Latest Updates
-
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.!
50 ఏళ్లు దాటిన పురుషులు తీసుకోవాల్సిన పౌష్టికాహారం
హాఫ్ సెంచరీ కొట్టేశారా ? అదేనండీ మీ వయసు 5 పదులు దాటిందా ? అయితే.. ఆరోగ్యం, ఆహారం విషయంలో శ్రద్ధ వహించాల్సిందే. ఇప్పటిదాకా.. ఏం తిన్నా.. ఎలా తిన్నా.. ఇకపై మాత్రం మీ వయసుకు తగ్గట్టు.. శరీరానికి ప్రయోజనాలు చేకూర్చే ఫుడ్ తీసుకుంటే.. మంచిది.
50 ఏళ్లలో అడుగుపెట్టారంటే.. ఆరో్గ్యంపై జాగ్రత్త వహించాలి. తీసుకునే ఆహారంలో పోషక విలువలు, విటమిన్స్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని రోజువారీ డైట్ లో చేర్చుకుంటే.. మరో 50 ఏళ్లు ఆయురారోగ్యాలతో బతికేయచ్చు.

తాజా పండ్లు
న్యూట్రీషియస్ ఫుడ్ అంటే అందరూ ముందుగా సూచించేది పండ్లు. తాజా పండ్లలో శరీరానికి కావలసిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో పండ్లు తప్పనిసరిగా తీసుకోవడం మంచిది. సీజన్‌వారీగా అందుబాటులో ఉండే పండ్లు తీసుకుంటూ ఉండాలి.

చేపలు
హాఫ్ సెంచరీ దాటిన పురుషులు.. ఆరోగ్య సూత్రాలు తప్పనిసరిగా పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. అందులో భాగంగా.. వీళ్లు చేపలని వారానికి రెండుసార్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. సాల్మన్, ట్యూనా, హలిబుట్ వంటి చేపలతోపాటు సీ ఫుడ్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి.

ఫ్రూట్ జ్యూస్
పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొన్ని రకాల పండ్లలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి పండ్ల రసాలు తీసుకునేటప్పుడు వాటికి పంచదార ఉపయోగించకపోవడం మంచిది. ఎందుకంటే లేటు వయసులో మధుమేహం బారిన పడే అవకాశాలు ఎక్కువుంటాయి. ఫ్రూట్ జ్యూస్ లు తరచుగా తీసుకోవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

క్యాల్షియం, విటమిన్ డి
ఐదు పదుల వయసులో శరీరానికి క్యాల్షియం, విటమిన్ డి చాలా అవసరం. కాబట్టి ఈ రెండు శరీరానికి అందేలా చూసుకోవాలి. క్యాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉండే బ్రొకోలి, ఆకుకూరలు, కొవ్వు శాతం తక్కువగా ఉండే పాలు, పెరుగు తీసుకోవాలి.

ఉప్పు
లేటు వయసులో బీపీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఉప్పు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. బీపీ పెరిగితే.. గుండె నొప్పి, కిడ్నీ సంబంధిత వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. బ్రౌన్ రైస్ ఈ వయసులో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చుతాయి.

కూరగాయలు
తాజా కూరగాయలు తీసుకోవాలి. ఫ్రిజ్ లో ఉంచిన ఆహారం తీసుకోకుండా ఉండటం మంచిది. ఎప్పటికప్పుడు తాజా ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల.. శరీరానికి ఫైబర్ అందుతుంది.



Click it and Unblock the Notifications
