Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
అలర్ట్: ఈ ఆహారాలను మిక్స్ చేసి తీసుకుంటే విషపూరితమే..!!
మన నిత్య జీవితంలో ఫుడ్ చాలా ముఖ్యమైనది. ఆహారం లేకుండా మనం బతకలేం, ఏ పని చేయలేం. అలాగే సరైన ఆహారం కూడా చాలా ముఖ్యం. పౌష్టికాహారం కాకుండా.. ఇతర అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకున్నా.. అది మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఆహారం తీసుకునేటప్పుడు చాలా విషయాలు మైండ్ లో పెట్టుకోవాలి.
ఉదయం తొమ్మిది గంటలలోపు ప్రతి ఒక్కరూ చేసే పొరపాట్లు..!
మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. కొంతమందికి రెండు మూడు రకాల ఫుడ్స్ ని కాంబినేషన్ గా తీసుకునే అలవాటు ఉంటుంది. అది టేస్టీగానే ఉంటుంది కానీ.. చాలా డేంజరస్. కాబట్టి.. ఆహారం తీసుకునే ముందు అది ఎంతవరకు హెల్తీ అనే విషయాన్ని తెలుసుకోవాలి. కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే చాలా హెల్తీ.. కానీ కొన్ని రకాల కాంబినేషన్స్ మాత్రం చాలా విషపూరితమైనవి. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి.

పాలు, ఫ్రూట్స్
పండ్లు తేలికగా జీర్ణమవుతాయి. కానీ పాలు అంత ఈజీగా జీర్ణం కాలేవు. కాబట్టి ఈ రెండింటినీ కలపడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. కాబట్టి ఈ రెండింటినీ ఎప్పుడూ మిక్స్ చేసి తీసుకోకండి.

డైరీ ప్రొడక్స్, ముల్లంగి
డైరీ ప్రొడక్ట్స్ శరీరంలోపల కూల్ చేస్తే.. ముల్లంగి హీట్ పెంచుతుంది. కాబట్టి.. ఈ రెండింటినీ కాంబినేషన్ గా తీసుకోవడం హెల్తీ కాదు. జీర్ణసమస్యలు వస్తాయి.

చేపలు, పాలు
పాలను ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్ తోనూ మిక్స్ చేసి తీసుకోకూడదు. చేపలు, మాంసం, చికెన్ వంటివి పాలతో కలపితే హానికరం. ఫిష్, మాంసం హీటింగ్ ఫుడ్స్ అయితే.. డైరీ ప్రొడక్ట్స్ కూలింగ్ ఫుడ్స్. ఈ రెండింటి కాంబినేషన్ లో ఫుడ్ తీసుకుంటే.. టాక్సిన్స్ బయటకు వెళ్లకుండా.. పేరుకుపోతాయి.

పాలు, ఉప్పు
సాల్ట్ యాస్ట్రిజెంట్ గుణాలు కలిగి ఉంటుంది. పాలలో న్యూట్రీషనల్ గుణాలుంటాయి. ఈ రెండింటినీ మిక్స్ చేసి ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు.

చిల్డ్ బివరేజెస్
భోజనం చేసిన వెంటనే ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్స్, ఐస్డ్ డ్రింక్స్ తీసుకోవడం మానేయాలి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది.

సాయంత్రం 6గంటల తర్వాత స్వీట్స్
సాయంత్రం ఆరు గంటల తర్వాత స్వీట్స్, యోగర్ట్ తీసుకోకూడదు. ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో ఎక్కువ శ్లేష్మం ఏర్పడటానికి కారణమవుతుంది.

వండిన తేనె
తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కాబట్టి దాన్ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు. కానీ వేడి చేసి తీసుకుంటే.. అది విషపూరితంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడూ పచ్చి తేనెనే తీసుకోండి.

తేనె, నెయ్యి
తేనె శరీరాన్ని వెచ్చగా మార్చితే.. నెయ్యి చల్లబరుస్తుంది. కాబట్టి ఈ రెంటింటి కాంబినేషన్ హెల్తీ కాదు.

ఫ్రూట్స్
ఫ్రూట్స్ ని ఎట్టిపరిస్థితుల్లో బంగాళదుంపలు, చీజ్, ఫ్రైడ్ ఫుడ్స్ లో కలపకూడదు. ఎందుకంటే పండ్లు తేలికగా జీర్ణమవుతాయి. మిగిలిన పదార్థాలు జీర్ణమవడానికి సమయం తీసుకుంటుంది. అలాగే ఫ్రూట్స్ ని ఎందులో కలపకుండా తీసుకోవడం చాలా మంచిది.

మిలాన్స్, గ్రెయిన్స్
వాటర్ మెలాన్, మస్క్ మెలాన్ వంటి ఫ్రూట్స్ త్వరగా జీర్ణమవుతాయి. అదే ధాన్యాలు జీర్ణమవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే.. పొట్టలో సమస్యలు ఏర్పడతాయి.

లైట్ ఫుడ్, హెవీ ఫుడ్
లైట్ ఫుడ్ ని, హెవీ ఫుడ్ తో కలపడాన్ని మంచి ఐడియాగా భావిస్తాం. ఇది చాలామంది పాలో అయ్యే అలవాటు. కానీ.. ఇలా కలిపి తినడం వల్ల ఖచ్చితంగా జీర్ణక్రియ సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి.. ఫుడ్ కాంబినేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.



Click it and Unblock the Notifications