For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజులో మీ శరీరాన్ని మరింత ఎక్కువగా కదిలించడానికి 10 టిప్స్

By Sindhu
|

కుర్చీలు మన సౌకర్యం కొరకు రూపొందిచబడ్డాయి. కానీ మనం వాటిల్లో కూర్చోవడానికి ఎంతగా అలవాటు పడిపోయామంటే ఆ అలవాటు మన ఇంటి దగ్గరలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్ళి తినడం కంటే కూడా శరీరానికి ఎక్కువ హాని కలిగించేంతగా.మీరు రోజూ వ్యాయామం చేసి ఆతరువాత రోజులో మిగతా భాగమంతా క్రియారహితం(యాక్టివ్ గా లేకుండా) ఉండటం ప్రమాదం.

ఈ మధ్యే క్యాన్సర్ ఎపిడెమియోలజీ, బయోమార్కర్స్ అండ్ ప్రివెన్షన్ వారి జర్నల్ లో ప్రచురించిన కధనం ప్రకారం స్త్రీలలో ఆరుగంటలు లేదా అంతకు ఎక్కువ సేపు కుర్చీలలో కూర్చునే వారిలో మూడు గంటల కంటే తక్కువ కూర్చునేవారితో పోలిస్తే పది శాతం ఎక్కువ.

శారీరకంగా క్రియారహితం గా(ఇనాక్టివ్) ఉండటం వల్ల సంభవించే మరణాలు స్థూలకాయం వల్ల సంభవించే మరణాకంటే రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు కనుగొన్నారు. మీరు రోజూ ఓ ఇరవై నిమిషాలపాటు వేగం గా నడక సాగించడం వల్ల ఈ ప్రమాదాన్ని పదహారు నుండీ ముప్ఫై శాతం మేర తగ్గించవచ్చు.

ప్రతీరోజూ నడకతోపాటు కింద పేర్కొన్న 10 టిప్స్ పాటించి మీ శరీరానికి మరింత వ్యాయామాన్ని అందించండి.

గంటపాటూపూర్తిగా కూర్చోవద్దుట

గంటపాటూపూర్తిగా కూర్చోవద్దుట

గంటలో ఓ ఐదు నిమిషాల పాటు నిల్చోవాలి అంటే వినడానికి ఆశ్చర్యం గా ఉన్న ఈ చిన్న మార్పు చాలా లాభదాయకం.మీరు పదహారు గంటలు మెలకువతో ఉన్నారనుకుంటే గంటలో ఓ ఐదు నిమిషాలు నిల్చోవడం వల్ల శరీరానికి అదనంగా 80 నిమిషాలా వ్యాయామం లభిస్తుంది.ఒక్కసారి దీనిని మొదలెట్టి క్రమంగా పెంచుకుంటూ పోయి గంటలో మీరు కూర్చునే నిమిషాలని మెల్లి మెల్లిగా తగ్గించుకోవచ్చు.

మాట్లాడేటప్పుడు నడవండి

మాట్లాడేటప్పుడు నడవండి

మనలో చాలా మంది రోజులో చాలా భాగం ఫోనులో గడుపుతాము.మీరు ఆఫీసులో ఉన్నా ఇంట్లో ఉన్నా ఫోను మాట్లాడేటప్పుడు నడవాలి అన్న నియమం పెట్టుకోండి.మీ ఆఫీసు లేదా ఇంట్లో మెల్లిగా నడుస్తున్నా కానీ కాళ్ళు కదుపుతూ మీరు ఫోనులో మాట్లాడేటప్పుడు కూర్చోవాలి అనిపించే కోరికని అదిమిపట్టండి

నిల్చుని లేదా స్టెబిలిటీ బాల్ ఉపయోగించడం

నిల్చుని లేదా స్టెబిలిటీ బాల్ ఉపయోగించడం

రోజంతా కూర్చునుండటం వల్ల జరిగే హానిని దృష్టిలో ఉంచుకుని చాలా ఆఫీసులు నిల్చుని పని చేసుకునే డెస్క్ లు అందువాటులో ఉంచుతున్నాయి. ఊకవేళ మీ ఆఫీసు ఇంకా అలాంటి ఆఫీసుల సరసన చేరకపోతే మీరే వెళ్ళి మీ సూపర్ వైజర్ తో మాట్లాడి ఆ ఏర్పాటు మీ ఆఫీసులో కూడా చేయచ్చేమో కనుక్కోండి.

మీ గుండె వేగం పెంచడానికి ఉపయోగపడే ఏ విషయాన్నీ వదలద్దు

మీ గుండె వేగం పెంచడానికి ఉపయోగపడే ఏ విషయాన్నీ వదలద్దు

మీరు రోజులో ఎంతసేపు వేచి చూదటం లో గడుపుతారు?? లైన్ లో వేచి చూడటం, కాపీ మెషీన్ దగ్గరో మైక్రోవేవ్ ముందో ఇలా చాలా చోట్ల వేచి ఉంటుంటారు కదా. మీ ఆహారం మైక్రోవేవ్ లో వేడయ్యేలోపు ఓ రెండు మూడు సెట్ల స్క్వాట్స్ చెయ్యండి లేదా బ్రష్ చేసుకుంటూ గోడ కుర్చీ వెయ్యచ్చు. మీ రొటీన్ పాటిస్తూనే మీ గుండె వేగాన్ని పెంచడానికి పైన చెప్పిన చిన్న చిన్న పనులు చేస్తుంటే మీ గుండె వేగం పెరుగుతుంది.ఉదాహరణకి నడిచేటప్పుడూ వేగం గా నడవండి,మీ బట్టలు సౌకర్యవంతంగా ఉండి మీ ఆరోగ్యం సహకరిస్తే మెట్ల మీద మెల్లిగా నడిచి ఎక్కే బదులు వేగం గా ఎక్కండి.

కాసేపు మీ కారుని పక్కన పెట్టండి

కాసేపు మీ కారుని పక్కన పెట్టండి

అసలు ఎప్పుడూ కారు ఉపయోగించాల్సిరాకపోవడం ఎంత బాగుంటుందో కదా, కానీ మనలో చాలా మందికి వాస్తవం లో అది సాష్యం కాదు.కానీ వీలయినప్పుడల్లా నడచి వెళ్ళడమో లేదా బైక్ మీద వెళ్ళడమో చెయ్యండి.మీరు బస్సు ఎక్కి దిగేచోటి నుండీ నడవటం కూడా మీ యాక్టివిటీ లెవెల్స్ ని పెంచుతుంది.ఇది వీలుకాపోతేపాత పద్ధతిలో మీ కారు ని మీ గమ్యస్థానం నుండి వీలయినంత దూరం పార్క్ చేసి నడచి వెళ్ళండి.

అడ్వర్టైజ్మెంట్లు వచ్చేటప్పుడు వ్యాయాయం

అడ్వర్టైజ్మెంట్లు వచ్చేటప్పుడు వ్యాయాయం

టీవీ చూస్తున్నప్పుడు మధ్యలో వాణిజ్యప్రకటనల సమయం లో రకరకాలా వ్యాయామాలని ఓ ఇరవై సార్లు చెయ్యండి.మీరు ఆ ప్రకటనలు చూడకపోయినా సరే ఏదో ఒకటి చెయ్యండి మీ శరీరాన్ని కదిలించడానికి. అది చిన్న చిన్న స్ట్రెచింగ్ లాంటిదైనా సరే.

కాసేపు ఈ మెయిల్ ని పక్కనపెట్టండి

కాసేపు ఈ మెయిల్ ని పక్కనపెట్టండి

ఈమెయిల్ చాలా ఉపయోగకర ఉపకరణం. దీనిని ఉపయోగించి ప్రపంచం లో ఉన్న ఏ వ్యక్తితోనైనా,లేదా మీ దేశం లో ని వ్యక్తితోనో మీ ఆఫీసులో ఉన్న వ్యక్తితో కూడా సంభాషించవచ్చు.మీ సహోద్యోగికి సమాచారాన్ని ఈమెయిల్ ద్వారా కాకుండా కాస్త కుర్చీ లోంచి లేచి ,నడుచుకుంటూ స్వయం గా ఆ వ్యక్తి దగ్గరకి వెళ్ళి కూడా సమాచారాన్ని అందచేయవచ్చు.

మంచినీళ్లు

మంచినీళ్లు

నీళ్ళు తాగడానికీ ఎక్కువగా కదలడానికీ సంబంధం ఏమిటి??మీరు తాగిన నీటిని విసర్జిస్తారు చూడండి, అది ఉపయోగకరం. జిమ్ముకి వెళ్ళడానికి మిమ్మల్ని మీరు సమాధానపరచుకోవడం కంటే లేచి బాత్రూం కి వెళ్ళాలి అనుకోవడం చాలా కష్టం.రోజూ 10-15 కప్పుల మంచినీళ్ళు తాగడం వల్ల బాత్రూం కి వెళ్ళాల్సిసివచ్చి లేవడం వల్ల మీలో కదలిక ఏర్పడుతుంది.ఈ అలవాటుని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళి, బాత్రూం కి వెళ్లవలసి వచ్చినప్పుడల్లా మీ అంతస్థులో ఉన్న బాత్రూం కాకుండా వేరే అంతస్థు లో ఉన్న బాత్రూం కి వెళ్ళడం వల్ల మరింత కదలిక వస్తుండి మీ శరీరంలో .

ఒక రొటీన్ ని అలవాటు చేసుకోండి

ఒక రొటీన్ ని అలవాటు చేసుకోండి

మనుష్యులకి ఓ పద్ధతి లేదా అలవాటు అయితే దాని నుండి బయటకి రావడం కష్టం.ఈ గుణాన్ని దీనిని మీకు లాభదాయకం గా మార్చుకోండి.ఒకసారి మీకు కనుక రోజులో ఎక్కువసార్లు కదలడం అలవాటయితే ఎప్పుడైనా అలా చెయ్యనప్పుడు మీకే ఆ తేడా తెలుస్తుంది.మెల్లిగా మీ రొటీన్ ఏర్పాటు చేసుకుంటూ వీలైన చోట ఆ రొటీన్ లో చిన్న చిన్న వ్యాయామాలని చేర్చండి.

ఊరికే కూర్చోవద్దు

ఊరికే కూర్చోవద్దు

మీరు ఎక్కడ కూర్చున్నా సరే, అది ఆఫీసు కావచ్చు, కారు లేదా మీ కుర్చీ..ఎక్కడైనా సరే ఊరికే అలా మొద్దులా కూర్చోవద్దు.మీ శరీరాన్ని కదుపుతూ ఉండండి . మీ డెస్క్ లో కూర్చునే చేసే వ్యాయామాలెన్నో ఉన్నాయి,లెగ్ లిఫ్ట్స్,గ్లుట్(మీ తుంటి నుండి తొడ భాగం లో ఉండే కండరాలు) స్క్వీజెస్,హీల్ లిఫ్ట్స్(మడమలు ఎత్తడం),యాంకిల్ సర్కిల్స్(చీలమండని వలయాకారం లో తిప్పడం), అబ్డామినల్ బ్రేసింగ్(మీ నాభిని లోపలకి లాగి వదలడం) లాంటివన్నమాట.మీరు ఎక్సర్సైజులు చెయ్యకపోయినా అటూ ఇటూ కదులుతుండటం వల్ల మీ శరీరం ఎప్పుడూ "ఆన్" లోనే ఉంటుంది.

English summary

10 Tips for Moving More Every Day

10 Tips for Moving More Every Day,Chairs were designed to make our lives easier, but we’ve gotten to the point where they’re actually more harmful to our health than a daily trip to the local fast-food joint. Even if you work out every day, filling the rest of your day with inactivity can eventually kill you.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more