Latest Updates
-
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే!
అసంపూర్ణ నిద్రతో బాధపడేవారు ఈ వ్యాధులకు గురికావచ్చు...!
నిద్ర మనకు ఒక వరం వంటింది. ఎందుకంటే మన శరీరం రోజంతా అలసిపోయినప్పుడు అవయావాలకు తగిన విశ్రాంతి అవసరం అవుతుంది. ఆ విశ్రాంతిని అందివ్వగలిగినప్పుడే మరుసటి రోజ యాక్టివ్ గా పనులు చేసుకోగలుగుతారు. అంతే కాదు, నిద్రించే సమయంలో మన శరీరంలోని అవయవాలన్ని శుభ్రపరుడుతాయి. వ్యర్థాలన్నింటిని శుభ్రపరచుకోగలిగినప్పుడు పగటి పూట అవి మరింత చురుకుగా పనిచేయగలుగుతాయి . అంతే కాదు రాత్రికి రాత్రే మన చర్మం కూడా రిపేర్ అవుతుంది.
మనం ఆరోగ్యంగా మరియు అందంగా, సంతోషంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం . నిద్రలేమ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అయినా కూడా మనం నిర్లక్ష్యం చేస్తూనే ఉంటాము . ఎవరైతే ఎక్కువగా నైట్ ఫిష్ట్ ల్లో పనిచేస్తుంటారో అలాంటి వారి నిద్రను చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు . ఈ నిద్రలేమి చిన్నదే కావచ్చు. కానీ దాని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. మొదట మనం చూసేది చర్మంలో, తర్వాత చర్మం డల్ గా మరియు డార్క్ గా మారుతుంది . ఇంకా కళ్ల క్రింది డార్క్ సర్కిల్స్ ఏర్పడుతాయి.
మానసిక స్థితి కూడా తగ్గుతుంది. నిద్రలేమి వల్ల చాలా వరకూ శారీరక దుష్ప్రభావాలు కలిగిస్తుంది. బాడీపెయిన్, అలసట, బరువుపెరుగుట, ఒత్తిడి, మరియు మరిన్ని దుష్ప్రభావాలను కలిగిస్తుంది. నిద్రలేమి శారీరకంగా ఒత్తిడికి గురి చేస్తుంది . దాంతో శరీరంలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది . ఈ హార్మోన్ పెరుగడం వల్ల బరువు పెరగడం, దాంతో యాక్సైటీ లెవల్స్ కూడా పెరగుతాయి. అందువల్ల నిద్రతక్కువగా ఉండటం లేదా నిద్రలేమి అనేక అనారోగ్య సమస్యలకు గురిచేస్తుంది .
కాబట్టి, ప్రతి రోజూ తప్పనిసరిగా 8 గంటల నిద్ర ప్రతి ఒక్కరికీ అవసరం. నిద్రపొందడానికి తగిన చిట్కాలు, సూచనలు, మార్గాలను, హోం రెమెడీస్ ను ఉపయోగించి సరిపడా నిద్రపోవాలి. నిద్రలేమి వల్ల ఈ క్రింది లిస్ట్ లోని వ్యాధుల కూడా గురికావచ్చు....

1. డయాబెటిస్:
నిద్రలేమిన వల్ల స్వీట్స్ మరియు జంక్ ఫుడ్స్ తినాలనే కోరిక పెరుగుతుంది. నిద్రలేమి వల్ల అసౌకర్యంగా మరియు అలసటగా అనిపిస్తుంది. మనుషులు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మరియు జంక్ ఫుడ్స్ తినడం వల్ల వారిలో హై బ్ల షుగర్ లెవల్స్ కు కారణం అవుతుంది . దాంతో డయాబెటిస్ కు గురికావల్సి వస్తుంది. నిద్రలేమి వల్ల శరీరానికి జరిగే అనర్థాలలో ఇది ఒక మేజర్ ఎఫెక్ట్.

2. ఓస్టిరియో పోసిస్(వీక్ బోన్స్):
ప్రతి రోజూ 6గంటల కంటే తక్కువగా నిద్రపోవడం వల్ల బోన్ డెన్సిటిని తగ్గిస్తుంది. దాంతో ఎముకలు వీక్ గా మారుతాయి మరియు పెలుసుగా మారుతాయి . ఎముకల్లో మినిరల్ కాంపోజిషన్ కూడా తగ్గుతుంది. దాంతో జాయింట్ పెయిన్ కు దారితీస్తుంది. ఇంకా బోన్ ఫ్రాక్చర్ అవుతుంది.

3. క్యాన్సర్:
ప్రతి రోజూ సరిపడా నిద్రపోకపోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ తో పాటు ఇతర క్యాన్సర్లకు కూడా గురికావల్సి వస్తుంది. శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ సెల్స్ ను డ్యామేజ్ చేైస్తుంది. దాంతో క్యాన్సర్ సెల్స్ శరీరం నుండి సరిగా తొలగిపోక నిద్రలేమికి దారితీస్తుంది . ఇంకా శరీరంలో టాక్సిన్స్ కూడా పెరుగుతాయి. ఇది సీరియస్ డిసీజ్ గా మారుతుంది.

4.హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్:
నిద్రసమయంలో, మన శరీరంలో అవయవాలు మరమ్మత్తు గావింపబడుతాయి. మరియు అవయవాలలోని టాక్సిన్స్ ను తొలగించబడుతుంది. ఈ కారణం చేతనే ప్రతి రోజూ ఉదయం సరిపడా నీరు త్రాగాలి. దాంతో శరీరంలో పనిచేయని వ్యర్థాలను శరీరం నుండి తొలగించుకోవచ్చు. అందువల్ల నిద్రలేమితో బాధపడే వారు హైబ్లడ్ ప్రెజర్, హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ రిస్క్ ను కలిగి ఉంటారు.

5. మెమరీ లాస్:
తక్కువగా నిద్రపోవడం వల్ల బ్రెయిన్ కూడా గమనిస్తుంది . మంచి నిద్రలో ఉన్నప్పుడే బ్రెయిన్ రిఫ్రెష్ మరియు రిజనరేట్ అవుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ కు తక్కువ నిద్రసంకేతాలు పోతాయో అప్పడు బ్రెయిన్ కూడా చాలా సులభంగా అలసటకు గురి అవుతుంది. దాంతో జ్ఝాపకశక్తి బలహీనపడుతుంది. తర్వాత పూర్తిగా మెమరీ లాస్ కు గురికావల్సి వస్తుంది.

6. యూరినరీ ఇన్ కాంటినెన్స్:
ఈ వ్యాధి లక్షణాలున్నవారు , బాత్రూమ్ కు అర్జెంట్ గా వెళ్ళాలనిపిస్తుంది కానీ వెళ్లలేకపోతారు లేదా తక్కువగా యూరిన్ పాస్ చేస్తారు. దాంతో మళ్లీ త్వరగా అర్జెంట్ గా వెళ్లాలనిపిస్తుంది . ఈ కండీషన్ కూడా నిద్రలేమికి సంకేతంగా చెప్పవచ్చు.

7. ఆందోళన మరియు డిప్రెషన్:
నిద్రలేమి వల్ల ఒత్తిడి మరియు డిప్రెషన్ పెరుగుతుంది. నిద్ర తక్కువైతే కార్టిసోల్ అనే హార్మోను ఉత్ప్తి అవుతుంది. ఈ హార్మో మైండ్ ను స్ట్రెస్ కు గురిచేస్తుంది. ఇది మరింత డిప్రెషన్ కు గురిచేస్తుంది.

8. బరువు పెరుగటకు కారణం అవుతుంది:
తక్కువ నిద్ర వల్ల నిద్రపట్టని సమయంలో ఎక్కువగా అనారోగ్యకరమైన ఆహారాలు, పిజ్జా, బర్గర్, సాప్ట్ డ్రింక్, స్వీట్స్ మరియు జంక్ ఫుడ్స్ మీద ఎక్కువ కోరికలు కలుగుతాయి. తరచూ వీటిని తినడం వల్ల చివరికి బరువు పెరుగుతారు . శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా పెరుగుతాయి . దాంతో శరీరంలో ఇతర వ్యాధుల భారీన పడాల్సి వస్తుంది.



Click it and Unblock the Notifications











