Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే ఈ ఆహారాలు రెగ్యులర్ గా తినండి
మీరు నిద్రలేమితో బాధపడుతున్నారా? కల నిద్రతో ఇబ్బంది పడుతున్నారా. నిద్రలేమి లేదా కలత నిద్ర అనేక వ్యాధులకు మూలం. ముఖ్యంగా అధిక రక్తపోటు, నిలకడేలని మనస్సు, అధిక బరువు వంటి వ్యాధులకు కారణం అవుతుంది. ఒక్కో సందర్భంలో వర్క్ ప్రెజర్ వల్ల రాత్రుల్లో మేల్కోవల్సి వస్తుంది. అది మీ నిద్రవ్యవస్థకు భంగం కలిగిస్తుంది. నిద్రించే టైమింగ్స్ లో మార్పులు వస్తాయి. దాంతో నిద్రలేమి తిరిగి ప్రారంభమవుతుంది. నిద్రలేమి వల్ల అధిక ఒత్తిడికి గురి అవ్వడం మాత్రమే కాదు, మీరు మరుసటి రోజు మీ పని మీద దృష్టి పెట్టటానికి కూడా కష్టం అవుతుంది.
READ MORE: స్మోకింగ్ హ్యాబిట్స్: అపోహలు-వాస్తవాలు..!
ఈ సమస్యను నివారించుకోవడానికి కఠినమైన చికిత్సలు మరియు మందులు వాడకుండా మీకు మీరే నేచురల్ గా చికిత్సనందించుకోవాలనుకుంటే, మీరు తీసుకొనే డైట్ మీద ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. ఈ నేచురల్ పద్ధతి ద్వారా కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం ద్వారా మీ స్లీప్ ప్యాట్రన్(నిద్రను) నార్మల్ చేస్తుంది. మరియు నాడీవ్యవస్థను ప్రశాంత పరుస్తుంది. సమయానికి నిద్రపట్టేలా చేస్తుంది. ఈ క్రింది లిస్ట్ అవుట్ చేసిన ఆహారాలు మీ త్వరగా నిద్రపట్టేలా చేస్తాయి...

ఓట్ మీల్:
ఓట్ మీల్ మీ ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ అయ్యుండవచ్చు. అయితే ఇది ఇస్టిగేట్ ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాదు, ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది . మరియు చాలా తర్వాత నిద్రపట్టేలా చేస్తుంది. మెలటోనిన్ అధికంగా ఉండటం వల్ల ఓట్స్ శరీరంను ప్రశాంతపరుస్తుంది మరియు త్వరగా నిద్రపట్టేందుకు ఉపక్రమిస్తాయి.

బాదం:
బాదం కూడా నిద్రపట్టడానికి సహాయపడుతాయి . బాదంలో మెగ్నీషియం మరియు ట్రైఫోటాఫాన్ ఈ రెండు నరాలను మరియు కండరాలను ప్రశాంత పరుస్తాయి. అదే సమయంలో హార్ట్ బీట్ ను స్థిరంగా ఉంచుతాయి. కాబట్టి, కొన్ని బాదం పలుకులను తినడం ద్వారా ఎక్కువ నిద్రపడుతుంది.

తేనె:
తేనె గ్లూకోజ్ తో నిండి ఉంటుంది . మెదడులో ఉండే ఓరెక్సిన్ అనే కెమికల్ ను నిలుపల దల చేస్తుంది. ఈ కెమికల్ చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది. కాబట్టి, దీన్ని ఆపు చేసి, బాగా నిద్రపట్టేలా చేస్తుంది . కేవలం ఒక టేబుల్ స్పూన్ తేనెతో మంచి నిద్రపడుతుంది.

బ్రెడ్:
త్రుణదాన్యాలతో తయారుచేసిన బ్రెడ్ రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ను పెంచుతుంది. గ్లూకోజ్ లెవల్స్ తగ్గినప్పుడు మీలోని ఎనర్జీ లెవల్స్ కూడా తగ్గుతాయి . దాంతో మీరు బలహీనంగా ఫీలవుతారు. అందువల్ల త్రుణదాన్యాలతో తయారుచేసిన బ్రెండ్ ను తినకుండా నివారించడం వల్ల మీకు నిద్రబాగా పడుతుంది.

చెర్రీస్ :
చెర్రీస్ మీకు బాగా నిద్రపట్టేలా చేస్తాయి . ఎందుకంటే చెర్రీస్ లో మెలటోనిన్ అధికంగా ఉంటుంది . ఇది స్లీమ్ సైకిల్ ను కంట్రోల్ చేస్తుంది . మీరు కలత నిద్ర చెందుతున్నా కూడా చెర్రీస్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మంచి నిద్రపడుతుంది. చెర్రీస్ ను ఓట్స్ మరియు నట్స్ తో కలిపి తీసుకోవచ్చు.

హేర్బల్ టీ:
హేర్బల్ టీ వల్ల చాలా త్వరగా నిద్రపడుతుంది, ముఖ్యంగా ప్యాషన్ ఫ్లవర్ హాప్స్, చమోమెలీ మరియు లెమన్ బామ్ వంటి నిద్రను బాగా పట్టించే హేర్బల్ టీలు.

అరటిపండ్లు:
అరటి పండ్లు కూడా త్వరగా నిద్రపట్టేలా చేస్తాయి. అరటిపండ్లలో పొటాషియం మరియు మెగ్నీషియం అధికంగా ఉన్నాయి.ఇవి మీ నెర్వస్ సిస్టమ్ ను మరియు ట్రైప్టోన్ ను సెరోటినిన్ గా మార్పు చెందించి మరింత విశ్రాంతిని అందించి త్వరగా ఘాడంగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది.

లెట్యూస్ :
లెట్యుస్ పూర్తి ల్యాక్టోక్యారిమ్ కలిగి ఉండటం వల్ల ఇది నిద్రపట్టడానికి ప్రోత్సహిస్తుంది. 3-4లెట్యుస్ లీవ్స్ ను ఒక కప్పు నీటిలో వేసి బాగా మరిగించి , అందులో రెండు పుదీనా ఆకలు వేసి నిద్రించడానికి ముందు త్రాగాలి.

తున:
తున ఫిష్ లో విటమిన్ బి6 అధికంగా ఉన్నది. ఇది మీ శరీరంకు చాలా అవసరం అవుతుంది.ఇది శరీరంలో సెరోటనిన్ మరియు మెలటోనిన్ ను ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది . సరైన సమయంకు నిద్రపట్టేందుకు సహాయపడుతుంది.

రైస్:
జాస్మిన్ రైస్ శరీరంలో గ్లిజమిక్ ఇండెక్స్ పెంచడానికి సమాయపడుతుంది. ఇది త్వరగా నిద్రపట్టేలా చేస్తుంది. అందుకే రాత్రుల్లో జాస్మిన్ రైస్ తీసుకోమని సలహాలిస్తుంటారు .

వాల్ నట్స్:
వాల్ నట్స్ తినడం వల్ల మీరు త్వరగా నిద్రకు ఉపక్రమిస్తారు . వాల్ నట్స్ లో నేచురల్ మెలటోనిన్ కలిగి ఉంటుంది. కాబట్టి త్వరగా నిద్రపట్టేలా చేస్తాయి.

చీజ్:
పాలు కాకుండా ఇతర డైరీ ప్రొడక్ట్స్ చీజ్ మరియు పెరుగు వంటివి కూడా నిద్రపట్టేలా చేస్తాయి . డైరీ ప్రొడక్ట్స్ లో ఉండే క్యాల్సియం బ్రెయిక్ కు సంబందించి ట్రైప్టోఫోన్ మెలనిన్ ను ఉత్పత్తి చేసి, త్వరగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications