Latest Updates
-
ఈ 5 సూపర్ ఫుడ్స్ చాలు.. వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీకి ఢోకానే ఉండదు.! -
Father's Day 2026: చాలా మంది తండ్రులు 60 ఏళ్లు దాటాక పశ్చాత్తాపపడే ఒక్క విషయం అదే! -
జుట్టు చివర్లు దారుణంగా చిట్లిపోతున్నాయా.. మీరు చేస్తున్న తప్పులివే.! -
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు.. -
పెళ్లయింది తర్వాతేంటి.. అమ్మాయిలు గూగుల్ని అడుగుతున్న సలహాలు ఇవేనట.! -
పోషకాల పవర్ హౌస్..ఇంట్లోనే రాగి మాల్ట్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే.. -
ఆర్థరైటిస్ పేషెంట్లకు అలర్ట్.. ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.? -
నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం.. శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది! -
జూన్ 19 నుంచి ధన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
పొగాకు నమిలితే క్యాన్సర్, గుండెపోటు మాత్రమే కాదు.. మరో ప్రమాదం ఉందని తెలుసా.?
పుదీనా ఇలా తీసుకుంటే మరింత ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు
మన పరిసరాలలో దొరికే ఎంతో విలువైన మొక్కల్లో పుదీనా ఒకటి. ప్రత్యేకమైన సువాసన... మెదడుని సానుకూలంగా ప్రభావితం చేసే శక్తి పుదీనా ఆకులకు సొంతం. గ్రీన్ చట్ని తయారీలో, బిర్యానిలో తప్ప దీనికి మరేం ప్రయోజనాలుంటాయి అనుకోవచ్చు. దీనిలో ఔషధ గుణాలతో పాటు, జీవక్రియని సమర్దంగా నడిపించే పోషకాలూ పుష్కలమే! చాలా రకాల వ్యాధులకి తయారు చేసే ఔషధాల్లో పుదీనా (మింట్) ఎక్కువ శాతం వాడకంలో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్ ఉంది. పుదీనా ఫ్లేవర్‌తో తయారైన ఏ ప్రొడక్టకైనా ప్రపంచవ్యాప్తంగా వినియోగం అధిక సంఖ్యలో ఉందనడం అతిశయోక్తికాదు.
ముఖ్యంగా మౌత్ ఫ్రెషనర్స్ లో పుదీనా ఆకుల్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. పుదీనా ఆకులో వెలకట్టలేని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కనుకనే దీన్ని వివిధ రకాల టూత్ పేస్ట్, చూయింగ్ గమ్స్, బ్రీత్ ఫ్రెష్నర్స్, క్యాండీస్ మరియు ఇన్ హేలర్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కారణం పుదీనా ఆకులు శరీరంను కూల్ గా ఉంచుతాయి. బ్యాడ్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. శరీరంలోపల మరియు బయట చల్లగా ఉంచుతుంది. అందుకే నేరుగా పుదీనా ఆకులను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు జరుగుతాయి. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది, ఒక టాబ్లెట్ తీసుకొన్నంత సామర్థ్యాన్ని నేరుగా అందిస్తుంది.

పుదీనా ఆకుల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచే విన్తమిన్ ఎ, విటమిన్ సి గుణాలు అధికం. ఉదయాన్నే కప్ఫుడు పుదీనా తీని, తాగితే దాని నుంచి శరీర పనితీరుకి అవసరం అయిన రాగి, పీచు, కాలుష్యంతో పాటు మాంగనీసు, పొటాషియం కూడా అందుతాయి. గర్భిణులకు అవసరం అయిన ఫోలికామ్లం, ఒమేగా త్రీలు కావాల్సినంత. చాపకింద నీరులా, శరీరంలో మనకు తెలియకుండా పెరిగే కణుతుల పెరుగుదల కు అడ్డుకట్ట వేయాలంటే రోజువారీ ఆహారంలో ఆకులని గ్రీన్ చట్ని రూపంలో కానీ, టీగా కానీ తీసుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి వీటితో పాటు మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ క్రింది విధంగా
వేసవితాపానికి బెస్ట్ మెడిసన్ ఫ్రెష్ పుదీనా జ్యూస్: క్లిక్ చేయండి
తీసుకొనే విధానం:
1. గుడ్డుతో చేర్చండి: ఆమ్లెట్ ఫ్లేవర్ ను మరింత బ్రైట్ గా మార్చడానికి కొత్తిమీరకు బదులుగా పుదీనా ఆకులను ఆమ్లెట్ కు జోడించండి.
2. సలాడ్స్: సలాడ్స్ లో తాజాగా ఉండే పుదీనా ఆకులను గార్నిష్ చేసి సర్వ్ చేయవచ్చు.
3. మింట్ టీ: ఒక గుప్పెడు పుదీనా ఆకులను కప్పు టీలో జోడించి మరిగించి, స్టెయినర్ తో తొలగించి, సుగర్ కు బదులుగా తేనె మిక్స్ చేసి తీసుకోవచ్చు.
4.ఐస్ వాటర్: ఐస్ వాటర్లో రెండు మూడు పుదీనా ఆకులను వేసి తీసుకోవడం వల్ల స్టొమక్ అప్ సెట్ ను నివారిస్తుంది.

ఫ్రెష్ పుదీనా 4 విధాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది:
అలర్జీలను తగ్గిస్తుంది: పుదీనా ఆకుల్లో యాంటీఆక్సిడెంట్స్ మరియు రోస్ మ్యారిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది . ఈ అసిడ్స్ సీజనల్ గా వచ్చే అలర్జీలను నివారిస్తుంది.

దగ్గు జలుబు నివారిస్తుంది: పుదీనాలో మెంతాల్ అధికంగా ఉంటుంది. మెంతాల్ డీకంజెస్టాంట్ గొంతులో గరగర వంటి ఇబ్బందులకు లోనయినప్ఫుడు కప్ఫు పుదీనా చాయ్ తాగండి. నిమిషాల్లో సాంత్వన పొందొచ్చు. నాసల్ పాసేజ్ ఫ్రీ అవుతుంది

జీర్ణ సమస్యలను నివారిస్తుంది: రెగ్యులర్ డైట్ లో పొదీనా తీసుకోవడం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి వేగవంతం చేస్తుంది. రెండు స్పూనుల పుదీనా ఆకు రసంలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ మూడుసార్లు తీసుకుంటే కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం తగ్గుతాయి.

మార్నింగ్ సిక్ నెస్: గర్భినీ స్త్రీలకు చాలా మంచిది. పుదీనా యొక్క ఆరోగ్య ప్రయోజనం. ముఖ్యంగా గర్భిణీల్లో ఉదయం పూట అసౌకర్యాన్ని, వికారాన్ని నివారించి సుగుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.




Click it and Unblock the Notifications