For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీలను డ్యామేజ్ చేసే టాప్ 15 కామన్ హ్యాబిట్స్ ...

|

సహజంగా మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అన్నది మన శరీరంలో పనిచేసే అవయవాల ద్వారనే తెలుస్తుంది. ఏ అవయవం సరిగా పనిచేయకపోయినా, జీవక్రియలకు అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి, మన శరీరం ఎల్ల వేళలా ఆరోగ్యంగా పనిచేసే విధంగా ఉంచుకోవాలి. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలి. ముఖ్యంగా మన శరీరంలో అత్యంత ప్రధాన పాత్ర పోషించే అవయవం కిడ్నీలు(మూత్రపిండాలి)శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిచే ప్రక్రియ కిడ్నీల ద్వారానే జరుగుతుంది.

కిడ్నీఆరోగ్యం కాపాడుకోవడానికి అత్యంత ముఖ్యమైన ఆహారాలు

చాలా మందికి కిడ్నీ వ్యాధులు సైలెంట్ కిల్లర్స్ అన్న విషయం తెలియదు. కిడ్నీ వ్యాధులున్నప్పుడు, పరిస్థితి చాలా తీవ్రతరం అయ్యేంతవరకూ వ్యాధి యొక్క ఎటువంటి లక్షణాలు బయటపడవు. మూత్రపిండాలు రక్తం శుద్ధి అనే కీలక విధులను నిర్వహించడానికి,శరీరంలో విషాన్ని మరియు ఇతర వ్యర్ధాలు తొలగించుకోవటానికి సహాయం చేస్తుంది. కిడ్నీలకు ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు మొత్తం శరీరంలో అవయవ వ్యవస్థ దెబ్బతింటుంది. కిడ్నీలు దెబ్బతినడానికి కొన్ని కామన్ హ్యాబిట్స్ కూడా కారణం అవుతాయి.అందులోనూ కిడ్నీ డ్యామేజింగ్ లక్షణాలను అంత త్వరగా కనపెట్టలేము. పూర్తిగా దెబ్బతిన్న తర్వాత లక్షణాలు బయటపడుతాయి.

మహిళ్లలో నిర్లక్ష్యం చేయకూడని కిడ్నీ స్టోన్ యొక్క లక్షణాలు

ముఖ్యంగా కిడ్నీలు రక్త వడపోతతో పాటు, హార్మోన్స్ ప్రొడక్షన్, పోషకాలను గ్రహించడం, యూరిన్ ఉత్పత్తికి మరియు హెల్తీ అసిడిక్ ఆల్కలైన్ బ్యాలెన్స్ కు కిడ్నీలు గ్రేట్ గా సహాయపడుతాయి. కిడ్నీలు లేకపోతే లైఫ్ ఉండదు. కాబట్టి కిడ్నీలు నిరంతరం ఆరోగ్యంగా ఉంచడం వల్ల హెల్తీ లైఫ్ మరియు క్వాలిటీ లైఫ్ ను ఎక్కువ కాలం పొందవచ్చు . మరి అలాంటి హెల్తీ లైఫ్ పొందడానికి కిడ్నీలను హెల్తీగా ఉంచుకోవడానికి కిడ్నీలకు డ్యామేజ్ కలిగించే కొన్ని కామన్ హ్యాబిట్స్ ను నివారించుకోవాలి.

కిడ్నీ డ్యామేజ్ కు కారణం ఏంటి? కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి రెగ్యులర్ లైఫ్ లో కొన్ని కామన్ హ్యాబిట్స్ మీరు తెలుసుకోవడం కోసం...

 షుగరీ షోడా హ్యాబిట్:

షుగరీ షోడా హ్యాబిట్:

సోడా హ్యాబిట్. కిడ్నీలు పాడవ్వటానికి ఒక ముఖ్య కారణం సోడా హ్యాబి . ఒక రోజుకు ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ సోడాలను త్రాగేవారిలో కిడ్నీ డ్యామేజ్ లక్షణాలు హైరిస్క్ లో ఉంటాయి. కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు యూరిన్ లో ప్రోటీన్ అధికంగా పోవటం జరుతుంది. యూరిన్ లో ప్రోటీన్ పోతుంటే కిడ్నీ డ్యామేజ్ కు ప్రధాణ, ప్రారంభ సంకేతంగా గుర్తించాలి,. ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణానికి ఎలాంటి హాని ఉండదు.

విటమిన్ బి6 లోపం:

విటమిన్ బి6 లోపం:

కిడ్నీలు పాడవటానికి ఇది కూడా ఒక కారణమే . కిడ్నీలు బాగా ఆరోగ్యంగా పనిచేయాలంటే హెల్తీ డైట్ తీసుకోవడం చాలా ముఖ్యం. రీసెంట్ గా జరిపిన పరిశోధన ద్వారా విటమిన్ బి6 లోపం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతాయని కనుగొన్నారు . కాబట్టి కిడ్నీ ఆరోగ్యం కోసం ప్రతి రోజూ 1.3మిల్లీ గ్రాములు విటమిన్ బి6ను రెగ్యులర్ గా తీసుకోవాలి. అందుకోసం రెగ్యులర్ డైట్ లో ఫిష్, శెనగలు, బీఫ్ లివర్, పొటాటోలు, మరియు స్ట్రార్చీ వెజిటేబుల్స్ మరియు నాన్ సిట్రస్ ఫ్రూట్స్ ను చేర్చుకోవాలి.

వ్యాయామలేమి:

వ్యాయామలేమి:

కిడ్నీలకు రక్షణ కల్పించేది వ్యాయామం . వ్యాయామం చేసే వారిలో 31శాతం కిడ్నీ స్టోన్స ఏర్పడవని పరిశోధనలు వెల్లడిస్తున్నారు . హెల్తీ వెయిట్ ను మెయింటైన్ చేయడం ద్వారా, కిడ్నీ స్టోన్స్ ఏర్పడటాన్ని తగ్గించుకోవచ్చు . వర్కౌట్స్ చేయడం వల్ల ఈ అలవాటు లేకపోవడం వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ కు కారణం అవుతుంది.

మెగ్నీషియం లోపం:

మెగ్నీషియం లోపం:

కిడ్నీ సమస్యలకు కారణం ఏంటి? మెగ్నీషియం లోపం వల్ల కూడా కిడ్నీ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో తగినంత మెగ్నీషియం, క్యాల్షియం అందకపోయినా, శరీరంలో షోషణ కాకపోయాని . ఇది శరీరంలో క్యాల్షియం ఓవర్ లోడ్ అవ్వడంతో కిడ్నీ స్టోన్స్ గా రూపాంతరం చెందుతాయి. ఈ సమస్యను నివారించుకోవాలంటే రెగ్యులర్ డైట్ లో తగినంత మెగ్నీషియం ఉండేట్లు చూసుకోవాలి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ , బీన్స్, వివిధ రకాల ధాన్యాలు, నట్స్ మరియు అవొకాడో చేర్చుకోవాలి.

నిద్రలేమి:

నిద్రలేమి:

నిద్రలేమి కూడా ఒక రకంగా కిడ్నీ స్టోన్స్ కు కారణం అవుతుంది. ప్రతి రోజూ సరిపడా నిద్రపోవడం వల్ల కిడ్నీ సమస్యలను నివారించుకోవచ్చు. క్రోనిక్ స్లీప్ డిస్ట్రప్షన్ కూడా కిడ్నీ వ్యాధులకు దారితీస్తుంది. రాత్రి సమయంలో కిడ్నీ టిష్యులు తిరిగి పునరుత్పత్తికి సహాయపడుతాయి. కాబట్టి,అలాంటి సమయంలో సరిగా నిద్రపోకపోతే, కిడ్నీలకు మరింత డ్యామేజ్ కలుగుతుంది . కాబట్టి, ఖచ్చితంగా ప్రతి రోజూ 7 గంటల నిద్ర తప్పనిసరి.

సరిపడా నీరు త్రాగకపోవడం:

సరిపడా నీరు త్రాగకపోవడం:

కిడ్రీలు చురుకుగా పనిచేయాలంటే నీరు సరిపడా త్రాగాలి . మీరు కనకు తగినంత నీరు, ద్రవాలు, త్రాగకపోతే వ్యర్థాలు రక్తంలో చేరుతాయి. ప్రతి రోజూ 12 గ్లాసుల నీరు తప్పనిసరిగా త్రాగాలి. కిడ్నీ ఆరోగ్యానికి చురుకుగా పనిచేయడానికి నీరు ఎక్కువగా హెల్ప్ అవుతాయి . ఎక్కువ నీరు త్రాగడం వల్ల మూత్రం యొక్క రంగులో కూడా ఎలాంటి మార్పులుండవు .

త్వరత్వరగా బ్లాడర్ కాలీ చేయకపోవడం:

త్వరత్వరగా బ్లాడర్ కాలీ చేయకపోవడం:

యూరిన్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెంటనే వెళ్ళకుండా అలాగే ఉండిపోవడం వల్ల మూత్రాశయంలోకి చేరిన మూత్రం తిరిగి బ్లాడర్లోకి చేరితుంది . ఇది ఆరోగ్యానికి మంచిది కాదు . ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే . కిడ్నీల మీద యూరిన్ ప్రెజర్ ను పెంచుతుంది. దాంతో కిడ్నీ ఫెయిల్యూర్ కు దారితీస్తుంది.

ఉప్పు ఎక్కువగా తినడం :

ఉప్పు ఎక్కువగా తినడం :

కిడ్నీ ఫెయిల్యూర్ కు మరో కారణం, అలవాటు కూడా ఇదే. చాలా మందికి ఉప్పు ఎక్కువగా తినే అలవాటు . ఉప్పు శరీరానికి అవసరమే కానీ, మోతాదుకు మించి తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ ను పెంచుతుంది మరియు కిడ్నీల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. 5.8గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు.

కెఫిన్ అధికంగా తీసుకోవడం:

కెఫిన్ అధికంగా తీసుకోవడం:

మనకు అవసరం అయినదానికి కంటే ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం. చాలా రకాల సాఫ్ట్ డ్రింక్స్ మరియు సోడా, ఎనర్జీ డ్రింక్స్ మరియు కాఫీలో కెఫిన్ అధికంగా ఉంటుంది. ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. దాంతో కిడ్నీలు రిస్క్ లో పడుతాయి . కాబట్టి కెఫిన్ తీసుకోవడం తగ్గించాలి.

పెయిన్ కిల్లర్స్:

పెయిన్ కిల్లర్స్:

కొన్ని సందర్భాల్లో తరచూ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటుంటారు . అందులోనూ పెద్దడోస్ .నొప్పులొచ్చినప్పుడు పిల్స్ మింగడ్ సులభం కావచ్చు. కానీ, దీర్ఘకాలంలో ఫార్మాసూటికల్ డ్రగ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటాయి. ఈ కారణాల వల్ల కూడా కిడ్నీలు డ్యామేజ్ అవ్వొచ్చు.

మెడికేషన్స్:

మెడికేషన్స్:

లైఫ్ స్టైల్ మరియు అన్ హెల్తీ హ్యాబిట్స్ వల్ల హైబ్లడ్ ప్రెజర్ మరియు డయాబెటిస్ కామన్ డిసీజ్ గా మారింది . ఇప్పటికే మీరు వీటితో బాధపడుతున్నట్లైతే, అవి నిధానంగా కిడ్నీలను పాడుచేస్తాయి. మెడిసిన్స్ తీసుకుంటుంటే కనుక డ్యామేజ్ ను నివారించుకోవచ్చు. ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఈ ముఖ్యమైన ఆర్గాన్స్ ను కాపాడుకోవచ్చు.

ప్రోటీన్లు అధికంగా తీసుకోవడం:

ప్రోటీన్లు అధికంగా తీసుకోవడం:

పరిశోధనల ప్రకారం రెగ్యులర్ డైట్ లో ప్రోటీనులను అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీలకు హాని జరుగుతుంది. ప్రోటీన్ డైజెషన్ అమ్మోనియా కావడంతో ఇది ఒక టాక్సిన్ కాబట్టి కిడ్నీస్ ను న్యూట్రీలైజ్ చేయడానికి సహాయపడుతుంది. ప్రోటీన్ ఎక్కువ కాబట్టి కిడ్నీ పనితీరు మీద ఎక్కువ ఎఫోర్ట్ పడుతుంది . ఇది కిడ్నీల యొక్క పనితీరును తగ్గిస్తుంది.

కామన్ ఇన్ఫెక్షన్స్ ను త్వరగా మరియు ప్రొపర్ గా ట్రీట్ చేయించుకోకపోవడం:

కామన్ ఇన్ఫెక్షన్స్ ను త్వరగా మరియు ప్రొపర్ గా ట్రీట్ చేయించుకోకపోవడం:

కొన్ని సందర్భాల్లో చాలా సాధరణంగా వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వాటికి త్వరగా ట్రీట్మెంట్ తీసుకోరు . అలాగే శరీరంలో అవయవాలు పనిచేయడానికి ఒత్తిడి తీసుకొస్తారు. సరిగా రెస్ట్ తీసుకోరు . ఫలితంగా కిడ్నీ డ్యామేజ్ కు కారణం అవుతుంది . సరిగా విశ్రాంతి తీసుకోని సరిగా ఆరోగ్యం గురించి కేర్ తీసుకోని వారిలో ఇలాంటి లక్షణాలు కనబడుతుంటాయి.

ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం:

ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం:

ఆల్కహాల్లోని కొన్ని హానికరమైన టాక్సిన్ కిడ్నీ డ్యామేజ్ కు కారణం అవుతాయి . ఆల్కహాల్ కిడ్నీల యొక్క పనిని పెంచుతాయి . తర్వాత నిధానంగా కిడ్నీలు పాడవ్వటం ప్రారంభం అవుతాయి . కాబట్టి కిడ్నీ వ్యాధులను నివారించుకోవడానికి ఆల్కహాల్ మానేయాలి లేదా మితంగా తీసుకోవాలి.

స్మోకింగ్:

స్మోకింగ్:

స్మోకింగ్ ఆర్థోస్కోలరోసిస్ కు సంబంధం కలిగి ఉంటుంది . బ్లడ్ వెసల్స్ బ్లాక్ అవ్వడానికి ప్రధానకారణం స్మోకింగ్ . అన్ని ఆర్గాన్స్ కు బ్లడ్ సప్లైను తగ్గిస్తుంది . కాబట్టి రోజుకు రెండు సిగరెట్లుకు మించి తాగే వారిలో కిడ్నీ సమస్యలు పొంచి ఉంటాయి .

English summary

TOP 15 Common Habits That Can Damage Your Kidneys

You can live quite a normal life with only 20 percent of your kidney function. That is why a steady decline and gradual damage to your kidneys can often go unnoticed for a long time. Sometimes, even common habits can cause damage to your kidneys and when the problems are finally discovered, it can be too late.
Story first published: Monday, December 21, 2015, 18:27 [IST]
Desktop Bottom Promotion