కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉత్తమ మార్గాలు

సహజంగా మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అన్నది మన శరీరంలో పనిచేసే అవయవాల ద్వారనే తెలుస్తుంది. ఏ అవయవం సరిగా పనిచేయకపోయినా, జీవక్రియలకు అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి, మన శరీరం ఎల్ల వేళలా ఆరోగ్యంగా పనిచేసే విధంగా ఉంచుకోవాలి. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలి. ముఖ్యంగా మన శరీరంలో అత్యంత ప్రధాన పాత్ర పోషించే అవయవం కిడ్నీలు(మూత్రపిండాలి)శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిచే ప్రక్రియ కిడ్నీల ద్వారానే జరుగుతుంది ?

మూత్రపిండాలు మరియు వాటియొక్క విధులు? మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో రెండు ఉంటాయి. ఇవి వెన్నెముకకు ఇరువైపులు ఉంటాయి. ఇవి శరీరంలో అత్యంత ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. ఈ మూత్రపిండాలు మన శరీరంలో నిర్వహించి ఆ పనులేంటో వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోండి.

మూత్రపిండాలు శరీరంలో టాక్సిన్స్ ను బయటకు పంపుటలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. శరీరానికి అనవసరమైనవన్నీ బయటకు నెట్టివేస్తుంది. ముఖ్యంగా టాక్సిన్స్(శరీరంలో వ్యర్థాలను) మరియు ఉప్పను ఫిల్టర్ చేస్తుంది. కిడ్నీల యొక్క ప్రధాన విధి యూరిన్ ను ఉత్పత్తి చేయడం . ఈ ప్రక్రియ కారణంగానే శరీరంలో నీరును క్రమబద్దం చేస్తుంది. ఈ రెండు ప్రధానమైన ప్రక్రియలే కాకుండా మరో ముఖ్యమైన విధి బ్లడ్ ప్రెజర్ ను , రెడ్ బ్లడ్ సెల్స్ మరియు శరీరంలో యాసిడ్స్(ఆమ్లాల)ఉత్పత్తిని క్రమబద్దం చేస్తుంది.

కిడ్నీలను ఆరోగ్యంగా చూసుకోవడం : సహజంగా ప్రతి ఒక్క మనిషీ రెండు కిడ్నీలతో పుడుతారు, అయితే ఒక్క కిడ్నీతో కూడా జీవించవచ్చు. ఈ కిడ్నీలు శరీరంలో టాక్సిన్స్ ను తొలగించడానికి వివిధ రకాలుగా సహాయపడుతుంది మరియు కొన్ని ఆరోగ్యకరమైన చిట్కాలను అనుసరించడం ద్వారా అత్యంత ముఖ్యమైనటువంటి మూత్రపిండాలను జీవితకాలంలో ఆరోగ్యంగా ఉంచుకొని, ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు.

వ్యాయామం: రెగ్యులర్ వ్యాయామంను తక్కువగా అంచనా వేయకూడదు. అది శరీరానికి ఏ అవయవానికి సహాయపడుతుందనేది విషయం కాదు, మొత్తం శరీరం యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది. కాబట్టి, మీ దినచర్యలో ఒక భాగంగా వ్యాయామంను అలవర్చుకోవాలి.
మెడికల్ టెస్ట్: 30ఏళ్ల తర్వాత ప్రతి ఒక్కరూ వైద్యపరమైన చికిత్సలు చేయించుకోవడం వల్ల, శరీరం యొక్క ఆరోగ్యస్థితిగతులను తెలుసుకోవచ్చు . అలాగే ఇటువంటి టెస్ట్ లు సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటుండం కూడా మంచిది. ముఖ్యంగా కిడ్నీ యొక్క స్థితిగతులను తెలుసుకోవచ్చు. అలాగే ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్న కూడా మరొకరికి వచ్చే అవకాశం ఎక్కువ.

డైట్ కంట్రోల్: మీరు తీసుకొనే ఆహారం మీ చేతుల్లోనే ఉంది, ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటికి ఆరోగ్యానికి మేలైనవి ఎంపిక చేసుకొని తీసుకొని, తినాల్సి ఉంటుంది. అలాగే ఈ ఆహారాలను తయారుచేసేప్పుడు ఎటువంటి ఫ్లేవర్స్ జోడించకుండా ఫ్రెష్ గా తీసుకోవాలి . అలాగే ముందుగా తయారుచేసి ప్యాక్ చేసిన ఆహారాలను తినడం నివారించుకోవాలి.

బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్లో ఉంచుకోవాలి: మూత్రపిండాలు, బ్లడ్ ప్రెజర్ తో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి, బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. హైబ్లడ్ ప్రెజర్ కిడ్నీ డ్యామేజ్ కు దారితీస్తుంది.

బ్లడ్ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి: మధుమేహం మరియు కిడ్నీ వ్యాధులు రెండు ఒకదానికొకటి చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. చాలా వరకూ మధుమేహగ్రస్తుల్లో కిడ్ని వ్యాధులు వ్యాపిస్తాయన్న విషయం తెలిసిందే. కాబట్టి, హెల్తీ బ్లడ్ షుగర్ లెవల్స్ ను నిర్వహించడం వల్ల కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

వాటర్: రోజూ తగు మోతాదులో నీరు త్రాగడం వల్ల కిడ్నీలు చక్కగా పనిచేస్తాయి. చాలా తక్కువగా నీళ్ళు మరియు ఫ్లూయిడ్స్ తీసుకొనే వారు కిడ్నీల మీద ఒత్తిడి పడి వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

Ways To Keep Your Kidneys Healthy

ధూమపానం నివారించాలి: ధూమపానం వల్ల కిడ్నీలకు రక్తప్రసరణ తగ్గుతుంది. దాని వల్ల శరీరంలో జీవక్రియలు క్రమంగా సక్రమంగా పనిచేయడంలో అంతరాయం కలుగుతుంది . కాబట్టి, ధూమపానం విడిచిపెట్టడం వల్ల కిడ్నీలకు రక్తం క్రమంగా సరఫరా అయ్యి, శరీరంలో జీవక్రియలు క్రమంగా మెరుగుపడుతాయి.

సొంతంగా పిల్స్ వినియోగించకూడదు: మీరు డాక్టర్ కాదు లేదా మెడికల్ షాపులో సేల్స్ మెన్ అంతకంటే కాదు. ఎటువంటి మాత్రలైనా మీరు సొంతంగా తీసుకోకూడదు. డాక్టర్ ను సంప్రదించి తర్వాత మెడిసిన్ ఉపయోగించాల్సి ఉంటుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, October 18, 2014, 10:59 [IST]
Desktop Bottom Promotion