Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
పురుషులకు నట్స్ తో ప్రత్యేక ఆరోగ్యప్రయోజనాలు
మన శరీరంలో ప్రతి ఒక్క అవయవానికీ సహాయపడే ఆహారపదార్థాల్లో నట్స్ ఒక సూపర్ ఫుడ్స్ గా నిర్ధారించారు. అందువల్ల నట్స్ వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు చెప్పలేనన్ని ఉన్నాయి. నట్స్ బరువు తగ్గించడానికి సహాయపడుతాయి, డయాబెటిస్ నుండి మన శరీరానికి రక్షణ కల్పిస్తాయి. మరీ ముఖ్యంగా హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తాయి. నట్స్ ను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మన చర్మ అందాన్ని మరియు జుట్టు అందాన్ని మెరుగుపరుస్తాయి.
అందువల్ల, అశ్చర్యం లేదు, అన్ని రకాల నట్స్ మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. కొన్ని నట్స్ : వాల్ నట్స్, బాదం మరియు పిస్తాచోలు వంటివి వాటిలో గరిష్టస్థాయిలో ఆరోగ్యప్రయోజనాలు కలిగి ఉన్నాయి. కానీ, ఇతర రకాల నట్స్ : బ్రాజెల్ నట్స్ మరియు పీనట్స్ వంటివి వివిధ మార్గాల్లో ఉపయోగపడుతాయి. ఉదాహరణకు నట్స్ లో కంటే పీనట్స్ లో అరుదైన ప్రోటీనులు కలిగి ఉన్నాయి.
నట్స్ తీసుకోవడం వల్ల పురుషుల ఆరోగ్యంకు చాలా గొప్పగా సహాయపడుతాయి. ముఖ్యంగా పురుషుల్లో లైంగి సమస్యలు నివారించుటకు అద్భుతంగా సహాయపడుతాయి. నట్స్ పురుషుల యొక్క రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ముఖ్యంగా పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్, లైంగికలోపాలు నివారిస్తుంది మరియు స్పెర్మ్ క్వాలిటీ పెంచుతుంది. అలాగే మహిళల్లో, నట్స్ లో కాస్మొటిక్ ఎఫెక్ట్స్ కలిగి ఉన్నాయి. ఇంకా ఇందులో ఉండే విటమిన్ ఇ, చర్మం కాంతివంతంగా మెరవడానికి మరియు జుట్టు మెరిపించడానికి సహాయపడుతుంది.
కాబట్టి, నట్స్ వల్ల పొందే ప్రయోజనాలను క్రిందివిధంగా తెలుసుకొని, మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి...

బ్రెయిన్ ఫుడ్స్:
పెరిగే పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు వారి రెగ్యులర్ డైట్ లో నట్స్ ను చేర్చుకోవాలి. నట్స్ లో అధిక విటమిన్లు మరియు విటమిన్ బి కాంప్లెక్స్ ఇవి బ్రెయిన్ ను ఉత్తేజపరుస్తుంది . మరియు ఇందులోని మరికొన్ని అంశాలు నాడి వ్యవస్థని, డీజనరేటివ్ డిసీజ్ (మతిమరుపు) వంటి వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది.

పురుషుల్లో స్పెర్మ్ క్వాలిటీని మెరుగుపరుస్తుంది:
నట్స్ ముఖ్యంగా పురుషులకు చాలా ఉపయోగకరం. రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల స్పెర్మ్ యొక్క నాణ్యత మరియు చురుదనాన్ని పెంచుతుంది. కాబట్టి, మీరు పిల్లలకోసం ప్రయత్నిస్తుంటే ఇప్పటి నుండే ప్రతి రోజూ గుప్పెడు నట్స్ తినడం ప్రారంభించండి.

బరువు:
అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ కంటే, నట్స్ కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. నట్స్ తిన్న తర్వాత పొట్టు ఫుల్ గా ఉన్నట్లు అనిపించడంతో మీరు తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

హై ఎనర్జీ ఫుడ్స్:
ఆరోగ్యకరమైనవి చిన్న ప్యాక్ లో వచ్చేస్తాయి. శెనగవిత్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ వీటిలో శక్తిని పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఉదయం తీసుకోవడం వల్ల మీకు రోజంత అవసరం అయ్యే శక్తిని అంధిస్తుంది.

ప్రొస్టేట్ క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది:
బ్రాజిల్ నట్స్ ముఖ్యంగా వీటిలో సెలీనియం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది పొస్టేట్ క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది.

రోగనిరోధకత పెంచుతుంది:
నట్స్ చాలా ఆరోగ్యరమైనది . చాలా న్యూట్రీషియన్ గ్రూప్స్ కలిగి ఉన్నాయి. ఇది నేచురల్ రోగనిధోకతను పెంచుతుంది.

లైంగిక సమస్యలు:
పిస్తాలు, పురుషులకు చాలా ప్రయోజనం. లైంగిక సమస్యలను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. ఇది బ్లడ్ వెజిల్స్ విశ్రాంతి పరుస్తుంది మరియు రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:
మన శరీరానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు మంచి ఫ్యాట్ కలిగిన ఒక ఉత్తమ పోషకాలను కలిగిన ఈ నట్స్ మన శరీరానికి ఎంతో అవసరం. ఇవి గుండెకు రక్షణ కల్పిస్తాయి. చర్మ కాంతిని మెరుగుపరుస్తాయి మరియు బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తాయి. చాలా వరకూ అన్ని రకాల నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి.

కాంతి వంతమైన చర్మానికి విటమిన్ ఇ:
నట్స్ లో గొప్పస్థాయిలో విటమిన్ ఇ కలిగి ఉంటుంది. ఈ ప్రత్యేకమైన విటమిన్ మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడుతుంది మరియు ఇది వయస్సు మీద పడకుండా సహాయపడుతుంది.

స్ట్రెస్ బూస్టర్:
నట్స్ లో వాల్ నట్స్, ఇందులో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్స్ గ్రేట్ స్ట్రెస్ బూస్టర్స్. ఈ నట్స్ ను తీసుకోవడం వల్ల మీ శరీరానికి తగినంత రక్షణ కల్పిస్తుంది. స్ట్రెస్ హార్మోనులను తగ్గిస్తుంది.

లంగ్ క్యాన్సర్(ఊపిరితిత్తుల క్యాన్సర్)ను తగ్గిస్తుంది:
పిస్తాచోలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల, ఇందులో ఉత్తమ డైటరీ ప్రొడక్ట్స్ లంగ్ కాన్సర్ కు వ్యతిరేఖంగా పోరాడుతాయి. మరియు ఇందులో ఉండే గమ్మా టోకోఫెరల్ కెమికల్స్ ఇతర క్యాన్సర్లు రాకుండా రక్షణ కల్పిస్తాయి.

కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:
నట్స్ లో బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, మరియు పిస్తాలలో మంచి కొలెస్ట్రాల్స్ ఉన్నాయి. ఇవి రక్తంలో చెడు రక్తంను రెగ్యులేట్ చేయడానికి అద్బుతంగా సహాయపడుతాయి. నట్స్ తినడం వల్ల హార్ట్ హెల్త్ కు గొప్ప ప్రయోజనం.



Click it and Unblock the Notifications











