Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
గ్రీన్ బీన్స్ తినడం వల్ల పొందే గొప్ప ఆరోగ్యప్రయోజనాలు
శీతాకాలంలో గ్రీన్ వెజిటేబుల్స్ కు కొదవలేదు. ఎందుకంటే మార్కెట్లో ఎక్కడ చూసిన, వివిధ రకాల గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా, గ్రీన్ బీన్స్ కూడా. వీటనే లెగ్యూమ్స్ అంటారు. గ్రీన్ బీన్స్ రేటు కాస్త ఎక్కువైనా, రేటుకు తగ్గవిధంగానే ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే. గ్రీన్ బీన్స్ లో పోషకాలు అత్యంతధికంగా ఉన్నాయి.
గ్రీన్ బీన్స్ లో ఉండే అన్ని అమినో ఆసిడ్స్ మన డైట్ కు చాలా అవసరం అవుతాయి. అంతే కాదు, మాంసాహారం, గుడ్లు, చేపలు, డైరీప్రోడక్ట్స్ లో ఉండే అమినో యాసిడ్స్ కంటే ఇందులో పూర్తిగా, ఎక్కువగా ఉన్నాయి. గ్రీన్ బీన్స్ లోకాలరీలను కలిగి ఉంది మరియు ఫ్యాట్స్ జీర్. విటమిన్లు, ప్రోటీనలు, మినిరల్స్, మైక్రోన్యూట్రియంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు డైటరీ ఫైబర్ కూడా అధికంగా ఉంది. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వెజిటేరియన్స్ లవర్స్ వారి రెగ్యులర్ డైట్ లో బీన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.
బీన్స్ లో కూడా వివిధ రకాల బీన్స్ ఉన్నాయి. ముఖ్యంగా సో్యాబీన్స్ , మన ఆరోగ్యాన్ని క్రమంగా పెంచుతుంది. బీన్స్ తినడం వల్ల పొందే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలేంటో ఒక సారి తెలుసుకుందాం...

పెళుసైన జుట్టును నిరోధిస్తుంది:
బీన్స్ లో బయోటిన్స్ అనే మూలకం ఉంది, ఇది జుట్టు రక్షణకు చాలా అవసరం, పెళుసైన జుట్టును కలిగిన వారు రెగ్యురల్ డైట్ లో బీన్స్ ను చేర్చుకోవడం వల్ల జుట్టు మందంగా, ఆరోగ్యంగా పెరడగానికి సహాయపడుతుంది.

క్యాన్సర్ నివారిణి:
బీన్స్ లో పిగ్మెంట్ యాంటీయాక్సిడెంట్స్, ఫ్లెవనాయిడ్ పుష్కలంగా ఉండటం వల్ల గౌట్ క్యాన్సర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ యొక్క ఉత్పత్తిని తగ్గించి, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను సమతుల్యం చేస్తుంది:
బ్లడ్ షుగర్ లెవల్స్ ను సమతుల్యం చేయాలంటే, బీన్స్ లోని కార్బోహైడ్రేట్స్ అద్భుతంగా సహాయపడుతాయి. బీన్స్ లోని కార్బోహైడ్రేట్స్ చాలా నిధానంగా జీర్ణం అవ్వడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెయింటైన్ చేయవచ్చు.

విటమిన్స్ అండ్ మినిరల్స్:
బీన్స్ పుష్కలమైన న్యూట్రీషియన్స్ కాంబినేషన్ కలిగినటువంటి ఆహారపదార్థం. ఇందులో యాంటీఆక్సిడెంట్స్, ప్రోటీన్స్, ఫైబర్, కాంప్లెక్స్, కార్బోహైడ్రేట్స్ మరియు విటమిన్స్ మరియు మినిరల్స్ (పొటాషియ, ఫొల్లెట్, కాపర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ మరియు మ్యాంగనీస్)ఇవన్నీ ఆరోగ్యానికి అవసరం అయ్యేంతలో పుష్కలంగా ఉన్నాయి.

గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది:
బీన్స్ లో ఉండే ఫొల్లెట్ గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది మరియు కడుపులో పెరిగే బిడ్డకు కూడా ఆరోగ్యంకమైన ఆహారం మరియు మంచిది.

గుండె ఆరోగ్యానికి చాలా మంచిది:
లోఫ్యాట్ కలిగినటువంటి బీన్స్ ట్రాన్స్ ఫ్యాట్ మరియు అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉండదు. ఇవి లో కొలెస్ట్రాల్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తుంది మరియు గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.

బరువును నియంత్రిస్తుంది:
లోఫ్యాట్ కలిగిన బీన్స్, ఫైబర్ మరియు ప్రోటీన్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి బరువు తగ్గించి, హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడానికి చాలా బాగా సహాపడుతుంది. ఇందులోని ప్రోటీన్స్ మీ పొట్టను ఫుల్ గా ఉండే భావన కల్పిస్తుంది మరియు కండరాలు అభివ్రుద్దికి సహాయపడుతుంది.

ఇతర ధాన్యాల కంటే బీన్స్ తినడం వల్ల:
కొంత మందిలో గోధుమలు, రె మరియు బార్లే వంటి వాటిలో గ్లూటెన్ ఉండటం వల్ల కొంత మందిలో అలెర్జీ కలుగుతుంది. కాబట్టి, వీటికి బదులుగా బీన్స్ ను తీసుకోవడం వల్ల ఇది మన శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ మరియు ఫైబర్ ను పుష్కలంగా అందిస్తుంది.

ఎముకలను బలంగా ఉంచుతుంది:
గ్రీన్ బీన్స్ లో మినిరల్ సిలికాన్ అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచతుంది మరియు ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇతర వెజిటేబుల్స్ తో పోల్చితే, బీన్స్ లో ఉండే సిలికాన్ చాలా త్వరగా జీర్ణం అయ్యి, త్వరగా శోషింపబడుతుంది.

వృద్ధాప్యంతో పోరాడుతుంది:
గ్రీన్ బీన్స్ లోని కెరోటినాయిడ్స్ లూటిన్, నియాక్సిథిన్, బీటా కెరోటిన్ మరియు వయోలాక్సిథిన్ ఇది చర్మసామర్థ్యం పెంచడంలో బూస్ట్ లా పనిచేసి, వృద్ధాప్యంతో పోరాడుతుంది.



Click it and Unblock the Notifications