Latest Updates
-
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి..
స్ట్రాంగ్ రిలేషన్ షిప్ మరియు మనస్సులను దగ్గర చేసే కపుల్ యోగా
నేటి స్పీడు యుగంలో ఒంటరిగా కూర్చొని యోగాలు, ధ్యానాలు చేయాలంటే ఎవరికైనా కష్టమే. మిమ్మల్ని సాధారణంగా ఎవరూ ఇష్టపడరు. ఎక్కడ చూసినా ఇంటర్నెట్ కనెక్షన్లు, సోషల్ నెట్ వర్కింగ్, ల్యాప్ టాప్ లు వంటివి మీ సెలవులకు సైతం అందుబాటులో ఉండి ఆందోళన కలిగిస్తూనే ఉంటాయి. బెడ్ పై పడుకున్నా సెల్ ఫోన్ మోగుతూనే ఉంటుంది. రోజులో కొంత సమయం మీరు మీ ప్రేయసి వీటన్నిటికి దూరంగా ఉండాలి.
ప్రత్యేకించి వారమంతా అలసిపోయే వారికి వారాంతంలో ఇద్దరూ కొంత సేపు యోగా ధ్యానం వంటివి కలిసి చేస్తే....ఆ మజాయే వేరుగా ఉంటుంది.
యోగా కేవలం బాహ్యరూప సౌందర్యానికి, దృఢత్వానికి మాత్రమే సంబంధిచినది కాదు..ఇది శరీర బాహ్యా, అంతర్భాగాలపని తీరుని మెరుగుపరుస్తుంది. మొత్తం శరీరం దృఢంగా తయారవుతుంది. దృఢమైన శరీరం ఆరోగ్యవంతమైన మనసును కలిగి ఉంటుంది. మనో తేజస్సు వికసించి, నిర్మలమైన, ప్రశాంతమైన స్థితిని అనుభవించడానికి అవకాశం ఏర్పడుతుంది. దాంతో పాటు యోగా వల్ల రిలేషన్ షిప్ లో ఆనందం, పెంపొందించుకోవచ్చని మీకు తెలుసా?
ప్రత్యేకించి భార్యభర్తలిద్దరూ కలిసి యోగా చేయడం వల్ల ఇద్దరి మధ్యా అన్యోన్యత పెరగడంతో పాటు యోగా చేసేటప్పుడు విసుగు అనిపించదు. యోగా మీద ఆసక్తి కూడా పెరుగుతుంది. మన శరీరానికి భర్త శరీరం సపోర్ట్ గా ఉండటం వల్ల ఎక్కువగా స్ట్రెచ్ కూడా చేయగలుగుతాం.. మరి దంపతులిద్దరూ కలిసి చేయగలిగే యోగా సనాలేంటో చూద్దామా..

1. కటవక్రాసనం:
ముందుగా ఇద్దరూ అభిముఖంగా (ఒకరివీపుకి మరొకరి వీపుకి తగిలేట్టు)కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచాలి. ఇద్దరూ కుడి చేస్తో ఎడమ మోకాలిని పట్టుకోవాలి. ఎడమచేతితో వెనుకున్న వారి కుడి మోకాలు మీద ఉంచాలి. ఇలా 10 సెకెన్స్ ఉన్న తర్వాత కుడివైపు కూడా చేయాలి. ఇలా 6 సార్లు చేయాలి. ఈ ఆసనం చేయడం వల్ల వెన్నెముక పట్టేసినట్లుగా ఉండటం తగ్గుతుంది. వెన్ను నొప్పి తగ్గుతుంది. నడుము, వీపు కండరాలు దృఢంగా మారుతాయి.

2. శశాంక పూర్తీత్తాసనం:
ముందుగా ఇద్దరిలో ఒకరు వజ్రాసనంలో కూర్చోవాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ కిందకు వంగి నుదురును నేలకు ఆనించాలి. రెండు చేతులను పక్కన పెట్టాలి. ఇప్పుడు వాళ్ల వెనుక ఇంకొకరు కూర్చోవాలి. కాళ్లను నిటారుగా ఉంచి నడుమును పైకి లేపాలి. వెనక ఉన్న వారి పైన పూర్తి బరువును వేస్తూ నడుమును లేపాలి. చేతులు రెండింటిని పక్కన ఉంచాలి. ఈ అసనం వల్ల ఇద్దరికీ రక్తప్రసరణ బాగా జరుగుతుంది. పైన పూర్వీత్తాసనంలో ఉన్న వాళ్లకు నడుము రిలాక్స్ అవడంతో పాటు శరీరం పూర్తిగా స్ట్రెచ్ అవుతుంది. కింద శశాంకాసనంలో ఉన్న వాళ్లకు నడుము రిలాక్స్ అవడంతో పాటు శరీరం పూర్తిగా స్ట్రెచ్ అవుతుంది. కింద శశాంకాసనంలో ఉన్నవారికి తలకు మొత్తం రక్తప్రసరణ అందుతుంది. దీని వల్ల తలనొప్పి, బీపి, కోపం లాంటివన్నీ తగ్గిపోతాయి. పైన ఉన్నవారికి కింద సపోర్ట్ ఉంటుంది కాబట్టి, శరీరాన్ని ఎక్కువగా స్ట్రెచ్ చేయడానికి వీలు కలుగుతుంది.

3. నౌకాసనం :
ఇద్దరూ ఎదురెదురుగా కూర్చొని ఇద్దరి రెండు కాళ్లు కలిపి పైకి లేపాలి. పాదాలను కలిపి ఉంచాలి. ఇద్దరి చేతులు కలిపి పట్టుకోవాలి. కాళ్లు చేతులు రంెడూ నిటారుగా ఉంచాలి. వాటిని వంచకూడదు. శ్వాస మామూలుగా తీసుకొని వదులుతూ ఉండాలి. ఈ స్థితిలో 30-60సెకన్లు ఉండాలి. ఈ ఆసనం ఒక్కరే చేయాలటే కష్టంగా ఉంటుంది. ఇద్దరూ కలిపి చేస్తున్నారు కాబట్టి తేలిగ్గా చేయొచ్చు. ఎక్కువ సేపు ఈ ఆసనంలో ఉండొచ్చు. మొదట్లో కాస్త కష్టమైనా చేసే కొద్దీ ఇద్దరికీ అవగాహన ఏర్పడుతుంది. ఒకరికొకరు ఆసరా ఇచ్చుకుంటూ బ్యాలన్స్ చేసుకుంటారు. కాబట్టి, ఇద్దరికీ ఇది ఆసక్తి కరంగానే అనిపిస్తుంది.

4. వీరభద్రాసనం:
ఇద్దరూ పక్కపక్కన నిలబాలి. రెండు కాళ్లు దూరంగా చాపాలి. ఒకరు కుడిపాదాన్ని కుడివైపుకి, మరొకరు ఎడమ పాదాన్ని ఎడమవైపుకు తిప్పాలి. 90డిగ్రీల కోణంలో మోకాలును వంచాలి. వంచినప్పుడు కాలివేళ్లు దాటి మోకాళ్లు బయటకు రాకూడదు. కుడిైవపు మోకాలు వంచిన వారు కుడివైపుకి, ఎడమకాలు వంచిన వారు ఎడమవైపుకి తిరగాలి. రెండు చేతులు నెమ్మదిగా పైకి తీసుకొని వెళ్లాలి. పైన వాటిని నమస్కార ముద్రలో ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా సాధ్యమైనంత మేరకు వెనక్కి వంగి పైకి చూడాలి. ఈ స్థితిలో 30-60 సెకన్టు ఉండి తర్వాత నెమ్మదిగా చేతులు కిందకు దింపాలి. ఇద్దరూ కలిసి మధ్యలోకి ఎదురెదురుగా తిరిగి విశ్రాంతి స్థితిలోకి రావాలి. ఇదే విధంగా మరోవైపు కూడా చేయాలి. ఈ ఆసనం చేయడం వల్ల నడుము కింద భాగాలు వెన్నెముకకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మోకాళ్లు కాలి పిక్కలు కాళ్లు దృఢంగా అవుతాయి. పొట్ట, నడుము అన్నింటికీ ఇది చాలా మంచి ఆసనం.

5. ఉచిత కోణాసనం:
ముందుగా పక్కపక్కన నిలబడాలి. రెండు కాళ్లను దూరంగా ఉంచాలి. ఒకరు కుడి మోకాలు కుడివైపుకి తిప్పాలి. వేరొకరు ఎడమ మోకాలు ఎడమైపుకి తిప్పాలి. ఇద్దరూ మోకాలును 90డిగ్రీల కోణంలో వంచాలి. ఇద్దరి పాదాల వేళ్లను తాకించి ఉంచాలి. ఒకరు కుడి చేతిని మరొకరు ఎడమ చేతిని పైకి లేపి ఇద్దరి చేతులతో నమస్కారం చేయాలి. ఈ సమయంలో ఇంకో కాలు దూరంగా చాపి స్టిఫ్ గా, ఏటవాలుగా ఉంచాలి. వెన్నెముకను నిటారుగా ఉంచాలి. ఈ ఆసనంలో 30-60 సెకన్లు ఉంచాలి. ఈ ఆసనం వల్ల శరీరానికి శక్తి అభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చిరాకు, బిసుగు, ఆందోళన తగ్గుతాయి.

6. వృక్షాసనం:
ముందుగా ఇద్దరూ పక్కపక్కన నుంచోవాలి. కుడివైపున ఉన్న వారు కుడిమోకాలుకు ఎడమ పాదాన్ని ఆనించాలి. ఎడమ వైపు ఉన్న వారు ఎడమ మోకాలును కుడి పాదాన్ని తాకించి ఉంచాలి. కుడివైపున ఉన్న వారు కుడిచేతిని, ఎడమవైపు ఉన్న వాళ్లు ఎడమచేతిని కలిపి నమస్కార ముద్రలా ఉంచాలి. ఇంకో చేస్తో ఒకరి నడుము ఇంకొకరు పట్టుకోవాలి. ఈ భంగిమలో 30-60సెకన్టు ఉండాలి. ఈ ఆసనం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. కాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇలా ఆసనాలు కలిసి చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా, ద్రుడంగా ఆరోగ్యంగా ఉండటమే కాదు, జీవితంలో ఏ సమస్య ఎదురైనా ఇద్దరూ కలిపి పరిష్కరించుకునే ఆవగాహన శక్తి లభిస్తాయి.



Click it and Unblock the Notifications