Latest Updates
-
మీటింగ్‌లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.! -
సాయంత్రం వేళ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి?అష్టైశ్వర్యాలు తెచ్చే అద్భుతమైన మార్గం.. -
చేతి గోళ్లు ఇలా ఉంటే కిడ్నీల ఆరోగ్యానికి వార్నింగ్.. మీకూ ఇలా ఉందా.?
నిద్ర మాత్రలు ఆరోగ్యానికి నిజంగా హానికలిగిస్తాయా?
జీవితంలో చాలా భాగం నిద్రలోనే గడిచిపోతుంది అనే మాట నిజమే అయినా, మనిషిలో అలసటని మాయం చేసి తిరిగి జీవనోత్సాహాన్ని నింపేది కాబట్టి ఆ మాటని పూర్తి నెగెటివ్‌గా భావించలేం. నిద్ర గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటే అసలే అనలేం. తెలుసుకోండి మరి. మన దేశంలోని 30శాతం మంది నిద్రలేక, కలతనిద్రతో ఇబ్బందులు పడుతున్నారు. సరైన నిద్రకోసం నిద్రమాత్రలు వేసుకునే పెద్దవయసు వారిలో మూడవవంతు మంది మహిళలే.
ఒక్క సారి నిద్రమాత్రలు తీసుకోవడం మొదలు పెడితే, మెదడులోని 'డొపమైన్' మనిషిని ఉత్సాహంగా, ఉత్తేజంగా అవసరానికి మించి ఆనందాన్ని ఇచ్చే రసాయన ద్రవం. మాదకద్రవ్యాలు తీసుకునేవారిలో తాత్కాలికంగా డొపమైన్ ఎక్కువై మనిషి సాధారణ స్థాయికంటే ఎక్కువ ఉత్సాహాన్ని అనుభవిస్తాడు. అనుభూతి పొందుతారు. ఒకసారి తీసుకోవడం అలవాటైతే మళ్లీ మళ్లీ తీసుకోవాలని మెదడు ప్రేరేపిస్తుంది. వైద్యుడి సలహా లేకుండా మందులు వాడటం కాని, వైద్యుడు సూచించిన మందులు మోతా దుకు మించి వాడటం కాని ప్రమాదకరమనే విషయం నిర్వివాదాంశం. అయితే, సరైన వైద్య సలహా లేకుండా దురుపయోగమయ్యే ఔషధాల్లో నిద్ర మాత్రలు లేదా సెడేటివ్స్ అగ్ర స్థానంలో ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో వీటి వినియోగం చాలా అధికంగా ఉంది. నిద్ర మాత్రలు ఎక్కువ కాలం వాడటం వల్ల వీటికి అలవాటు పడటం జరుగుతుంది. ఏ నిద్రమాత్రలైన 15 రోజులకు మించి వాడడం మంచిదికాదు. తాత్కాలికంగా ఇతర మందులతో కలిపి వైద్యులు వాడాలని సూచిస్తారు. కానీ అవగాహనలేమితో, బాగున్నాయనే ఉద్దేశంలో రోగులు కేవలం నిద్రమాత్రలు మాత్రమే ఉపయోగిస్తారు.
ఇలా అలవాటు పడిన వ్యక్తి ఆ మందులనుంచి దూరంగా ఉండటం దాదాపు అసాధ్యమనే చెప్ప వచ్చు. ప్రతి నిముషం వీటిని తీసుకోవాలనే తహతహ ఉంటుంది. వీటిని తీసుకునే మోతాదు విషయంలో కాని, వాటికోసం చేసే ప్రయత్నాల్లో కాని ఆయా వ్యక్తులకు తమపై తమకే నియంత్రణ ఉండదు. ఫలితంగా ఈ మందులు తీసుకునే వారు వృత్తిపరంగా, సామాజికంగా, ఆరోగ్య విషయాల్లో అనేక రకాలైన సమస్యలకు గురవుతారు. అలా నిద్రమాత్రలు మ్రింగడం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

నిద్రమాత్రలు
నిద్రమాత్రలు అలవాటు పడేలా చేస్తాయి. బెడ్ టైమ్ అయ్యిందంటే నిద్ర మాత్ర లేకుండా పడుకోలేరు.

ఆస్తమా
నిద్ర మాత్రలు మీ శ్వాసను నెమ్మదిస్తాయి. గాఢ శ్వాస లేకుండా చేస్తాయి. ఆస్తమా రోగులకు ఈ మందులు అసలు మంచివి కావు. కనుక వీరు నిద్రమాత్రలు తీసుకోరాదు.

ఆకలి ఉండదు
నిద్రమాత్రలు మీ ఆకలిని చంపేస్తాయి. జీవక్రియ మందగిస్తుంది.

ఆల్కహాల్ తీసుకొనేవారికి నిద్రమాత్రల ఎఫెక్ట్
కొంతమంది నిద్రమాత్రలు ఆల్కహాల్ తో కలిపి తీసుకుంటారు. ఇది ప్రమాదకరం. మరణానికి దోవతీస్తుంది కూడాను. ద్రాక్షరసంతో కూడా కలిపి తీసుకోకండి.

తలనొప్పి
నిద్రమాత్రలు, మత్తు కలిగించి, ఉదయమే తలనొప్పి, అలసట, దాహం, బలహీనం, చూపు మందగించటం చేస్తాయి.

కలలు
నిద్రపోయినప్పటికి అసాధారణ కలలు వస్తాయి.

కళ్ళు తిరగడం
గోడలు కూలుతున్నట్లు, తల తిరుగుతున్నట్లు అనిపిస్తూంటుంది.

ఇమ్యూనిటి తగ్గడం
నిద్రమాత్రలు పవర్ అధికమైనవైతే, మీ శరీరం బలహీనపడటమే కాదు వణుకుతూ వుంటుంది. ఇవి నిద్రమాత్రలవలన కలిగే దుష్ప్రభావాలు. కనుక నిద్రమాత్రలను డాక్టర్ సలహాపైనే వేయండి. నమ్మకస్తులైన మందుల దుకాణంలో మాత్రమే కొనండి.



Click it and Unblock the Notifications