Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
ట్యాబ్లెట్స్ ఉపయోగించని మన పూర్వీకుల అమేజింగ్ హోం రెమిడీస్
మనకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా తక్షణ ఉపశమనం కలిగించే పరిష్కార మార్గాలు వెతుక్కుంటాం. అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే మందుల షాపులో టాబ్లెట్స్ కోసం పరుగులు తీస్తాం. కానీ అవే మందుల లక్షణాలు కలిగిన నేచురల్ మెడిసిన్స్ మన వంట గదిలోనే ఉంటాయని గ్రహించరు.
వాస్తవానికి మన వంటగది మన ఔషధ శాల. పురాతన కాలం నుంచి మన వంటగదిలో, పెరట్లో ఉండే ఔషధాలతోనే జబ్బులు నివారించుకునేవాళ్లు. వీటి గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటే అన్ని రకాల జబ్బులను హెర్బ్స్, నేచురల్ రెమెడీస్ తోనే నివారించుకునేవారు.
ప్రస్తుత రోజుల్లో కూడా చాలా మంది ఇండియన్స్ ఇంగ్లీష్ మెడిసిన్స్ కు బదులుగా హెర్బల్ రెమెడీస్ ను ఫాలో అవ్వడం మంచిది. మన అనారోగ్య సమస్యలన్నింటినీ నివారించుకోవడం కోసం నేచర్ మంచి పరిష్కార మార్గాలను చూపించింది. ఇలాంటి నేచురల్ రెమెడీస్ ను ఫాలో అవడం మంచిది. మరి మన పూర్వీకులు పాటించిన అమేజింగ్ హోం రెమిడీస్ పై ఓ లుక్కేయండి..

రోజ్మెరీ టీ:
రోజ్మెరీ టీ తాగడం వల్ల మజిల్ పెయిన్ నివారించుకోవచ్చు. బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకోవచ్చు. దీన్ని క్లెన్సర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు.

జిన్సింగ్
ఇది ఒక హెర్బల్ రూట్. దీంతో టీ తయారుచేసి తాగడం వల్ల అలసట తగ్గుతుంది. వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. కాలేయం, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది .

అల్లం:
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఇవి జీర్ణక్రియను, బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచుతుంది. కాబట్టి రోజూ జింజర్ టీ తాగడం మంచిది.

లికోరైస్:
లికోరైస్ రూట్ ను టీ కాచీ తాగడం వల్ల జలుబు మరియు దగ్గును నివారించుకోవచ్చు. .గొంతునొప్పి కూడా తగ్గిస్తుంది . దంతాలనొప్పిన్నప్పుడు ఈ వేరు నమలడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది.

చమొమోలి టీ:
చమొమోలీ టీ తాగడం వల్ల ప్రేగు సమస్యలు మరియు వికారం తగ్గిస్తుంది.

యూకలిప్టస్ ఆయిల్:
యూకలిప్టస్ ఆయిల్ గొంతు నొప్పి, జ్వరం, ఫ్లూ, దగ్గు నివారిస్తుంది.

బ్లాక్ రాస్బెర్రీ:
ఈ రూట్ తో టీ తయారుచేసి, తాగడం వల్ల డయోరియా, దగ్గు, పేగు సమస్యలను నివారిస్తుంది.

కేయాన్:
కేయాన్ లో నొప్పిని తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి. ఇది జీర్ణక్రియను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది.

అలోవెర:
అలోవెర జెల్ కాలిన గాయలను, తెగిన గాయలను, పుండ్లను , క్రియులు కుట్టిన గాయలను నివారిస్తుంది. ఇది ఒకమెడిసినల్ హెర్బ్.

బ్లాక్ బెర్రీ:
బ్లాక్ బెర్రీ లీవ్స్, రూట్స్ , స్టెమ్ తో టీ తయారుచేసి తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేసన్, డయోరియా తగ్గించి , మెటబాలిజం రేటు పెంచుతుంది . గొంతు నొప్పిని తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications