For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పెర్మ్ క్వాలిటీపై ప్రభావం చూపే అంశాలు

By Nutheti
|

ఇన్ఫెర్టిలిటీ అనేది ఇప్పుడు సాధారణంగా వినిపిస్తున్న సమస్య. దీనికి చాలా కారణాలున్నాయి. అయితే ప్రధానంగా ప్రస్తుతం ఫాలో అవుతున్న లైఫ్ స్టైల్ అని చెప్పవచ్చు. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్, ఒత్తిడి, పొగత్రాగడం, పనిలో ఒత్తిడి.. ఇవన్నీ ప్రత్యుత్పత్తి లేకపోవడానికి కారణాలు.

READ MORE: పురుషుల వంధ్యత్వాన్నినయం చేయటానికి వెజిటేబుల్స్

ఇలాంటి కేసులు పెరగడానికి మరో కారణమేంటంటే.. పోషకాహారం తీసుకోకపోవడం. జింక్, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్ సరైన మోతాదులో తీసుకోవడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ బావుంటుంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఎక్కువ వాడటం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ తో పాటు క్వాలిటీ తగ్గిపోవడానికి కారనమవుతున్నాయి.

మగవాళ్లు, ఆడవాళ్లలో ఇన్ఫెర్టిలిటీకి నిత్యం తీసుకుంటున్న కెమికల్ ఫుడ్సే కారణమని తెలుస్తోంది. కాబట్టి బయట ఫుడ్ తీసుకోవడం మానేయాలి. అంతేకాదు కూరగాయలు, పండ్లు తినేముందు శుభ్రం చేయడం చాలా అవసరం.

READ MORE: వంధ్యత్వాన్ని జయించిన 5గురు ప్రముఖులు

మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్ల కారణంగానే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. స్మోకింగ్ మేల్ ఫెర్టిలిటీపై ప్రభావం చూపుతోందని తాజాగా మాంచెస్టర్ యూనివర్సిటీ రీసెర్చ్ లో తేలింది. స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ క్వాలిటీ బాగుండాలంటే.. ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.

రెడ్ ఫుడ్

రెడ్ ఫుడ్

ఎరుపు రంగు ఆహార పదార్థాల్లో లైకోపెన్, యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ క్వాలిటీకి సహాయపడతాయి. టమోటాలు, చెర్రీస్, రెడ్ ఆపిల్స్, స్ర్టాబెర్రీస్ తీసుకోవాలి. ఈ పదార్థాలు 80 శాతం స్పెర్మ్ క్వాలిటీ పెంచుతాయి.

తొడలపై ల్యాప్ టాప్ పెట్టుకోవడం

తొడలపై ల్యాప్ టాప్ పెట్టుకోవడం

ల్యాప్ టాప్ ని తొడలపై పెట్టుకోవడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ దెబ్బతింటుంది. ల్యాప్ టాప్ నుంచి వెలువడే వేడి కారణంగా డీఎన్ఏపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ల్యాప్ టాప్ ని టేబుల్ పై పెట్టుకుని వాడుకోవాలి.

సరైన మోతాదులో ప్రొటీన్స్

సరైన మోతాదులో ప్రొటీన్స్

స్పెర్మ్ క్వాలిటీ పెంచడంలో ప్రొటీన్స్ బాగా సహాయపడతాయి. కాబట్టి పోషకాలు పుష్కలంగా ఉండే చికెన్, మటన్, ఫిష్, కోడిగుడ్డు తీసుకుంటూ ఉండాలి. వాల్ నట్స్, క్యాషూ, గుమ్మడికాయ గింజలు తీసుకోవడం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది.

సోయాకు నో

సోయాకు నో

స్పెర్మ్ క్వాలిటీ బాగుండాలంటే సోయాకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు. సోయాలో మహిళల్లో ఈస్ర్టోజెనిక్ ఎఫెక్ట్ కి, మగవాళ్లలో తక్కువ సంతోనోత్పత్తికి కారణమై.. స్పెర్మ్ కౌంట్ తగ్గిస్తుంది.

జింక్, విటమిన్ సి

జింక్, విటమిన్ సి

విటమిన్ సి, జింక్, సెలీనియమ్, ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ, కౌంట్ పెరుగుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని పొందాలంటే ల్యాంబ్, స్పినాచ్, గుమ్మడి విత్తనాలు తీసుకోవాలి. కమలాలలో సిట్రస్ ఉంటుంది కాబట్టి ఇవి విటమిన్ సి అందిస్తాయి.

ప్లాస్టిక్ వస్తువులకు నో

ప్లాస్టిక్ వస్తువులకు నో

ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువగా వాడటం వల్ల స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. ప్లాస్టిక్ వస్తువులలో తినడం, తాగడం వల్ల కెమికల్స్ ఆహార పదార్థాలు, పానీయాలలో చేరుకుని హాని కలిగిస్తాయి. ఆహారం ద్వారా శరీరంలోకి చేరుతాయి.

ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్

ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్

ఫ్లాక్స్ సీడ్స్, సాల్మన్ ఫిష్, ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పొందవచ్చు. స్పెర్మ్స్ పోషకాలు, ఫ్యాట్స్ ద్వారా తయారవుతాయి. ఫ్యాటీ యాసిడ్ ఆధారంగా స్పెర్మ్ క్వాలిటీ ఉంటుంది. ఫ్యాట్స్ కంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ పెరుగుతుంది.

కప్పు కాఫీ

కప్పు కాఫీ

కప్పు కాఫీ తీసుకోవడం వల్ల స్పెర్మ్ లైఫ్ పెరుగుతుంది. అలాగే క్వాలిటీ కూడా మెరుగవుతుంది. కాఫీ వల్ల స్పెర్మ్ కి స్విమ్మింగ్ స్పీడ్ తో పాటు మొటాలిటీ కూడా పెరుగుతుంది. కానీ.. లిమిట్ గా తీసుకోవాలి. రోజుకి రెండు కంటే ఎక్కువ కప్పుల కాఫీ తీసుకోకూడదు.

వ్యాయామం

వ్యాయామం

వ్యాయామం ద్వారా రక్తప్రసరణ పెరుగుతుంది. అంతేకాకుండా ఆక్సిజెన్, న్యూట్రియెంట్స్ బాగా అందుతాయి. అయితే రోజుకి 45 నిమిషాలు చొప్పున వారానికి ఐదు సార్లు వ్యాయామం చేస్తే స్పెర్మ్ క్వాలిటీ పెరుగుతుంది.

క్యాలీఫ్లవర్, క్యాబేజీ

క్యాలీఫ్లవర్, క్యాబేజీ

క్యాబేజ్, బ్రూసెల్, స్ర్పౌట్స్, బ్రొకోలీలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల స్పెర్మ్ క్యాలిటీ పెరుగుతుంది. ఇవి కాలేయాన్ని శుభ్రపరిచి టాక్సిన్స్ ని తొలగిస్తాయి. దీనివల్ల స్పెర్మ్ క్యాలిటీ మెరుగవుతుంది.

ఒత్తిడి

ఒత్తిడి

మగవాళ్లు, ఆడవాళ్లలో ఇన్ఫెర్టిలిటీకి ప్రధాన కారణం ఒత్తిడి. ఒత్తిడి, ఆందోళన టెస్టోస్టిరోన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. దీనివల్ల స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది.

English summary

10 Factors That Increase Sperm Quality in telugu

Nowadays, there is a growing rate of infertility recorded both in men and women that can be caused due to many factors. First of all, our faulty lifestyle, such as lack of exercise, eating junk food, stress, smoking and pressure during work, contributes to infertility.
Story first published: Tuesday, November 17, 2015, 17:30 [IST]
Desktop Bottom Promotion