Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పాలును టేస్టీగా, మిమ్మల్ని హెల్తీగా మార్చే మిల్క్ కాంబినేషన్స్..!!
పాల్లో ఉన్న పోషకాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే.. చిన్నప్పటి నుంచి పాలను.. ప్రతిరోజూ తాగేలా అలవాటు ఉంటుంది. పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ పాలు తాగడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు, క్యాల్షియం అందుతాయి. కానీ.. చాలా మందికి పాలు తాగడం ఇష్టం ఉండదు. ముఖ్యంగా చిన్న పిల్లలు పాలు తాగడానికి చాలా మారాం చేస్తుంటారు.
దాల్చిన చెక్క, పాలు తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు..!!
పాలలో ఏమీ కలుపుకోకుండా తాగే అలవాటు చాలామందికి ఉండదు. కొంతమంది బూస్ట్, హార్లిక్స్ వంటి రకరకాల ఫ్లేవర్స్ తో తాగడం అలవాటు చేసుకుంటారు. అయితే.. వీటిల్లోనూ.. కెమికల్స్, శరీరానికి హాని చేసే పదార్థాలు ఉంటాయన్న అపోహ ఉంది. కాబట్టి.. ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కంటే.. ఇంట్లోని కొన్ని ఆరోగ్యకరమైన పదర్ధాలు మిక్స్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
అయితే పాలల్లో కొన్ని పదార్థాలను మిక్స్ చేయడం వల్ల పాలను మరింత టేస్టీగా మార్చడమే కాకుండా.. శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. మరి పాలల్లో ఎలాంటి పదార్థాలు మిక్స్ చేయడం వల్ల ఎలాంటి బెన్ఫిట్స్ పొందవచ్చో.. ఇప్పుడు చూద్దాం..

పాలు, అల్లం
పాలల్లో అల్లం మిక్స్ చేసి తీసుకోవడం వల్ల.. స్కిన్ టోన్ సాఫ్ట్ గా, గ్లోయింగ్ గా మారుతుంది. ఈ కాంబినేషన్ లో పాలు తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

డార్క్ చాక్లెట్ పౌడర్
డార్క్ చాక్లెట్ లో ఫ్లేవనాయిడ్స్, క్యాల్షియం ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్, క్యాన్సర్ ని అరికడతాయి. అలాగే.. చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి. కాబట్టి పిల్లలు, పెద్దలు ఇష్టపడే డార్క్ చాక్లెట్ పౌడర్ ని పాలలో మిక్స్ చేసి తాగితే.. టేస్టీ మిల్క్ తోపాటు, అమేజింగ్ బెన్ఫిట్స్ పొందవచ్చు.

కర్జూరాలు
పాలల్లో డేట్స్ మిక్స్ చేసి తాగితే.. చాలా మంచిది. డేట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఇది కాన్ట్సిపేషన్, ఇన్ డైజెషన్ సమస్యలను నివారిస్తుంది. అలాగే.. ఈ కాంబినేషన్ లో పాలు తీసుకోవడం వల్ల.. అనీమియాను నివారిస్తుంది.

పసుపు
పాలల్లో పసుపు కలుపుకుని తాగడం ఓల్డ్ ట్రెడిషనల్ పద్ధతి. పసుపులో ఉండే ఎమినో యాసిడ్స్ బాగా నిద్రపోవడానికి సహాయపడతాయి. అలాగే.. బ్లడ్ ప్యూరిఫై చేయడానికి, చర్మ సమస్యలతో పోరాడటానికి సహాయపడతాయి. ఈ కాంబినేషన్ మిల్క్ లో క్యాల్షియం ఉంటుంది. కాబట్టి ఇది.. జాయింట్ పెయిన్స్ ని నివారిస్తాయి.

తేనె
పాలల్లో ప్రొటీన్ ఉంటుంది, తేనెలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ రెంటింటినీ మిక్స్ చేసి తీసుకోవడం వల్ల.. శరీరంలో మెటబాలిజం మెరుగ్గా సాగుతుంది. అలాగే.. ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి.

అరటిపండు
పాలు, అరటిపండు కాంబినేషన్ తీసుకోవడం వల్ల .. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం హార్ట్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేస్తాయి, బీపీని కంట్రోల్ చేస్తుంది. ఈ కాంబినేషన్ డిప్రెషన్, విటమిన్ బి12 ని కంట్రోల్ చేస్తాయి.

బాదాం
పాలు, బాదాం కలిపి తీసుకోవడం వల్ల.. ఎముకలు స్ట్రాంగ్ గా మారుతాయి. ఈ కాంబినేషన్ మిల్క్ లో ఐరన్, క్యాల్షియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి.. హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతాయి.

కుంకుమపువ్వు
పాలు, కుంకుమ పువ్వు కాంబినేషన్ గర్భిణీ స్త్రీలకు మంచిది. ఈ కాంబినేషన్ బీపీ ని కంట్రోల్ లో ఉంచుతుంది. అలాగే మూడ్ ని మెరుగుపరుస్తుంది.

మామిడిపండు
పాలు, మామిడి పండు కాంబినేషన్ బరువు పెరగాలి అనుకునేవాళ్లకు మంచిది. పాలు, మామిడిపండు రెండింటిలోనూ ప్రొటీన్స్ ఉంటాయి. ఆల్కలాయిడ్స్ ఉండే.. ఈ కాంబినేషన్ ఎసిడిటీని ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

దాల్చిన చెక్క
పాలు, దాల్చిన చెక్క పొడి కలిపిన కాంబినేషన్ కాన్ట్సిపేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే.. గొంతునొప్పి, గొంతులో వాపు, దగ్గు, జలుబుని కూడా నివారిస్తుంది.

మిరియాలు
నల్ల మిరియాలను పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు, దగ్గు, జలుబు, అజీర్ణం, కాన్ట్సిపేషన్ వంటి అనేక అనారోగ్య సమస్యలు నివారించవచ్చు. అలాగే.. మంచి ఫ్లేవర్ ని, టేస్ట్ అందిస్తుంది.. ఈ మిల్క్ కాంబినేషన్.



Click it and Unblock the Notifications