్ సంబంధిత పానీయాలు తాగడం ఎంత త్వరగా ఆపితే అంత మంచిది. వీటికి బదులుగా చామొమైల్ టీ లేదా గ్రీన్ టీ తీసుకోవచ్చు. వీటిలో ఉండే రసాయనాలు శరీరంలోని కండరాలు, నరాలను రిలాక్స్ చేసి ప్రశాంతంగా నిద్రపట్టేలా చేస్తాయి. కాబట్టి, ఈ రెండు హెర్బల్ టీలను వెంటనే మీ మెనూలో చేర్చేయండి.

ద్రాక్షపండ్లు:

ద్రాక్షపండ్లు:

రాత్రిపూట ద్రాక్షపండ్లు తిన్న తర్వాత హాయిగా నిద్రపడుతుంది..ఈ విషయం మీరెప్పుడైనా గమనించారా? వీటిలో నిద్రకు సహాయపడే మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. అలాగే వీటిలో గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే యాంటీఆక్సిడెంట్లు పాలీఫినోల్స్, ఫ్లెవనాయిడ్లు..మొదలైనవి అధిక మొత్తంలో ఉంటాయి.

చాక్లెట్:

చాక్లెట్:

చాక్లెట్ అంటే ఇష్టం లేని వారుంటారా చెప్పండి. ప్రతి రోజూ చాక్లెట్ తింటే దంతాలు పుచ్చిపోతాయేమోనని చాలా మంది భయపడుతుంటారు. కానీ రోజూ చాక్లెట్లు తినడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. దీనికి కారణం దీనిలో ఉండే ట్రిప్టోఫాన్, ఫినైల్ థైలమైన్ మెగ్నీషియం వంటివి నిద్రలేమిని దూరం చేయడంలో సహాయపడుతాయి.

గుమ్మడి గింజలు:

గుమ్మడి గింజలు:

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, ట్రిప్టోఫోన్ అనే రెండు పోషకాలు ఎక్కువగా లభిస్తాయ. ఇవి నిద్రబాగా పట్టేలా చేస్తాయి. అలాగే ఇవి గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ గింజల్లో శరీరానికి ఉపయోగపడే బి, సి, డి, ఇ, కె విటమిన్లు, జింక్, మోనో అన్ శ్యాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. నిద్రపోవడానికి వి సహాయపడుతాయి.

ట్యున చేపలు:

ట్యున చేపలు:

ఇదే విధంగా ప్రశాంతంగా నిద్రపట్టడానికి విటమిన్ బి6 సహాకరిస్తుంది. ఇది మన శరీరంలో మెలటోనిన్, సెరటోనిన్ ల ఉత్పత్తిని పెంచుతుంది. మానసిక ప్రశాంతనిచ్చే సెరొటోనిన్, నిద్రకు సహాయపడే మెలటోనిన్ ..ఈ రెండూ ట్యూనా చేపలో లభిస్తాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

English summary

13 Surprising Foods That Help You Sleep Well

What you eat will have a big influence on the quality of your sleep. You can easily sleep better by making a few changes and being sure to include foods that promote rest. Note, however, that you should not eat these foods immediately before going to bed, as that can keep you awake due to the increased blood flow to the digestive system; eat them one to two hours before you plan to turn in for the night.
Story first published: Monday, November 24, 2014, 17:13 [IST]
Desktop Bottom Promotion