Latest Updates
-
పిండి రుబ్బే పనిలేదు..అప్పటికప్పుడు ఐరన్, కాల్షియం నిండిన దూదిలాంటి మెత్తని రాగి ఇడ్లీ ..కొబ్బరి చట్నీతో కేక! -
పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం..మీ ఫ్రెండ్స్, బంధువులకు బెస్ట్ ఉగాది విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇలా.. -
Ugadi Pachadi Recipe: కేవలం పచ్చడి కాదు, దివ్యౌషధం..పక్కా కొలతలతో సంప్రదాయ ఉగాది పచ్చడి..ఎలా చేసుకోవాలంటే.. -
ఉగాది పచ్చడి ఎందుకు తినాలి? ఎన్ని రోజులు తినాలి? ఈ రహస్యం మీకు తెలుసా? -
ఉగాది సంప్రదాయ వంటకాలు: జస్ట్ 20 నిమిషాల్లో సజ్జ బూరెలు, కొబ్బరి బూరెలు..ఎలా చేసుకోవాలంటే. -
రాగి పూరీ-ఉల్లిపాయ మసాలా..లెక్కలేకుండా తినేయడం గ్యారెంటీ! -
అన్నం, పప్పు,పరాఠా, రోటీల్లోకి బెస్ట్ కాంబినేషన్..రాజస్థానీ స్పెషల్ వెల్లుల్లి ఎర్ర మిరప చట్నీ -
ఉగాది స్పెషల్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రంచీ బేబీ కార్న్ 65..వాహ్ అనిపించే బెస్ట్ స్టార్టర్! -
గుంటూరు కారం పొడి, చిట్టి ఇడ్లీ..ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే! -
నో గ్యాస్, నో స్టవ్.. నిమిషాల్లో తయారయ్యే కమ్మని పల్లెటూరి రోటి పెరుగు పచ్చడి..ప్లేట్ అన్నం ఖాళీ అవ్వాల్సిందే!
రాత్రి సమయంలో తరచూ మూత్ర విసర్జనకి గల 8 ముఖ్య కారణాలు
రాత్రి పడుకున్నాకా మూత్ర విసర్జనకై లేవడం అనేది చాలా ఇబ్బంది కరమైనది.ఇది నిద్రని భంగపరచడమే కాకుండా,ఈ అలవాటు మనలో దాగిఉన్న కొన్ని రకాల వ్యాధులకి కూడా సంకేతం.రాత్రిళ్ళు మూత్రవిసర్జనకి లేవడం అనేది డయాబేటిస్ కి సంకేతం అని మనలో చాలా మందికి తెలుసు.కానీ డయాబెటీసే కాకుండా ఇంకా ఇతర వ్యాధులు కూడా కారణం అవ్వచ్చు. వీటిల్లో కొన్ని వ్యాధులు కాకుండా మన జీవన విధానం వల్ల శరీరం లో వచ్చే మార్పులయ్యుండొచ్చు.
మెలకువగా ఉన్నప్పుడూ మనము సాధారణంగా రోజులో 5-8 సార్లు మూత్ర విసర్జన చేస్తాము. 5 నుండి 8 సార్లు కాకుండా కాస్త ఎక్కువ తక్కువ సార్లు చెయ్యడం కూడా సాధారణం.ఒక సగటు మనిషి రోజులో 1 లేదా 2 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు కానీ ఈ విసర్జన 3 లీటర్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే దానిని అధిక విసర్జన కింద జమకట్టాలి. కానీ ఎక్కువ ద్రవ పదార్ధాలు తీసుకునే వారు మూత్రాన్ని ఎక్కువ మోతాదులో విసర్జిస్తారు .
READ MORE: మూత్ర సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే హోం రెమెడీస్
కానీ మనం నిద్రలో ఉన్నప్పుడు కిడ్నీలు మూత్రాన్ని తక్కువగా విసర్జిస్తాయి. ఆందువల్ల మూత్రాశయం మెల్లిగా నిండి మన నిద్ర ని భంగపరచదు. ఎప్పుడైనా నిద్ర మధ్యలో మూత్ర విసర్జనకై లేవడం ఆందోళనకరం కాదు. రాత్రిళ్ళు మూత్ర విసర్జన అలవాటుని “నాక్టూరియ” అంటారు. ఒకవేళ ఈ నాక్టూరియా ప్రతీరోజూ ఒక అలవాటుగా పరిణమించినట్లయితే కనుక కారణాన్ని అన్వేషించవలసి వస్తుంది

డయాబెటిస్ మెలిటస్:
డయాబేటిస్ అని ప్రపంచవ్యాప్తంగా వ్యహవరించే ఈ వ్యాధి ప్రబలంగా వ్యాపించి ఉంది. దీనికి కారణం మన శరీరం లో ఇన్సులిన్ అతితక్కువ ఉత్పత్తి కావడం లేదా ఇన్సులిన్ కి స్పందించకపోవడం. అందువల్ల రక్తంలో గ్లూకోజ్ నిల్వలు సాధారణ స్తాయిలో మెయింటెయిన్ చెయ్యడం కష్టం. డయాబెటీస్ యొక్క సాధారణ లక్షణాలు, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన మరియు అతి దాహం.రాత్రిళ్ళు నిద్ర నుండి మూత్ర విసర్జనకి మేల్కోవడం కూడా సాధారణమే ఈ వ్యాధి ఉన్న వారిలో. మన జీవన విధానం, ఆహారపు అలవాట్లలో చేసుకునే మార్పుల వల్ల లేదా మందులవల్ల రక్తంలోని గ్లూకోజ్ నిల్వలని సాధారణ స్థాయికి తిరిగి తీసుకురావచ్చు.

ప్రొస్టేట్ గ్రంధి పెరుగుదల :
60 యేళ్ళు దాటాకా మగవారు బినైన్ ప్రొస్టేటిక్ హైపర్ట్రొఫీ(బీపీహెచ్) అనబడే పరిస్థితిని ఎదుర్కోవడం సర్వసాధారణం.ప్రొస్టేటు గ్రంధి విస్తరించడం వల్ల ఇది కలుగుతుంది కానీ ఇది కేన్సర్ లాంటి ప్రాణాంతక మైన పెరుగుదల కాదు.బీపీహెచ్ వల్ల ప్రొస్టేట్ గ్రంధి విస్తరించి మూత్రాశయం మీద నొక్కబడటం వల్ల తరచుగా మూత్ర విసర్జన చెయ్యాల్సి రావచ్చు.కానీ మూత్ర విసర్జన సమయం లో మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవ్వదు.అందువల్ల బీపీహెచ్ ఉన్నప్పుడు లేద ఇతర ప్రొస్టేటు గ్రంధి సంబంధించిన లక్షణమైన “ప్రొస్టాటిస్” ఉన్నప్పుడు కానీ రాత్రిళ్ళు ఎక్కువగా మూత్ర విసర్జించడమనే లక్షణం కనిపిస్తూ ఉంటుంది.ఒక్కోసారి దీనికి వ్యతిరేక లక్షణం కనిపించవచ్చు,ప్రొస్టేట్ గ్రంధి విస్తరించి మూత్ర నాళాన్ని అడ్డగించడం వల్ల అసలు మూత్ర విసర్జనే చెయ్యలేకపోవచ్చు.

డై యూరేటిక్ మందులు:
డైయూరెటిక్ ఔషఢాలు మూత్రాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి.మూత్రాన్ని ఎక్కువ విసర్జించడంవల్ల శరీరంలోని ద్రవ పదార్ధాల నిల్వలు తగ్గవచ్చు.డైయూరెటిక్స్ మందులని అధిక రక్తపోటు(హైపర్ టెన్షన్) లేదా హ్రుదయసంబంధిత వ్యాధులలో విస్తారం గా వాడతారు. డైయూరెటిక్ మందులవల్ల మూత్రం ఎక్కువ ఉత్పత్తి అయ్యి రాత్రుళ్ళు నిద్రా భంగం కలిగించవచ్చు.కానీ ఈ మందులవల్ల వచ్చే లాభాలతో ఈ మందులవల్ల జరిగే హాని ని బేరీజు వేసుకోవాలి. ఋఆత్రి పూట మూత్ర విసర్జనకై లేవడం నిద్రాభంగాన్ని కలిగిస్తోంటే డైయూరేటిక్ మందుల మోతాదుని మార్చాలే కానీ డాక్టర్ ఆమోదించకుండా ఈ మందులని ఆపెయ్యకూడదు.

ద్రవ పదార్ధాలని ఎక్కువ తీసుకోవడం:
ద్రవ పదార్ధాలని ఎక్కువ తీసుకుంటే ఎక్కువ సార్ర్లు మూత్ర విసర్జన చెయ్యడం సాధారణమే.కెఫీన్ ఉన్న పదార్ధాలు తీసుకోవడం వల్ల అవి డై యూరేటిక్ మందుల ప్రభావాని చూపించవచ్చు.అందువల్ల పగలూ రాత్రి ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చెయ్యల్సి రావచ్చు.ఒక్కోసారి కొన్ని వ్యాధులు లేదా మందులవల్ల అతి దాహం కలిగి ద్రవ పదార్ధాలని ఎక్కువ తీసుకోవాల్సిరావచ్చు. ఋఆత్రి పడుకునే ముందు ఒకట్రెండు గ్లాసుల నీళ్ళు ఎక్కువ తాగటం కూడా “నాక్టారియ”(రాత్రిపూట మూత్ర విసర్జన)కి కారణం కావచ్చు.అందువల్ల పడుకోవటానికి కనీసం 2 గంటలముందు నుండీ ద్రవ పదార్ధాలని తీసుకోవడం తగ్గిస్తే నిద్ర మధ్యలో మూత్ర విసర్జనకి లేవడాన్ని అరికట్టవచ్చు.రాత్రిళ్ళు మూత్రం తక్కువ ఉత్పత్తి అవుతుంది అందువల్ల మీ శరీరానికి పగటి పూట కంటే సాయంత్రం తక్కువ ద్రవపదార్ధాలు కావాలి.

యూరినరీ ట్రాక్ ఇంఫెక్షన్:
యూటీ ఐ గా పిలవబడే మూత్ర ద్వార ఇంఫెక్షన్లు మహిళల్లో సర్వసాధారణం.చాలా సందర్భాలలో మూత్రనాళం ద్వార సూక్ష్మజీవులు ప్రవేశించి మూత్రాశయాన్ని చేరతాయి.మూత్ర విసర్జన సమయం లో మంట , ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చెయ్యడం మరియు రాత్రిళ్ళు మూత్ర విసర్జనకై మేల్కొనడం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు.ఈ వ్యాధిని యాంటీబయోటిక్స్ ద్వారా తగ్గించవచ్చు.కానీ కొంత మందిలో యాంటీబయోటిక్స్ వాడినా మరలా ఈ ఇన్ ఫెక్షన్ రావచ్చు.మూత్ర విసర్జన చెయ్యాలనిపించడమనే లక్షణాన్ని మాత్రం అశ్రద్ధ చెయ్యకూడదు.ఎందువల్ల అంటే ఒకోసారి మూత్రాశయం నుండి మూత్రం పైకి ఎగదన్ని కిడ్నీలలోకి ప్రవేశించవచ్చు.కిడ్నీల దగ్గర ఇలా జరగకుండా కవాటాలుంటాయి కానీ ఇలా జరిగే అవకాశం మాత్రం లేకపోలేదు

అసాధారణ రోజువారీ దినచర్య:
మన జీవ గడియారాన్ని(బయలాజికల్ క్లాక్) భగ్నపరచడం కూడా రాత్రిపూట మూత్ర విసర్జనకి మేలకువ వచ్చి నిద్రా భంగం కావడానికి ఒక కారణం. మన శరీరంలోని అవయవాలన్నీ 24 గంటల సైకిల్ ని అనుసరించి పని చేస్తాయి. కొంత మందిలో పగటి పూట ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేసే అలవాటు ఉంటుంది.ఒకవేళ మన బయ్లాజికల్ క్లాక్ ని భగ్నపరిస్తే రాత్రిపూట మూత్ర విసర్జన నిద్రని భంగపరిచే అవకశం ఉంది. షిఫ్ట్ లలో పనిచెయ్యడం వల్ల ఇలా జరిగే ఆస్కారం ఉంది.షిఫ్ట్ లలో పని చెయ్యడం వల్ల మన శరీరం మారిన నిద్ర, వేకువ సమయాలకి అలవాటు పడటానికి కొన్ని రోజులు పడుతుంది.పగలు మెలకువగా ఉండి రాత్రిళ్ళు నిద్రపోయేవారెవరైన షిఫ్ట్ లలో పనిచేస్తే మన బయలాజికల్ క్లాక్ గతి తప్పే ఆస్కారం ఉంది. జీవన విధానం లో చిన చిన మార్పుల వల్ల చాలా మందిలో మందులతో పని లేకుండా అతి మూత్ర విసర్జన ని అరికట్టవచ్చు.

కిడ్నీ వ్యాధులు:
సాధారణం గా కిడ్నీ వ్యాధులలో మూత్రం తగినంత ఉత్పత్తి కాదు. ఆందువల్ల తీసుకున్న ద్రవ పదార్ధాలు కిడ్నీలు గ్రహించకపోవడం వల్ల పగలు మరియు రాత్రి ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చెయ్యల్సి రావచ్చు.దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల రోగులలో అతి మూత్ర విసర్జన లక్షణం ఉంటుంది.ఒకోసారి దీనికి వ్యతిరేకం గా మూత్ర పరిమాణం తగ్గడం కూడా చూస్తుంటాము.”బై పోలార్ డిప్రెషన్” అనే ఒక రకమైన మానసిక రుగ్మత చికిత్సలో వాడే మందులలో “లిథియం” ఉంటుంది.ఈ “లిథియం” వల్ల కూడా అతి మూత్ర విసర్జన జరిగే ఆస్కారం ఉంది.

మూత్రాశయ వ్యాధులు:
మూత్రాశయ వ్యాధులున్నప్పుడు మూత్రాశయం మీద కొంచం ఒత్తిడి ఏర్పడినా మూత్రాశయం నిండకముందే మూత్రం బయటకి వచ్చెస్తుంది.రాత్రి పూట మూత్ర విసర్జన లక్షణం "ఇన్ ఫెక్షియస్ సిస్టయిస్(మూత్రాశయ ఇన్ ఫెక్షన్)" మాత్రమే కాకుండా మూత్రం చుక్క చుక్కగా కారుట,లేదా మూత్రాశయం త్వరగా నిండి తరచూ మూత్ర విసర్జన చెయ్యల్సిరావడం మొదలైనవి మూత్రాశయ వ్యాధి లక్షణాలు.
మూత్రాశయం లో మూత్రం పూర్తిగా ఖాళీ అవ్వకపోవడంతోపాటు మూత్రాశయం మీద ఒత్తిడి వల్ల జరిగే అకాల మూత్ర విసర్జన మూత్రాశయ వ్యాధి లక్షణం.
పగలూ మరియూ రాత్రి కూడా తరచూ మూత్ర విసర్జన చెయ్యాల్సి రావచ్చు.ఒక్కోసారి మూత్ర విసర్జన స్వాధీనం తప్పుతుంది కూడా.



Click it and Unblock the Notifications











