Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
రంజాన్ మాసంలో ఖర్జూరాలకెందుకు అంత ప్రాధాన్యత
ఉపవాస సమయంలో రక్తంలోని చక్కెరస్థాయి తగ్గిపోతుంది. ఖర్జూరాల్లోని చక్కెరలు దీన్ని వేగంగా పునరుద్ధరిస్తాయి. జీర్ణకోశంలోనూ, రక్తంలోనూ అసిడిటీని ఖర్జూరాలు తగ్గించగలవు. ఉపవాస సమయాల్లో రక్తంలో చక్కెర స్థాయి తగ్గి జీర్ణకోశంలో ఆమ్లం పెరుగుతుంది. ఈ రెండింటినీ వెంటనే సరిచేయాలంటే ఖర్జూరాలు తీసుకోవాలి. అసలు ఈ ఖర్జూరంలోని ఔషధగుణాలు ఏమిటో తెలుసుకుందాం!

జీర్ణ సమస్యలు పరిష్కారం
ఖర్జూరాల్లో టానిక్ శాతం బాగా ఎక్కువగా ఉండటం వల్ల వైద్యపరంగా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పేగులకు సంబంధించిన సమస్యలు జీర్ణాశయ సమస్యలు పరిష్కారమవుతాయి.

గొంతునొప్పి-జలుబు గొంతునొప్పి
గొంతునొప్పి-జలుబు గొంతునొప్పి, జలుబు, ఊపిరితిత్తుల ఇబ్బందులు, జ్వరం మొదలైన అనేక చిన్న చిన్న సమస్యలకు ఖర్జూర రసాన్ని డికాషన్ మాదిరిగా గానీ, సిరప్‌లా గానీ, ముద్దలాగానీ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

రేచీకటి తగ్గుతుంది
రోజూ ఆహారంతో పాటు ఖర్జూరాన్ని తీసుకోవడం వల్లను, ఖర్జూరరసాన్ని కంటిపూతగా వాడటం వల్ల రేచీకటి తగ్గుతుంది. కళ్లవాపు కూడా తగ్గుతుంది.

వ్యాధినిరోధకతను పెంచుతుంది
ఖర్జూర పళ్లను ప్రతీరోజు తినడం వల్ల రక్తనాళ వ్యాధులు, వాటి ద్వారా కలిగే నొప్పులు తగ్గుతాయి. శరీరంలో ఆవ్యాధికి నిరోధకత పెరుగుతుంది. ఖర్జూరాల్లోని కాల్షియం, భాస్వరం, ఇనుము, మొదలైన ఖనిజాలు ఈ వ్యాధిని తగ్గించగలుగుతాయి.

మూత్ర సమస్యలు
మూత్రం సులభంగా రావడానికి ఖర్జూరాలు తోడ్పడతాయి.

గుండెమంటి-ఎసిడిటి
గుండెమంట, అసిడిటీలను నివారించడానికి కూడా ఇవి గొప్ప సహాయపడుతాయి.

మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి
ఖర్జూరాల్లో చాలా ఎక్కువగా (70-80శాతం) కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఫ్రక్టోస్, గ్లూకోస్ అనే ఈ రెండు రకాల కార్బోహైడ్రేట్లలో కేలరీ విలువ (శక్తి) చాలా ఎక్కువ. ఇవి తేలిగ్గా జీర్ణం అవుతాయి. మెదడు పనితీరు మెరుగుపడటానికి దోహదం చేస్తాయి.

హార్ట్ రిలేటేడ్ సమస్యలు
గుండె వ్యాధులు గలవారు ఖర్జూరాలు తినడం చాలా మంచిది. శ్వాస సంబంధిత సమస్యలు గల వారికి కూడా ఇవి మేలుచేస్తాయి. పూర్వకాలంలో ఖర్జూరాల్ని సైనికులకు అల్పాహారంగా ఇచ్చేవారట. ఎందుకంటే కండరాల్ని ఇవి బాగా ఉత్తేజపరిచే గుణం కలిగినవి కావడం వల్ల యుద్ధరంగంలోకి వెళ్లేవారికి ఇవి టానిక్‌లాగా ఉపయోగపడతాయి.

క్యాన్సర్
ఉదరకోశంలోని కేన్సర్ నివారించడంలో ఖర్జూరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఆధునిక వైద్యశాస్త్రం ద్వారా కూడా చెబుతుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే ఆరోగ్యకరమైన సమతుల్యాహారంలో ఖర్జూరాలు ప్రముఖపాత్ర వహిస్తాయి.

ఉపవాస దీక్షా సమయాల్లో ఖర్జూరాలు ప్రాధాన్యత
ఉపవాస సమయంలో రక్తంలోని చక్కెరస్థాయి తగ్గిపోతుంది. ఖర్జూరాల్లోని చక్కెరలు దీన్ని వేగంగా పునరుద్ధరిస్తాయి. జీర్ణకోశంలోనూ రక్తంలోనూ అసిడిటీని ఖర్జూరాలు తగ్గించగలవు. ఉపవాస సమయాల్లో రక్తంలో చక్కెరస్థాయి తగ్గి జీర్ణకోశంలో ఆమ్లం పెరుగుతుంది. ఈ రెండింటినీ వెంటనే సరిచేయాలంటే ఖర్జూరాలు తీసుకోవాలి. ఇవి తిన్నాక చాలా ఎక్కువగా భుజించాలన్న కోరిక తగ్గుతుంది. అంటే ఉపవాసం తర్వాత అతిగా తినే ప్రమాదాన్ని ఇవి తగ్గిస్తాయి. శారీరక రుగ్మతలు తగ్గడానికి తాత్కాలికంగా ఖర్జూరాలు పనిచేస్తాయి.

రంజాన్ మాసంలో ఖర్జూరాలకెందుకు అంత ప్రాధాన్యత
రోజూ ఉదయాన్నే ఏడు అజ్వా ఖర్జూరాల్ని తింటే ఆ రోజు ఎలాంటి విషమూ, మంత్రము ఆ వ్యక్తిని ఏమీ చెయ్యలేవట. అంటే ఉదయాన్నే అల్పాహారంలో ఖర్జూరాల్ని తినే వ్యక్తి ఆ రోజంతా శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా గడుపుతాడు.

విషపు కాటుకు విరుగుడుగా ఖర్జూరాలు
విషపు కీటకాలేవైనా కరిచినప్పుడు ఆ కాటు మీద ఖర్జూరాల్ని ప్రత్యేకంగా రాస్తే వాటి విషప్రభావం తగ్గిపోతుందని చెప్పారు. రోజూ నిద్రపోయే ముందు ఏడు ఖర్జూరాల్ని తింటే కడుపులోని ఏలికపాములు నశిస్తాయి. తద్వారా విరేచనాల్లాంటి ఇబ్బందులు తగ్గుతాయి.

ప్రసవంత వర్వాత పాలు పడుతాయి
ప్రసవం తరువాత మహిళలకు ఖర్జూరాలు తినిపించడం చాలా మంచిది. ఖర్జూర పూల పుప్పొడిలో ఈస్ట్రోజెన్ జారి ఈస్ట్రోన్ తయారవ్ఞతుంది. ఇది స్త్రీలకు మంచిది. ఖర్జూరాల్లోని పొటాషియం, గ్లైసీన్, థియోనైన్ ఎంజైములు స్త్రీలలో పాలు తయారుచేసే ప్రొలాక్టిన్ హార్మోనును చురుగ్గా పనిచేయిస్తాయి. పాలిచ్చే తల్లులకు వీటిని తినిపించడం వల్ల ఎక్కువగా పాలు పడతాయి.

గర్భిణీ స్త్రీలకు
గర్బిణులు ప్రసవానికి ముందు తర్వాత కూడా రోజూ ఖర్జూరాల్ని తినడం వల్ల గర్భాశయంలోని కండరాలు బాగా పనిచేస్తాయి. తద్వారా ప్రసవం తేలిగ్గా అవడమే కాకుండా ప్రసవానంతరం రక్తస్రావం కూడా తగ్గుతుంది. పాలిచ్చే తల్లులకు ఖర్జూరం చాలా మంచి ఆహారమని పోషకాహార నిపుణులు కూడా చెబుతారు. బాలింతల్లో ఒత్తిడి, కుంగుబాటును తగ్గించడంతో బాటు పాలలో పోషకాలు పెరిగేలా ఇవి చేస్తాయి. నవజాత శిశువ్ఞకు వ్యాధి నిరోధకత పెరిగేలా చేస్తాయి. మరిన్ని ప్రయోజనాలున్న ఖర్జూరాలను ఈరోజు నుంచి మన అల్పాహారంలో తీసుకుందాం. ఆరోగ్యాన్ని పొందుదాం.



Click it and Unblock the Notifications
