Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
వెజిటబుల్ జ్యూస్ తో అసలైన ఆరోగ్యం
కూరగాయల జ్యూస్ లు చాలా విభిన్నమైన టేస్ట్ తో ఉంటాయి. అన్ని రకాల కాయగూరలతో చేసిన జ్యూస్ తీసుకోవడం వల్ల అనేకరకాల పోషకాలు ఒకేసారి పొందవచ్చు. కూరగాయల రసం ద్వారా పుష్కలంగా ఫైబర్ అందుతుంది. ఇందులో ఫైటోకెమికల్స్, కలర్, ఫ్లేవర్, పోషకాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
వెజిటబుల్ జ్యూస్ లు, పళ్ల రసాల ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో పొందగలుగుతాం. అంతేకాదు అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి కూడా వెజిటబుల్ జ్యూస్ లు పనిచేస్తాయి. లిక్వడ్ రూపంలో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. కొలెస్ర్టాల్ లెవెల్ తగ్గించడానికి, ఆందోళన నుంచి బయటపడటానికి ఇలా రకరకాల సమస్యలకు రకరకాల వెజిటబుల్ జ్యూస్ లు ఉపయోగపడతాయి. అయితే ఏ జ్యూస్ వల్ల ఎలాంటి లాభం పొందుతారో తెలుసుని ఫాలో అయిపోండి.

క్యారెట్ జ్యూస్
పొటాషియం, మెగ్నీషియం మెండుగా ఉన్న క్యారెట్ జ్యూస్ బ్లడ్ కొలెస్ర్టాల్ తగ్గించడానికి సహకరిస్తుంది. అంతేకాదు రక్త పీడనం అంటే బీపీని కంట్రోల్ చేయడానికి, రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మధుమేహం, బీపీ ఉన్న వాళ్లు రెగ్యులర్ గా క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

బీట్ రూట్ జ్యూస్
బీట్ రూట్, క్యారెట్, కీర దోసలతో కలిపి జ్యూస్ తయారు చేసి తీసుకోవడం వల్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. రక్తంలో యురిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే.. జాయింట్ పెయిన్స్, చర్మంపై దురదలకు కారణమవుతుంది. కాబట్టి బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది.

స్లిమ్మింగ్ జ్యూస్
10 గ్రాముల కేల్, 5 గ్రాముల బచ్చలి, 5 గ్రాముల కీరదోస, 5 గ్రాముల పాలకూర తీసుకుని అన్నీ కలిపి జ్యూస్ తయారు చేసుకుని తాగాలి. ఈ జ్యూస్ తొడల భాగంలో ఉండే ఫ్యాట్ ని కరిగిస్తుంది. ఉదయాన్నే పరగడుపున ఈ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక నెల రోజులు ఈ ట్రీట్ మెంట్ ఫాలో అయితే స్లిమ్ గా తయారవుతారు.

క్యాబేజ్ జ్యూస్
చర్మంపై ముడతలు, నల్లటి మచ్చలు, నిర్జీవంగా మారిన చర్మం.. ఇవన్నీ వయసు పెరుగుతున్న ఛాయలు తెలుపుతాయి. ఈ లక్షణాలన్నింటి నుంచి బయటపడాలంటే.. 5 గ్రాముల క్యాబేజ్, 4 గ్రాముల క్యారెట్, 3 గ్రాముల రెడ్ పెప్పర్ తీసుకుని జ్యూస్ తయారు చేసుకోవాలి. ఈ హెల్తీ డ్రింక్ ని రోజూ మూడు వారాలపాటు తీసుకోవడం వల్ల యంగ్ లుక్ సొంతం చేసుకుంటారు.

కీరదోస, పాలకూర జ్యూస్
ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడటానికి చక్కటి పరిష్కారం వెజిటబుల్ జ్యూస్. కీరదోస, పాలకూర కలిపి జ్యూస్ తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గిపోతాయి.

కేల్, గ్రీన్ గ్రేప్స్ జ్యూస్
కేల్, గ్రీన్ గ్రేప్ జ్యూస్ ని రుతుక్రమ సమయంలో, ప్రెగ్నెన్సీ సమయంలో తాగడం మంచిది. ఎందుకంటే దీనిలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణ సరిగా జరగడానికి, ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications
