Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
టమోటో జ్యూస్ త్రాగడం వల్ల పొందే హెల్త్ బెనిఫిట్స్
ప్రస్తుతం శీతాకాలం, ఈ సీజన్ లో బోలెడు రకాల వెజిటేబుల్స్ మార్కెట్లో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా టమోటో. దేశీ టమోటోలా ఈ సీజన్ లో ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఎర్రటి జ్యూసి మరియు పుల్లని టమోటోలు మార్కెట్లో విరిగా అందుబాటులో ఉన్నాయి. మరియు సంవత్సం పొడవును టమోటోలో అందుబాటులో ఉంటాయి. కానీ వీటిని వింటర్ లో ఎక్కువగా సప్లై చేస్తుంటారు.
టమోటాలు! ఇవి తియాగా, జ్యూసీగా, రుచిగా ఉంటాయి. అవి మనకు మంచిదని అందరికీ తెలుసు, అవునా? ప్రత్యేకంగా టమోటాలు ఆరోగ్యకరమైన ఆహరం ఎందుకో ప్రతివక్కరికీ తెలుసు? అది విటమిన్ C ని కలిగి ఉంటుందని? కాలరీలు తక్కువగా ఉంటాయని? కొవ్వు-లేనివని? అవును, అవును, అవును, కానీ మొత్తం ఇవే కాదు! టమోటా అద్భుతమైన ఆరోగ్యకర ఎంపికగా ఎందుకు తయారయిందో చూద్దాం.
టమోటోలోని సూపర్ హెల్త్ బెనిఫిట్స్: క్లిక్ చేయండి
ఒక కప్పు ఎర్రని, పండిన, పచ్చి టమోటా లేదా టమోటో జ్యూస్ లో (ఒక కప్పు లేదా 150 గ్రాములు) A, C, K విటమిన్లు, ఫోలేట్, పొటాషియంని కలిగి ఉంటాయి. టమోటాలు సహజంగా సోడియం, కొవ్వు, కొలెస్ట్రాల్, కాలరీలను తక్కువగా కలిగి ఉంటాయి. టమోటాలు మంచి ఆరోగ్యానికి అవసరమైన థయామిన్, నియాసిన్, విటమిన్ B6, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్ ని కూడా అందిస్తాయి.
దీనికి అదనంగా, ఒక కప్పు టమోటాలు ప్రతిరోజూ సిఫార్సుచేయబడిన 7% ఫైబర్ లో 2 గ్రాముల ఫైబర్ ని మీకు అందిస్తుంది. టమోటాలు సాపేక్షంగా ఆహరం నింపడానికి ఏర్పడే అధిక నీటిని కూడా కలిగిఉంటుంది. సాధారణంగా మనం తినే అనేకరకాల పండ్లు, కూరగాయలు, టమోటాలతో సహా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, స్ట్రోక్ లు, గుండె జబ్బుల నివారణకు రక్షణను సూచిస్తుంది. టమోటో జ్యూస్ ను ఆరోగ్యకరమైన జ్యూస్ గా తీసుకోవడానికి సలహా ఇస్తుంటారు.
టమోటోలోని అద్భుతమైన సౌందర్య గుణగణాలు: క్లిక్ చేయండి
టమోటో జ్యూస్ పూర్తిపోషకాలు కలిగి ఉండటం మాత్రమే కాదు, ఇది డైటర్స్ కోసం చాలా ఉత్తమం. ఇది శరీరానికి మేలు చేయడమే కాకుండా చర్మానికి కూడా గొప్ప ప్రయోజనాలను అంధిస్తుంది. ముఖ్యంగా టమోటో జ్యూస్ తగ్గడానిం వల్ల చర్మం శుభ్రపడుతుంది, డార్క్ స్పాట్స్ మరియు సన్ టాన్ తగ్గుతుంది. టమటో జ్యూస్ త్రాగడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. ఇవే కాకుండా మరికొన్ని గొప్ప ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి పరిశీలించండి...

పోషకాలు:
ఎర్రని, పండిన, పచ్చి టమోటాలో A, C, K విటమిన్లు, ఫోలేట్, పొటాషియంని కలిగి ఉంటాయి. టమోటాలు సహజంగా సోడియం, కొవ్వు, కొలెస్ట్రాల్, కాలరీలను తక్కువగా కలిగి ఉంటాయి. టమోటాలు మంచి ఆరోగ్యానికి అవసరమైన థయామిన్, నియాసిన్, విటమిన్ B6, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్ ని కూడా అందిస్తాయి. మరొ ప్రయోజనం క్యాలరీలను, సాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు బ్యాడ్ కొలెస్ట్రాలన్ తగ్గిస్తాయి.

వ్యాధినిరోధక పెంచుతుంది:
టమోటోలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల శరీరం యొక్క వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా టమోటో జ్యూస్ ప్రతి రోజూ త్రాగడం వల్ల ఇది దృష్టిని కూడా మెరుగుపరుస్తుంది.

బ్యాడ్ కొలెస్ట్రాల్ ను బ్రేక్ చేస్తుంది:
టమోటోలో నియాసిన్ అనే అంశం ఉన్నందువల్ల ఇది ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచి శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మరియు ఇందులో పుష్కలమైనటువంటి ఫైబర్ ఉన్నందువల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ను విచ్ఛిన్నం చేస్తుంది.

గుండె ఆరోగ్యానికి:
టమోటోలు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అంతే కాదు టమోటోలో ఉండే విటమిన్ బి మరియు పొటాషియం బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది . హార్ట్ అటాక్ ను, హార్ట్ స్ట్రోక్ ను మరియు గుండెకు సంబంధించి ఇతర సమస్యలను నిరోధించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇంత అద్భుతమైన టమోటోను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఎంతైనా అవసరం.

బరువు తగ్గిస్తుంది:
టమోటాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. మీరు తేలికైన ఆహరం, వ్యాయామ ప్రణాళికలో ఉంటే, మీ రోజువారీ ఆహారంలో టమోటాలను ఎక్కువగా తీసుకోండి. ఇవి సలాడ్లు, కాసేరోల్స్, సాండ్ విచ్, ఇతర పదార్ధాలలో "ఎక్కువ మోతాదులో" ఉపయోగించే, మంచి స్నాక్ గా తయారవుతుంది. టమోటాలు నీరు, ఫైబర్ ఎక్కువగా కలిగి ఉండడం వల్ల వెయిట్ వాచర్లు వీటిని "ఫిల్లింగ్ ఫుడ్" అని పిలుస్తారు, ఎక్కువ కాలరీలు, కొవ్వులేకుండా వేగంగా పొట్టనింపే ఆహారాలలో ఇది ఒకటి. ఇది శరీరంలోని టాక్సిన్స్ బయటకు నెట్టివేస్తుంది.

మిమ్మల్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది:
టమోటోల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఒక హెల్తీ వెజిటేబుల్ జ్యూస్. ఇది మీ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది.

స్కిన్ ఫ్రెండ్లీ:
టమోటోలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంది. ఇది వయస్సు మీదపడనివ్వకుండి వ్రుద్యాపంను నివారిస్తుంది. ముఖ్యంగా ఇది మొటిమలు మచ్చలు నివారించడానికి ఇది ఒక నేచురల్ హోం రెమెడీ.

డయాబెట్స్ కు ఆరోగ్యకరం:
టమోటాలు మీ బ్లడ్ షుగర్ ని సమతుల్యంలో ఉంచుతాయి. బ్లడ్ షుగర్ నియంత్రణకు సహాయపడే క్రోమియమ్ కు టమోటాలు మంచి మూల౦. టమోటో మన శరీరంలోని షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది అందువల్ల మధుమేహం కంట్రోల్ అవుతుంది. ఆ క్రెడిట్ టమోటోని మినిరల్స్ లో ఒకటైన ‘క్రోమియం'దే. ఇది టమోటోని మంచి మన్నికైన పోషకాంశం.



Click it and Unblock the Notifications











