Latest Updates
-
ఈ ఒక్క గింజలతో మూడు రకాల టిఫిన్స్.. పోషకాలు పుష్కలం, ప్రయోజనాలు మెండు.! -
అరటిపండు ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమయంలో తింటే మాత్రం గుండెకే ప్రమాదం! -
ఐరన్, ఫైబర్ పుష్కలం..పిండి రుబ్బే పనిలేకుండా 10 నిమిషాల్లోనే క్రిస్పీ రాగి బీట్ రూట్ దోశ.. -
మహారాష్ట్ర స్టైల్ గుత్తి వంకాయ కూర..ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రతి చిన్న సమస్యకి మందులు వాడటం ఎంత ప్రమాదమో తెలుసా.? -
పెళ్లిళ్ల స్పెషల్.. హైడ్రా పాత్ షాహి రెడ్ చికెన్.. బ్యాచ్లర్స్ సైతం సింపుల్గా చేసుకునేలా.! -
అమర్నాథ్ యాత్రికులకు అలర్ట్.. బడ్జెట్ ఎక్కడ, ఎంతవుతుంది.. పూర్తి వివరాలు.! -
చర్మ సౌందర్యాన్ని ఇట్టే పెంచే పాలకూర.. దాబా స్టైల్లో నోరూరించేలా ఇలా చేయండి.! -
ఇంట్లోకి మురికి రాకుండా చేసే 5 బెస్ట్ డోర్ మ్యాట్లు.. వర్షాకాలంలో బెస్ట్ ఆప్షన్స్.! -
గుండెకి మేలు, ఎముకలకి బలం.. ఇంకా ఎన్నో.. రోజూ మెట్లు ఎక్కితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.!
ప్రేగులో పరాన్న జీవులు సహజనివారణోపాయాలు
పొట్టలో (ప్రేగు)లో పరాన్నజీవులు(బద్దపురుగులు లేదా ఏలికపాములు) ఏర్పడుతుంటాయి. ఇవి సన్నగా, పొడవుగా ఉంటాయి, ఇవి మనం తీసుకొనే ఆహారాలలోని పోషకాలను పూర్తిగా గ్రహించివేస్తాయి. ఇవి రక్తం ద్వారా శరీరం మొత్తం వ్యాప్తి చెందుతాయి. ఈ పరాన్న జీవులు అంతర్గతంగా మరియు బహిర్గతంగా కూడా ఉంటాయి. బహిర్గత పరాన్న జీవులు కంటికి ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరియు అనేక పద్ధతుల ద్వారా సులభంగా తొలగిస్తారు. అయితే, అంతర్గత పరాన్నజీవులు గుర్తించడానికి మరియు వదిలించుకోవటం ఎక్కువ కృషి అవసరం అవుతుంది. బహిర్గత పరాన్న జీవులు అంటే తలలో పేనులు, శరీరం మీద ఏర్పడే పేనులు ఇవి చాలా సాధారణ ఇన్ఫెక్షన్స్ . తలలోపేను వంటి బాహ్య పరాన్న జీవులు మానవుల్లో చాలా అంటువ్యాధులకు కలిగిస్తాయి.
పారాసైట్స్ (పరాన్న జీవులు), బాహ్య పరాన్న జీవులు వ్యక్తిగత వస్తువులు(దుస్తులు బెడ్ షీట్లు) ద్వారా చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. అందువల్ల వీటి బారిన పడకుండా పూర్తిగా నివారించడానికి , ఇంట్లో ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండటానికి, తగిన జాగ్రత్తలు వెంటనే తీసుకోవాలి. ఈ పారాసైట్ ఇన్ఫెక్షన్ తో పోరాడాలంటే, మీరుయాంటీబయోటిక్స్ ను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అందుకు ఇంట్లోనే కొన్ని ప్రభావంతమైన నివరణ హోం రెమడీస్ కొన్ని ఉన్నాయి . ఈ హోం రెమెడీస్ పరాన్న జీవులను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా లోతైన చర్యను చేపట్టి వాటిని పూర్తిగా తొలగించేవిధంగా సహాయపడుతాయి. కడుపులో పు బద్దెపురుగు లేదా ఏలికపాము వంటి పరాన్నజీవులను నివారించుటకు సహాయపడే హోం రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం:

క్యారెట్స్ తినాలి:
అంతర్గత పరాన్న జీవులను నివారించడానికి క్యారెట్లు తినడం మంచి పరిహారం. రెండు క్యారెట్లను తీసుకొని, పైన చెక్కుతీసి, శుభ్రంగా కడిగి, ఉదయాన్ని పరగడుతో తినాల్సి ఉంటుంది.ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల పరాన్న జీవులు నివారించడబడటం మాత్రమే కాదు, భవిశ్యత్తులు పరాన్నజీవులు మీ శరీరంలో దాడి చేయకుండా నిరోధిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఎల్లప్పుడూ మీ ఆరోగ్యాన్ని హెల్తీగా మరియు క్లియర్ గా ఉంచడానికి ప్రయత్నించండి.

లెమన్ అండ్ పెప్పర్ మింట్:
ఒక కప్పు పుదీనా రసం తీసుకొని అందులో కొద్దిగా బ్లాక్ సాల్ట్ మరియు నిమ్మరసం జోడించాలి. ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం వల్ల మీ కడుపులో ఇన్ఫెక్షన్ కు గురిచేసే అన్ని రకాల పారాసైట్స్ ను తొలగించుకోవచ్చు.
మీ శరీరంలో పరాన్న జీవులు చేరడం వల్ల మీ శరీరంలో పోషకాహారలోపం మరియు మరియు మీశరీరంలో అనేక ఇతర సమస్యలకు గురిచేస్తుంది . అందుకే మీ జీవక్రియల నుండి వీటిని తొలగించడం వల్ల ఫర్ ఫెక్ట్ హెల్త్ కలిగి ఉంటారు.

పచ్చికొబ్బరి:
కొద్దిగా పచ్చికొబ్బరిని నమలడం వల్ల కూడా పొట్టలో చేరిన పరాన్న జీవులు నివారించబడుతాయి. మీ పొట్టలో పరాన్నజీవులు ఉన్నట్లు మీరు అనుమానిస్తున్నట్లైతే కాస్త పచ్చికొబ్బరి నోట్ల వేసుకొని నమలండి.
అలాగే కొబ్బరిబోండాం త్రాగడం వల్ల కూడా అంతే ప్రభావం చూపుతుంది. కొన్ని రోజులు క్రమం తప్పకుండా కోకోనట్ వాటర్ మరియు పచ్చికొబ్బరిని తిని చూడండి ఫలితం మీకే తెలుస్తుంది.

ఆముదం మరియు పాలు:
ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకొని అందులో రెండు టీస్పూన్ల ఆముదనూనెను మిక్స్ చేయాలి. ఈ మిశ్రమ పాలను ఉదయం పరగడుపుతో త్రాగడం వల్ల ప్రేగుల్లో చేరిన పరాన్న జీవులు మలద్వారం ద్వారా విసర్జింపబడుతాయి. ఇలా క్రమం తప్పకుండా రెగ్యులర్ గా ఒక వారం పాటు చేయండి.

నిమ్మవిత్తనాలు:
నిమ్మవిత్తనాలను నమలడం ద్వారా కూడా పారాసైట్ నివారించబడుతాయి . నిమ్మకాయ విత్తనాలు తీసుకొని వాటిని పొడి చేసి, తర్వాత పేస్ట్ చేయాలి. ఈ పొడిని ఒక పెద్దగ్లాసు నీళ్ళలో వేసి మిక్స్ చేసి త్రాగాలి. దీన్ని లెమన్ జ్యూస్ లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. వీలైతే, ఈ విత్తనాలను నోట్లో వేసుకొని నమిలి మ్రింగడానికి ప్రయత్నించండి.

దానిమ్మ జ్యూస్:
పొట్టలో ఉన్న పరాన్న జీవులు నుండా ఉపశమనం పొందడానికి దానిమ్మరసం బాగా సహాయపడుతుంది. దాన్నిమ్మ గింజలను నేరుగా తినడంకానీ లేదా జ్యూస్ ను త్రాగడం కానీ చేయాలి . మీ డైలీ డైట్ లో దానిమ్మను చేర్చుకోవడం ద్వారా పరాన్నజీవుల దాడిని నివారించి, పొట్టను క్లీన్ గా మరియు హెల్తీగా ఉంచుతుంది.

బొప్పాయి విత్తనాలు:
సహజంగా రుచికరంగా ఉండే బొప్పాయిని తినంగానే, అందులోని విత్తనాలను విసిరేస్తుంటాం. అలా చేయకుండా విత్తనాలను తినడం వల్ల కూడాపొట్టలో చేరిన పరాన్నజీవులను వదిలించుకోవడానికి సహాయపడుతాయి. కాబట్టి, నెక్ట్ టైమ్ వీటిని పారేయకుండా మెత్తగా పేస్ట్ చేసి , ఆపేస్ట్ ను తినడం ద్వారా కడుపును శుభ్రపరిచి ప్రేగుల్లో పరాన్న జీవులు లేకుండి క్లీన్ గా ఉంచుతుంది.

టమోటోలు:
టమోటోలను స్లైస్ గా కట్ చేసి, వాటి మీద బ్లాక్ సాల్ట్ మరియు పెప్పర్ చిలకరించి తినాలి. ఇలా ప్రతి రోజూ రెగ్యులర్ గా తినడం వల్ల మీ శరీరంలో మరియు కడుపులో ఫంగల్ మరియు పరాసైటిక్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. టొమోటోలను పచ్చిగా సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు.

వెల్లుల్లి:
వెల్లుల్లిలో చాలా ఘాటైన వాసన కలిగి ఉంటుంది . ఇది కడుపులో చేరిన పరాన్నజీవులను తొలగించడానికి సహాయపడుతుంది. ఇంకా వెల్లుల్లో యాంటీబ్యాక్టిరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . శరీరంలో సూక్ష్మజీవులను నాశనం చేయడానికి అద్భుత పరిష్కార మార్గంగా ఉంది. పరాన్న జీవుల నివారణ కోసం ప్రతి రోజు ఒకటి రెండు వెల్లుల్లి రెబ్బలను నమిలి తినాలి.

మజ్జిగ మరియు పెరుగు:
పొట్టలో పరాన్న జీవులను మరియు శిలీంధ్ర వృద్ధి నాశనం చేయడానికి ప్రొబయోటిక్స్ సహాయపడుతాయి.
ఒక కప్పు బటర్ మిల్క్ ను లేదా పెరుగును ప్రతి రోజు తీసుకోవడం వల్ల మీ పొట్ట ఇన్ఫెక్షన్స్ నుండి ఫ్రీ అవుతుంది. మల్టిప్లుకేషన్ చెడు బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది.

పచ్చి వెజిటేబుల్ జ్యూస్:
పచ్చికూరగాయల జ్యూసులను త్రాగడం వల్ల శరీరానికి ఆరోగ్యప్రయోజనాలు సమృద్ధిగా ఉన్నాయి. శరీరం కూరగాయల రసాల నుండి శరీరానికి అవసరం అయ్యే పోషకాలను గ్రహిస్తుంది. దాంతో పాటు, ఈ జ్యూసులలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ రక్తకణాలను శుభ్రం చేయడానికి పరాన్నజీవులను నిర్మూలించడానికి మరియు శరీరంలో టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతాయి. పచ్చి కూరల రసాల్లో జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటాయి . ఇవి పరాన్న జీవులను అభివ్రుద్దిని నిరోధిస్తాయి. క్యారెట్, ఆకుకూరలు, కొత్తిమీర, కీరదోసకాయ వంటి జ్యూసులను రెగ్యులర్ గా తీసుకోవచ్చు.

రైస్ వెనిగర్:
అనేక రోగాలను చికిత్స కోసం వెనిగ్ గొప్పగా ఉంది. ఒక టేబుల్ స్పూన్ రైస్ వెనిగర్ మరియు ఒక గ్లాస్ వాటర్ మిక్స్ చేయాలి. ఈ వెనిగర్ లో ఉండే ఎక్కువ అసిడిక్ , మరింత ఉత్తమం. ఈ వెనిగర్ ను ప్రతి రోజూ త్రాగుతూ, పొట్టలో ఉండే పరాన్నజీవులను తొలగించుకోండి. మీలో తీవ్రమైన పరాన్న జీవుల ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, మూడు, నాలుగు గ్లాసులు తీసుకోవచ్చని మద్దతిస్తున్నారు.

లవంగాలు :
లవంగాల్లో యాంటీమైక్రోబ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇవి ప్రేగులో పరాన్న జీవులను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ఇవి శరీరంలో పరాన్న జీవులను వాటి గుడ్లను కూడా నివారిస్తాయి. ఒకటి, రెండు టేబుల్ స్పూన్ల లవంగాలు తీసుకోవడం వల్ల శరీరంలో పరాన్న జీవులను నివారించవచ్చు.

పసుపు:
పసుపలో ఎక్కువఔషధగుణగణాలున్నాయి. పరాన్న జీవులను ఇన్ఫెక్షన్ నిర్మూలించడంకోసం పసుపును వినియోగించవచ్చు. మీ రెగ్యులర్ గా తినే ఆహారాల్లో తప్పకుండా పసుపు చేర్చుతుండాలి . నేరుగా పాలలో లేదానీటిలో కలిపి తీసుకోవడం వల్ల ఫలితం మరింత త్వరగా ఉంటుంది.



Click it and Unblock the Notifications