Latest Updates
-
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు
నిద్రలేమి సమస్యను నివారించే హెల్తీ బెడ్ టైమ్ డ్రింక్స్
రాత్రుల్లో నిద్రించడానికి సమస్యగా ఉందా? అలాంటి వారికోసం నిద్రలేమి సమస్యకు పరిష్కారం ఉంది.
నిద్రలేమి సమస్యను నయం చేసుకోవడానికి వివిధ రకాల మందులు , వంటింటి చిట్కాలు, ఆయుర్వేద ట్రీట్మెంట్స్ మరియు ట్రిక్స్ తో ఇప్పటికి విసిగెత్తిపోయారా? అయితే ఇవన్నీ కాకుండా కొన్ని బెవరేజెస్ (పానీయాలను )మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ పానియాలు మీరు రాత్రుల్లో త్రాగడం వల్ల గాఢంగా మరియు పీస్ ఫుల్ గా నిద్రించేలా చేస్తాయి.
READ MORE: నిద్రకు ఉపక్రమింపచేసే 13 ఆశ్చర్యకరమైన ఆహారాలు
రీసెంట్ గా జరిగిన ఒక పరిశోధన ప్రకారం రాత్రి సమయాల్లో 8 రకాల పానీయాలు నిద్ర బాగా పట్టేందుకు ఉపయోగపడుతాయని కనుగొన్నారు . ఈ ఎఫెక్టివ్ డ్రింక్స్ మీరు గాఢంగా నిద్రపోయేలా చేయడం మాత్రమే కాదు, మరుసటి రోజు మీరు మరింత ఉత్సహాం, ఆరోగ్యంగా..అందంగా కనబడేలా చేస్తాయి. వార్మ్ టీ, హెర్బల్ టీ , చాక్లెట్ టీ మరియు మరికొన్ని పానీయాల లిస్ట్ ను మీకోసం..మీరు ప్రయత్నించడం కోసం ఉన్నాయి. వీటిని ప్రయత్నించి మంచి నిద్రను పొందండి .
READ MORE: ఇటు అనారోగ్యాన్ని... అటు నిద్రాభంగిమను కలిగించే 10 ఆహారాలు..
బాగా నిద్రపట్టాలంటే కాఫీకి దూరంగా ఉండాలి. ఇది మిమ్మల్ని మేల్కొనేలా చేస్తుంది. మరియు రాత్రుల్లో తీసుకొనే పానియాల్లో షుగర్ చేర్చకుండా తీసుకోవడం వల్ల మరింత యాక్టివ్ గా పనిచేస్తాయి. మంచిగా నిద్రపట్టేలా చేస్తాయి. మరి 8 బెస్ట్ బెడ్ టైమ్ బెవరేజెస్ ఏంటో ఒక సారి ఈ క్రింది లిస్ట్ ద్వారా తెలుసుకుందాం. మంచి నిద్రతో మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం...

హాట్ చాక్లెట్:
పాలలో హాట్ చాక్లెట్ సిరఫ్ ను మిక్స్ చేసి త్రాగడం వల్ల పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది మరియు నరాలను విశ్రాంతి పరుస్తుంది.

మింట్ టీ:
కొద్దిగా నిమ్మరంస మిక్స్ చేసి పుదీనా టీని త్రాగడం వల్ల చిన్న పిల్లలు నిద్రపోయినంత గాఢంగా మీరు నిద్రపోతారు . మీరు నిద్రించడానికి ఒక గంట ముందు ఈ టీని ప్రయత్నించండి.

చామంతి టీ:
చమోమెలీ టి స్మూతింగ్ బెవరేజ్. రాత్రి పడుకొనే ముందు ఒక గంట ముందుగా త్రాగాలి . ఈ టీ త్రాగడం వల్ల నరాలను విశ్రాంతి పరుస్తుంది మరియు ఒత్తిడి తగ్గిస్తుంది.

కోక:
చాలా మంది ఎక్కువగా ఇష్టపడే మరో బెవరేజ్ హాట్ కోక. నిద్రలేమితో బాధపడే వారు వేడిగా ఉండే కోక త్రాగితో స్మూత్ గా నిద్రపట్టేస్తుంది . దీన్ని మీ డైలీ హ్యాబిట్ గా మార్చుకోవాలి.

గోరువెచ్చని పాలు:
నిద్రలేమితో బాధపడుతున్నట్లైతే మీరు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక స్పూన్ హనీ మిక్స్ చేసి నిద్రించడానికి ఒక గంట ముందు త్రాగితే మంచి నిద్రపడుతుంది .

బాదం మిల్క్:
బాదం మిల్క్ లో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల, బాదం పౌడర్ ను గోరువెచ్చని పాలలో మిక్స్ చేసి రాత్రి నిద్రించడానికి ముందు త్రాగాలి.

హానీ మిల్క్:
ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసి త్రాగడం వల్ల వెంటనే నిద్ర పట్టేస్తుంది.

అల్లం టీ:
వేడి వేడి జింజర్ టీ త్రాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది . పొట్ట లైనింగ్ కూల్ గా ఉంటుంది. గుడ్ నైట్ రెస్ట్ పొందుతారు.



Click it and Unblock the Notifications
