Latest Updates
-
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే! -
ఒకే రకమైన మందులు.. వేర్వేరు ఫలితాలు..లివర్ డ్యామేజ్ వెనుక ఉన్న రహస్యం ఇదే! -
హ్యాపీ హోలీ 2026..మీ బంధుమిత్రులకు పంపడానికి బెస్ట్ హోలీ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే! -
ఈ హోలీకి అదిరిపోయే స్నాక్..అతిథులను మెప్పించే కరకరలాడే హెల్దీ రైస్ కుర్కురే..ఎలా చేసుకోవాలంటే.. -
హోలీ స్పెషల్..తాగేకొద్దీ తాగాలనిపించే చల్లని థాండాయ్..ఎలా చేసుకోవాలంటే.. -
వేసవి తాపాన్ని క్షణాల్లో తగ్గించే అద్భుతమైన సోంపు షర్బత్..ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ప్రాణాయామం అంటే ఏమి? ప్రయోజనాలేంటి?
ప్రస్తుతం ప్రాణాయామం అనే మాటను వినని వారు సాధారణంగా వుండరనుకుంటాను. పలు సంస్థలు పలుచోట్ల శిక్షణలను నిర్వహించడం, ప్రచారం జరపటం మూలంగా అందరికీ ఈమాట తెలిసింది. గతములో అయితే ఏ గుళ్ళోకి వెల్లినప్పుడో ,పెళ్ళి,శుభకార్యాలప్పుడో అయ్యవారు. ముక్కుపట్టుకో నాయనా, గాలిపీల్చుకో నాయనా అని చెప్పటం మనకు అర్ధం కాకున్నా తంతులాగా ముగించటం జరిగేది. ఇప్పుడు దీనివిలువ తెలిశాక అప్పుడు నవ్విన వాళ్ళే నేర్చుకోవడానికి పరుగులు
మనిషి జీవనానికి ఆధారం ప్రాణవాయువు(ఆక్సిజన్) ను మనం ఎంత ఎక్కువగా తీసుకోగలిగితే మనశరీరవ్యవస్థ అంత సమ్ర్థంగా పనిచేస్తుంది. దీనికవసరమయిన శ్వాస క్రియ అసంకల్పితంగనే జరుగుతుంది. దీనివలన మనం 500 మి.లీ. గాలిని మాత్రమే తీసుకోగలుగుతాము. కానీ మన ఊపిరితిత్తులకు రెండున్నరలీటర్ల గాలిని తీసుకోగలిగే అవకాశం ఉంది. మనం సంకల్పించి పూర్తిగా గాలిని తీసుకోవాలనుకుంటే 5 లీటర్ల గాలిని పీల్చవచ్చని వైద్య నిపుణులు అంగీకరిస్తున్నారు.
యోగా వల్ల ఆశ్చర్యకరమైన 10 ఆరోగ్య లాభాలు: క్లిక్ చేయండి
శ్వాస క్రియ ద్వారా మనం పీల్చే గాలి పరిమాణం పెరిగితే జీవకణాలకు ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. జీవకణాలు శక్తివంతమవుతాయి,అవిశక్తివంతమయ్యాయంటె ఆరోగ్యంగా వున్నట్లే. ప్రాణాయామంతో పాటు శరీర కండరాలు కూడా బాగా బిగించటం వదులు చేయటం ద్వారా శక్తివంతం చేయవచ్చు. శరీర భాగాలను పైకి క్రిందకు పక్కకు కదిలిస్తూవుంటే శక్తిని పొందుతాయి. ఆరోగ్యం కాపాడ బడుతుంది. దీనినే యోగాసనాలుగా మన మహర్షులు మనకందించారు.
అతి సులభంగా బరువు తగ్గించే యోగాసనాలు: తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
ప్రాణాయామం చేయడానికి ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మరింత ఎక్కువ ఆరోగ్యప్రయోజనం పొందడానికి ఉదయం పూట చేస్తే మరింత మేలు జరుగుతుంది. మైదానంలోగాని, తోటలోగాని, తలుపులు తెరచియున్న గదిలోగాని, కంబళీ లేక బట్ట లేక ఏదేనీ ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి. గాలి విపరీతంగా వీస్తూ ఉంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు. మురికిగా ఉన్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం(యోగా) చేయకూడదు. సిగరెట్టు, బీడి, చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు. పొట్ట నిండుగా ఉన్నపుడు ప్రాణాయామం చేయకూడదు. మరి ఈ ప్రాణాయమం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం:

ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి:
ప్రాణాయం వల్ల ఇది ఒక ముఖ్యమైన ప్రయోజనం. ప్రాణాయామం ఒక ఉత్తమ శ్వాస తీసుకోవడానికి ఒక మంచి టెక్నిక్. ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. ఆస్త్మా శ్వాస సంబంధిత సమస్యలున్నవారు ప్రాణాయామం చేయడం వల్ల చాలా బాగా సహాయపడుతుంది.

బరువు తగ్గిస్తుంది:
ప్రాణాయామం వల్ల శరీరంలోని అంతర్గత అవయవాలు యొక్క కార్యచరణకు మాత్రమే పరిమితం కాదు. ప్రాణాయామం వల్ల బరువు కూడా తగ్గవచ్చు. రెగ్యులర్ గా ప్రాణాయామం చేయడం వల్ల తప్పనిసరిగా ఫలితాన్ని గమనించవచ్చు

నిర్విషీకరణ:
నిర్విషీకరణ: ప్రాణాయామం శరీరంలోని అన్ని అవయవాలను శుభ్రం చేసి, మలినాలను బయటకు నెట్టివేయబడుతుంది. శరీరం శుభ్రపరుచుకోవడానికి యోగాలో అనేక పద్దతులు ఉన్నాయి. వాటిలో ప్రాణాయామం చాలా ఉత్తమమైన పద్దతి.

డిప్రెషన్ తగ్గిస్తుంది:
ప్రాణాయామం వల్ల మరో ముఖ్యమైన ఆరోగ్యప్రయోజనం ఇది డిప్రెషన్ తగ్గిస్తుంది. రెగ్యులర్ గా ప్రాణాయమం చే0యడం వల్ల డిప్రెషన్ మరియు ఆందోలన తగ్గించడానికి సహాయపడుతుంది

నాసల్ ప్యాసేజ్ ను శుభ్రపరుస్తుంది:
నాసల్ ప్యాసేజ్ ను శుభ్రపరుస్తుంది: ముక్కు మూసుకు పోవడం వల్ల శ్వాస
సరిగా అందవకపోవచ్చు. కాబట్టి, ప్రాణాయం వల్ల నాసల్ ప్యాసేజ్ శుభ్రపడుతుంది.

వ్యాధి నిరోధకతను పెంచుతుంది:
వ్యాధి నిరోధకతను పెంచుతుంది: వ్యాధినిరోధకత పెంచుకోవడానికి ప్రణాయామం బాగా సహాయపడుతుంది. ప్రాణాయామం వల్ల ఒది ఒక ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ప్రాణాయామం వల్ల జీర్ణక్రియ మెరుగుపరుడుతుంది . అసధారణ ఆహారపు అలవాట్లు కలిగిన వారికి యోగా వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ప్రేగులు, నరాలు, నాడులు శుభ్ర పడతాయి.

గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది:
గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది: గుండెకు సత్తువ లభిస్తుంది. ప్రాణాయామం టెక్నిక్స్ వల్ల మీ శరీరంలో బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది. దాంతో ఆక్సిజన్ సామర్థ్యం రక్తంలో పెరుగుతుంది.

మానసిక స్థితి మెరుగుపరుస్తుంది:
మానసిక స్థితి మెరుగుపరుస్తుంది: ప్రాణాయామం వల్ల మానసిక స్థితి మెరుగుపరుస్తుంది. ప్రాణాయామం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది

సైనసైటిస్ తో పోరాడుతుంది:
సైనసైటిస్ తో పోరాడుతుంది: ప్రాణాయామం వల్ల సైనసైటిస్ తగ్గించడంలో ప్రాణాయామం బాగా సహాయపడుతుంది. సైనసైటిస్ తగ్గించడానికి, రాకుండా నివారించడానికి ప్రాణాయామం ఒక ఉత్తమ ఎంపిక.



Click it and Unblock the Notifications











