హైపో థైరాయిడ్ ను నివారించే 12 పవర్ ఫుల్ ఫుడ్స్

ఎలాంటి శారీరక చర్యలేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఆహారంలో సమతుల్యత లోపించడంతో చాలా మందితోపాటు యువత కూడా హైపోథైరాయిడిజం బారినపడుతున్నారని వైద్యనిపుణులు పేర్కొన్నారు. ఈ వ్యాధి స్త్రీపురుషుల్లో ఎవరికైనా రావచ్చు. ఎక్కువ శాతం మహిళలో కనిపిస్తుంది. స్త్రీ పురు షుల నిష్పత్తి 6:1. ప్రజలు హైపోథైరాయిడిజంతో బాధపడటానికి ఆహారంలో అయోడిన్‌ లోపమే ప్రధాన కారణం. ఆహారంలో ఐయోడిన్‌ లోపం లేని ప్రాంతాలలో కూడా ప్రైమరీ హైపోథైరాయిడి జమ్‌ రావడానికి హసిమోటోస్‌ థైరాయిడైటిస్‌ అనే స్థితి 90శాతం కారణమవుతోంది.

హైపోథైరాయిడిజం అంటే? థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయనపుడు ఏర్పడే పరిస్థితిని హైపోథైరాయిడిజం అంటారు. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. హైపోథైరాయిడిజంను రెండు రకాలుగా విభజించవచ్చు.

ప్రాథమిక రకం: సాధారణంగా ఈ సమస్య థైరాయిడ్ గ్రంథిలోనే ఏర్పడుతుంది. థైరాయిడ్ గ్రంథి తగినన్ని థైరాయిడ్ హర్మోన్లను ఉత్పత్తి చేయదు.

రెండవరకం: కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ కాక పీయూష గ్రంథిలో సమస్య కారణంగా హైపోథైరాయిడిజం ఏర్పడుతుంది.

లక్షణాలు: హైపోథైరాయిడిజం సాధరాణంగా బలహీనత, బద్ధకం, నీరసం, ఎక్కువగా తినకపోయినా బరువు పెరగడం, గొంతు బొంగురుపోవడం, చలిని తట్టుకోలేకపోవడం, మలబద్దకం, రుతుక్షికమ సమయంలో అధిక రక్తవూసావం, గుండె, నాడి బలహీనంగా కొట్టుకోవడం, కొన్ని సమయాలలో హైబ్లడ్ ప్రెషర్ ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. ముఖం పాలిపోయి ఉండటం, మాట మెల్లగా రావడం, కనుగుడ్లు చిన్నవి కావడం. ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవడం, తన చుట్టూ ఉన్న పరిసరాలను పట్టించుకోకపోవడం. చర్మం పొడిగా, ఎండిపోయినట్లు ఉండడం, గోళ్లు పలుచనై, చిట్లిపోవడం. తల వెంట్రుకలు పలుచనైపోయి ఎండిపోయినట్లు ఉండడం. కండరాలు బిగుసుకుపోవడం, కీళ్లు నొప్పిగా ఉండడం. ఈ హైపోథైరాయిడిజం నుండి బయట పడాలంటే కొన్ని ముఖ్యమైన ఆహారాలు తీసుకోవాలి. మరి ఆ ఆహారాలేంటో చూద్దాం...

1. సోయ మరియు మిల్లెట్:

1. సోయ మరియు మిల్లెట్:

సోయా మరియు మిల్లెట్ లో హార్మోన్ ఫైటోఈస్ట్రోజన్ థైరాక్సిన్ ఉత్పత్తి చేసే థైరాయిడ్ గ్లాండ్ ను తగ్గిస్తుంది.కాబట్టి, హైపోథైరాయిడిజం చికిత్స తీసుకొనే వారికి ఇది ఒక మంచి ఆహారం.

2. బ్రొకోలీ మరియు క్యాబేజ్ :

2. బ్రొకోలీ మరియు క్యాబేజ్ :

థైరాయిడ్ సమస్యతో బాధ పడేవారు మంచి పండ్లు మరియు కూరగాయలను ప్రతి రోజూ తీసుకొనే డైయట్ లిస్ట్ లో చేర్చుకోవాలి. మీరు తీసుకొనే పండ్లు, కూరగాయల ద్వారా ఎక్కువ ఫైబర్ శరీరానికి అందటం వల్ల అలసట నుండి బయటపడవచ్చు. అంతే కాదు జీర్ణ శక్తిని పెంపొందించుకోవచ్చు. హైపోథైరాయిడిజం వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలు రాకుండా ఉండాలంటే బ్రొకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజ్, ధాన్యాలు, మరియు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.

3. గ్లుటిన్:

3. గ్లుటిన్:

థైరాయిడ్ సమస్య ఉన్నావారు గ్లుటిన్ ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. మీరు బ్రెడ్ తినాలనుకుంటే గ్లుటిన్ ఉన్న ఆహారాలనే ఎక్కువగా తీసుకోవాలి.

4. ప్రొసెస్డ్ ఫుడ్స్:

4. ప్రొసెస్డ్ ఫుడ్స్:

ఇందులో చెడు ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి థైరాయిడ్స్ గ్లాండ్స్ సామర్థ్యం థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఫ్రైడ్ మరియు ప్రొసెస్డ్ ఫుడ్స్ ను తగ్గించాలి.

5. ఫ్యాట్ ఫుడ్స్ :

5. ఫ్యాట్ ఫుడ్స్ :

ఫ్యాట్ ఫుడ్స్ బటర్, మయోనైజ్ మరియు అనిమల్ ఫ్యాట్ ను తీసుకోవడం తగ్గించడం ద్వారా అనిమల్ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు .

6. సల్ఫర్ ఫుడ్:

6. సల్ఫర్ ఫుడ్:

కార్న్, ఫ్లాక్స్, లిమా బీన్స్, స్వీట్ పొటాటో, వంటి సల్ఫర్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి . వీటిలో థైయోసైనేట్స్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల ఇవి థైరాయిడ్ గ్లాండ్స్ కు ఐయోడిన్ ను సప్లై చేస్తాయి .

7. క్వర్సిటిన్:

7. క్వర్సిటిన్:

క్రాన్ బెర్రీ, ఉల్లిపాయ, టీ, బ్రొకోలీ, రెడ్ వైన్, ఆపిల్స్, ద్రాక్ష, బ్లూ బెర్రీస్, జింగోకో, బిలోబ మరియు ఆప్రికాట్ వంటి క్వర్సిటిన్ ఆరోగ్యానికి చాలా మంచిది. థైరాయిడ్ పేషంట్స్ వీటిని తీసుకోవడం ద్వారా హైపోథైరాయిడిజం తగ్గించుకోవచ్చు.

8. ఆర్టిఫిషియల్ షుగర్స్:

8. ఆర్టిఫిషియల్ షుగర్స్:

థైరాయిడ్ వ్యాధికి ఇది కూడా ఒక కారణం. హైపోథైరాయిడిజం బాడీ మెటబాలిజం తగ్గిస్తుంది. అందువల్ల ఇది క్యాలరీలను తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి షుగర్ కుక్కీస్, పాస్టిరైస్, క్యాండీస్ మొదలగునవి తగ్గించాలి.

9. ఫైబర్ రిచ్ ఫుడ్ :

9. ఫైబర్ రిచ్ ఫుడ్ :

ధాన్యాలు: ధాన్యాలలో ముఖ్యంగా బ్రౌన్ రైస్, ఓట్ మీల్, బార్లీ, వంటివి తినడం వల్ల ఇందులో అధిక శాతంలో విటమిన్ బి మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇది జీవక్రియ సక్రమంగా పనిచేసేందుకు సహాయపడుతుంది. థైరాయిడ్ కు కారణమయ్యే హార్మోన్స్ మీద ధాడిచేసి రక్షణ కల్పిస్తుంది. అంతేకాకుండు ఈ ధాన్యాలలో లో గ్లిసిమిక్ శరీరంలోని రక్తంలోని చెక్కర స్థాయిలను క్రమంగా ఉండేందుకు సహాయపడుతుంది.

10. బెవరేజ్ కలిగిన కెఫిన్ :

10. బెవరేజ్ కలిగిన కెఫిన్ :

ఎనర్జి డ్రింక్స్ మరియు సాప్ట్ డ్రింక్స్ కెఫిన్ ఎక్కువగా ఉంటుంది . కెఫిన్ థైరాయిడ్ మెడికేషన్ తగ్గించేస్తుంది . జీర్ణక్రియకు ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి కెఫిన్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి.

11. క్యాల్షియం ఫుడ్ నివారించాలి:

11. క్యాల్షియం ఫుడ్ నివారించాలి:

క్యాల్షియం సప్లిమెంట్ లేదా క్యాల్షియం ఉన్న ఆహారాలను రెగ్యులర్ డైట్ ను తొలగించాలి.

12. ఆల్కహాల్:

12. ఆల్కహాల్:

థైరాయిడ్ గ్లాండ్ కు ఇది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి, ఆల్కహాల్ ను పూర్తిగా మానేయాలి.

Story first published: Saturday, March 14, 2015, 16:10 [IST]
Desktop Bottom Promotion