Latest Updates
-
పెళ్లయ్యాక భార్య కంటే తల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా.. అందుకు కారణాలివే.? -
పక్కింటి ఆంటీల నుంచి సొంత చుట్టాల వరకు..పదే పదే విమర్శించే బంధువుల నోళ్లు మూయించే టిప్స్! -
చర్మ నిగారింపు కోసం.. వీటిని ముఖానికి పూయడమే కాదు, తిన్నా ప్రయోజనమే.! -
ఒక్కసారి ఈ గుజరాతీ స్టైల్ ఆలూ కూర వండారంటే.. చపాతీలు, పూరీలు ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
ఈ విటమిన్ లోపంతో నిరంతరం అలసట, తిమ్మిర్లు.. ఈ హెల్తీ ఫుడ్స్‌తో ఉపశమనం -
షుగర్ వ్యాధికి చెక్ పెట్టే జ్యూస్ ఇదే..తాగితే 100 ఏళ్లు హ్యాపీగా బతికేస్తారు! -
ఉదయం చట్నీ టెన్షన్ వద్దు.. ఈ టొమాటో తొక్కు ఉంటే ఇడ్లీ, దోసెల్లోకి పండుగే..ఒక్కసారి చేస్తే వారం రోజులు నిల్వ -
రైలులో హనీమూన్ సెటప్.. ఏసీ కోచ్‌లో క్యాబిన్ అలంకరణ చూస్తే మతిపోవాల్సిందే.! -
ప్రసవానంతరం తల్లుల్లో విపరీతంగా డిప్రెషన్.. బిడ్డ పుడితే ఇన్ని మార్పులా.? -
పెళ్లి విషయంలో ఆలస్యం చేస్తున్న జెన్ జెడ్ యువత.. భాగస్వామి కంటే ముందు వాటికే ప్రాధాన్యత.!
రక్తపు బొబ్బలు వదిలించుకునేందుకు 8 మార్గాలు !!
రక్తపు బొబ్బలు చాలా సహజంగా వస్తుంటాయి. అవి రసి లాంటి పదార్ధాలు కాకుండా రక్తంతో నిండి వుంటాయి. చర్మం క్రింద వుండే రక్త నాళాలు ఒరుసుకోవడం వల్ల అవి ఏర్పడతాయి.
రక్తపు బొబ్బలు తగ్గించుకుని వాటిని వదిలించుకునేందుకు కొన్ని వంటింటి చిట్కాలు ప్రయత్నించవచ్చు. ఈ వంటింటి చిట్కాల ప్రయోగంతో వీటిని ఒక వారంలో మాయం చేయవచ్చు. అసలు రక్తపు బొబ్బలు అంటే ఏమిటి?
చర్మం లోపలి పొరలో వుండే రక్త నాళాలు, దెబ్బ తింటే, వెంటనే చర్మం మీద రక్తపు బొబ్బ ఏర్పడుతుంది. రక్తం, తెల్ల రక్త కణాలు చర్మం క్రింద ఇరుక్కుపోయి రక్తపు బొబ్బలు ఏర్పడతాయి.
వాటిలో హిమోగ్లోబిన్ తో సహా రక్తంలోని అన్ని పదార్ధాలు వుంటాయి. ఒత్తిడి లేదా చిన్న చిన్న గాయాలకు శరీర సహజ స్పందనగా ఇవి ఏర్పడతాయి. చర్మం పొర బిగుతుగా వుండి రక్తం పోవడానికి వేరే దారి లేక పోవడం వల్ల అవి బొబ్బల్లా తేలతాయి.
ఈ వంటింటి చిట్కాలు ప్రయోగించడం చాలా తేలిక, ఒకసారి చూడండి :

అల్లం
ఒక తాజా అల్లం ముక్క నుంచి రసం తీయండి. రోజుకు మూడు సార్లు కొన్ని చుక్కలు ఆ రక్తపు బొబ్బ మీద రాయండి. వాపును తగ్గించే గుణం వున్న ఈ చుక్కలు బాధించే ఆ రక్తపు బొబ్బల నుంచి మెల్లిగా ఉపశమనం కలిగిస్తాయి.

ఐస్
రక్తపు బొబ్బాలకు ఐస్ ఒక మంచి వంటింటి చిట్కా. బొబ్బ రాగానే, కొన్ని ఐస్ క్యూబ్ లు టవల్ లో చుట్టి దాన్ని బొబ్బ చుట్టూ కట్టండి. దీని వల్ల వాపూ తగ్గుతుంది, మరాకా పోతుంది.

టీ ట్రీ ఆయిల్
రక్తపు బొబ్బలు తగ్గించడానికి సమర్ధంగా పని చేసే తైలాలలో ఒకటి టీ ట్రీ ఆయిల్. అది యాంటీ సెప్టిక్, వాపు తగ్గించేవి, ఫంగస్ నిరోధించేది కావడం వల్ల అది బొబ్బ సహజంగా మాదిపోఎలా చేస్తుంది. చర్మం పై పొర ఎండిపోయే వరకు రక్తపు బొబ్బలు తగ్గడానికి ఈ వంటింటి చిట్కా ను వాడండి.

దోసకాయ
దోసకాయ మీ చర్మాన్ని చల్ల బరుస్తుంది. తాజా దోసకాయ రసం బొబ్బ మీద రాస్తే చర్మానికి అబుబంధంగా వుండే కణజాలం బలపడుతుంది. ఈ రసం నెప్పి, వాపు కూడా సహజంగా తగ్గేలా చేస్తుంది.

వెల్లుల్లి
రక్తపు బొబ్బల చికిత్సకు ఉపయోగపడే మరో వంటింటి చిట్కా వెల్లుల్లి. ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి నూనెను వేడి చేసి, కొద్ది సేపు చల్లారనివ్వండి. ఈ నూనె తో బొబ్బలెక్కిన చోట మర్దనా చేయండి. కాసేపు ఎండనివ్వండి. ఎండిపోయాక కడిగేయండి.

అలోవేరా
రక్తపు బొబ్బాలకు అలోవేరా ఒక సహజ సిద్ధమైన ఔషధం. యాంటి ఇంఫ్లమేటరీ గుణాల వల్ల తాజా అలోవేరా రసం వాపులను తగ్గిస్తుంది. బొబ్బ మీద ఈ రసాన్ని మెల్లిగా రాయండి, ఆరాక చల్లటి నీటితో కడిగి వేయండి. ఈ రసాన్ని రోజులో మూడు సార్లు రాయండి.

మౌత్ వాష్
రక్తపు బొబ్బల చికిత్సలో ఉపయోగపడే మరో వంటింటి చిట్కా మౌత్ వాష్. ఒక మంచి యాంటీ సెప్టిక్ మౌత్ వాష్ ను బొబ్బ మీద రాయండి. బొబ్బ తెగితే ఆ ఇన్ఫెక్షన్ ను బాక్టీరియా లేదా ఫంగస్ వ్యాప్తి చేయకుండా మౌత్ వాష్ కాపాడుతుంది.

ఎప్సం సాల్ట్
రక్తపు బొబ్బలు తగ్గాలంటే ఎప్సం సాల్ట్ వాడి చూడండి. ఒక గిన్నెలో మంచి పరిమాణంలో సాల్ట్ కళ్ళు తీసుకుని, గోరువెచ్చటి నీటితో కలుపుతూ పేస్టులా చేయండి. ఈ పేస్టును బొబ్బ మీద రాయండి - వాపు, నెప్పి తగ్గుతాయి. ఇది నిత్యం చేస్తూ వుంటే బొబ్బ సహజంగా చితికిపోతుంది.



Click it and Unblock the Notifications