Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
వేసవి తాపాన్ని తీర్చే లస్సీలో మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు
వేసవి తాపాన్ని తీర్చే వివిధ రకాల పానియాల్లో లస్సీ ఒక టేస్టీ కూల్ డ్రింక్. మన ఇండియాలో వేసవి కాలంలో మనకు అందుబాటులో ఉంటుంది. ఇది రుచికరం మాత్రమే కాదు, చాలా ఆరోగ్యకరం మరియు పొట్ట నింపుతుంది. ఇటువంటి సమ్మర్ డ్రింక్ లో మరిన్ని ఆరోగ్యప్రయోజనాలున్నాయి . ఈ సమ్మర్ డ్రింక్ ‘లస్సీని' పెరుగుతో తయారుచేస్తారు.
పాలకు తోడు పెట్టి పెరుగుగా తయారుచేస్తారు. ఇందులో హెల్తీ బ్యాక్టీరియా ఉంటుంది. పెరుగులో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో లేదా చికిత్సనందించడంలో సహాయపడుతుంది. పెరుగు వల్ల మరో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే, ఇది కడుపుకు చాలా మంచిది. కడుపు చల్లగా ఉంచతుంది. అంతే కాదు శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కాబట్టి, పెరుగుతో తయారుచేసిన లస్సీని తీసుకోవడం వల్ల మరిన్న ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు . పెరుగుతో తయారుచేసే లస్సీ వల్ల మరో ముఖ్యమైన ప్రయోజనం. సన్ స్ట్రోక్ (వేసవి వేడి లేద వడదెబ్బ)ను నివారిస్తుంది.
ఈ ఆరోగ్యకరమైన మరియు స్మూతింగ్ సమ్మర్ డ్రింక్ లస్సీని తయారుచేయడానికి వివిధ మార్గాలున్నాయి. ఐడియల్ గా ఈ సమ్మర్ డ్రింక్ స్మూత్ లస్సీలో పంచదార మరియు రోజ్ వాటర్ ను మిక్స్ చేస్తారు.అందువల్ల, ఇంకా మీరు ఈ లస్సీకీ సెన్షేనల్ ఫ్రూట్స్ మ్యాంగో మరియు లిచి వంటి పండ్లను మిక్స్ చేసి ఫ్లేవర్డ్ లస్సీతో ఎంజాయ్ చేయవచ్చు.
మలబద్దకం నివారించడం నుండి శరీరంలోని వేడి తగ్గించడం వరకూ లస్సీ ఒక హెల్తీ మరియు బెస్ట్ సమ్మర్ డ్రింక్. ఈ లస్సీని మీరు తప్పకుండా రెగ్యులర్ గా త్రాగితే మీ శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. లస్సీలో మరి గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ...

డీహైడ్రేషన్ నివారిస్తుంది
సమ్మర్ లో, శరీరం నుండి నీరు చెమట రూపంలో కోల్పోతుంది. కాబట్టి, లస్సీని రెగ్యులర్ గా త్రాగడం వల్ల శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచి శరీరంలో నీటి స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది.

బాడీ హీట్ ను తగ్గిస్తుంది
ఇది ఒక బెస్ట్ ఇండియన్ సమ్మర్ డ్రింక్. పెరుగుతో తయారుచేసే లస్సీ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచతుంది. మరియు ఇది సన్ స్ట్రోక్ నుండి మనల్ని రక్షిస్తుంది.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది
పెరుగులో ఉండే హెల్తీ బ్యాక్టీరియ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది.

న్యూట్రీషియన్
పెరుగులో పొటాషియం, క్యాల్షియం, ప్రోటీన్ మరియు విటమిన్ బిలు అధికంగా ఉన్నాయి. అందువల్ల ఈ న్యూట్రీషియన్ సమ్మర్ డ్రింక్ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

రెగ్యులర్ బౌల్ మూమెంట్
పెరుగులో హెల్తీ ప్రోబయోటిక్స్ ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు మలబద్దంను నివారిస్తుంది. దాంతో రెగ్యులర్ బౌల్ మూమెంట్ కు సహాయపడుతుంది.

జీర్ణక్రియకు సహాయపడుతుంది
పాలలోని ల్యాక్టోజ్ హెల్తీ బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది. ఇందులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ ల్యాక్టోజ్ గా జీర్ణం అవుతుంది. ప్రతి రోజూ పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

బరువు పెరగవచ్చు
లస్పీ క్రీమ్ మరియు నెయ్యి ఉంటుంది. ట్రెడిషినల్ లస్సీని తినడం వల్ల ఇందులో ఉండే హెల్తీ ఫ్యాట్స్ మరియు క్యాలరీల వల్ల బరువు పెరగడానికి చాలా సహాయపడుతుంది.

క్యాల్షియంను అందిస్తుంది
లస్సీని డైరీ ప్రొడక్ట్ అయిన పెరుగుతో తయారుచేస్తారు. ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది .పెరుగు తినడం వల్ల అందులో ఉండే క్యాల్షియం ఎముకలలోనికి షోషింప బడుతుంది.

వ్యాధినిరోధకతను పెంచుతుంది
అనేక అద్యయనాల ప్రకారం, లస్సీ వ్యాధినిరోధకతను పెంచుతుంది. కాబట్టి, ఒక గ్లాసు చల్లని లస్సీ తాగి సమ్మర్ హీట్ ను జయించండి మరియు వ్యాధినిరోధకతను పెంచుకోండి.

ఆకలిని కంట్రోల్ చేస్తుంది
మీరు వెయింట్ లాస్ డైట్ లో ఉన్నట్లైతే మీరు ఖచ్చితంగా మీరు భోజనం తినడానికి అరగంట ముందు లస్సీని తీసుకోవచ్చు. అప్పుడు అది మీ పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఆకలిని కంట్రోల్ చేస్తుంది. బరువు పెరగడాన్ని తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications
