Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
పచ్చి బొప్పాయలోని ఆరోగ్యప్రయోజనాలు
బొప్పాయి, మనందరకి తెలిసినటువంటి ఒక ఫ్రూట్. దీన్ని ‘ఏంజిల్స్ ఫ్రూట్' అని కూడా పిలుస్తారు. ఈ ఫ్రూట్ కు పురాతన కాలం నుండి ఒక గొప్ప ఔషధ చరిత్ర ఉంది. ఈ రుచికరమైన పండులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మరియు మినిరల్స్ మరియు అధిక పోషక ప్రయోజనాలను సమృద్ధిగా అందిస్తుంది. బొప్పాయి పండులోనే కాదు, బొప్పాయ కాయలో కూడా అనేక పోషకాంశలున్నాయి. అందుకే పచ్చిబొప్పాయను కూడా మార్కెట్లో విరివిగా అమ్ముతుంటారు. పచ్చిబొప్పాయ గ్రీన్ కలర్ లో ఉంటుంది. లోపల తెల్లగా ఉంటుంది.
పండిన బొప్పాయి కంటే, పచ్చిబొప్పాయి అంతగా పాపులర్ కాలేదు. ఎందుకంటే పండిన బొప్పాయి పండు రుచి అద్భుతంగా ఉంటుంది. మరియు త్వరగా జీర్ణం అవుతుంది. తినడానికి కూడా మెత్తగా ఉంటుంది. అదే గ్రీన్ కలర్ లో ఉండే పచ్చిబొప్పాయిని తినడం కూడా కొంచెం కష్టమే. దీన్ని ఉడికించి తినాల్సి ఉంటుంది. మరియు టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది.
బొప్పాయి జ్యూస్: వండర్ ఫుల్ బెనిఫిట్స్:క్లిక్ చేయండి
మరో ఆసక్తికరమైన విషయమేటిటంటే గ్రీన్ బొప్పాయిలో కూడా ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఎందుకంటే, పచ్చిబొప్పాయిలో, విటమిన్స్, ఎంజైమ్స్ మరియు పాలిన్యూట్రీయంట్స్ కలిగి ఉన్నాయి. అంతే కాదు, ఇందులో అవసరం అయ్యే న్యూట్రియంట్స్ మరియు మినిరల్స్ పొటాషియం, మెగ్నీషియం, విటమిన్స్ ఎ,బి, సి మరియు ఇ లు కలిగి ఉన్నాయి.
పచ్చిబొప్పాయిలో వీటితో పాటు అధిక ఎంజైమ్స్ పెపిన్ మరియు కీమోపెపిన్ అనేవి పొట్ట ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చిబొప్పాయి ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తుంది. ఉదాహరణకు, గ్రీన్ పపాయ జీర్ణక్రియను మెరుగుపరుపరుస్తుంది. ప్రోటీనులను అమినోఆసిడ్స్ గా మార్చుతుంది. కోలన్ శుభ్రం చేస్తుంది. వికారం మరియు మలబద్దకంను మరికొన్నివ్యాధులను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో గ్రీన్ బొప్పాయి చాలా మేలు చేస్తుంది. అంతే కాదు, పచ్చిబొప్పాయిలోని మరికొన్ని ఆరోగ్యప్రయోజనాలు మీకోసం...

జీర్ణక్రియకు
గ్రీన్ పపాయలోని ఫవర్ ఫుల్ ఎజైమ్స్ వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు పొట్టలో గ్యాస్ ను నివారిస్తుంది.

వ్యాధినిరోధకతను పెంచుతుంది
పండిన బొప్పాయ వలే పచ్చిబొప్పాయ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది వ్యాధినిరోధకత పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఎ, సి మరియు విటమిన్ ఇ లు అనేక ఇన్ఫెక్షన్స్, దగ్గు మరియు జలుబును నివారిస్తుంది.

మలబద్దకానికి చికిత్స వంటిది
పచ్చిబొప్పాయిలో పెపిన్ అధికంగా ఉంటుంది. మలబద్దకాన్నిసహజంగా నివారించడంలో పచ్చి బొప్పాయి ఒక బెస్ట్ ఫ్రూట్ . పచ్చిబొప్పాయలో ఉన్నంత పెపిన్ అనే ఎంజైమ్స్ పండిన బొప్పాయిలో ఉండవు.

కోలన్(పెద్దప్రేగు)ను శుభ్రం చేస్తుంది
పచ్చిబొప్పాయి జ్యూస్ త్రాగడం వల్ల పెద్ద ప్రేగు శుభ్రపడుతుంది. పెద్ద ప్రేగును శుభ్రపరచడానికిఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.

బ్రెస్ట్ మిల్క్ పెంచుతుంది
బాలింతలు పచ్చి బొప్పాయిను తినడం వల్ల వారిలో పిల్లలకు సరిపడా పాలు పడుతాయి.

యూటిఐకి రక్షణ కల్పిస్తుంది
ఎవరైతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతుంటారో, అటువంటి వారు తప్పకుండా పచ్చిబొప్పాయి జ్యూస్ ను త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. యూటిఐకి కారణం అయ్యే బ్యాక్టీరియా నుండి రక్షణ కల్పిస్తుంది.



Click it and Unblock the Notifications
