For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దగ్గు, జలుబు నుంచి తక్షణ ఉపశమనం కలిగించే పవర్ ఫుల్ రెమిడీస్

By Swathi
|

ముక్కులో నీళ్లు కారే విధంగా జలుబు, గొంతునొప్పి, గొంతు వాపు, తుమ్ములు, దగ్గు.. ఇవన్నీ.. కామన్ కోల్డ్ సూచించే లక్షణాలు. ఇది ఒకరకంగా చెప్పాలంటే వైరల్ ఇన్ఫెక్షన్. ఈ సమస్య వచ్చిందంటే.. ఏ పనిచేయలేక, నిద్రపోలేక తీవ్ర అసౌకర్యంగా ఉంటుంది. జ్వరం వచ్చిన ఫీలింగ్ ఉంటుంది.

జలుబుతో బాధపడేటప్పుడు మెడిసిన్స్ ఉపయోగించడం వల్ల.. తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు అంతే. అలాగే డైట్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అలసట, బ్లోటింగ్ వంటి కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోజువారీ పనులు, ఉద్యోగం, ఇంటి పనులు అన్ని పెండింగ్ లో పడతాయి. ఈ పనులన్నీ చేసే ఓపిక కూడా నశిస్తుంది.

Kitchen Ingredients To Treat Cold And Cough!

కాబట్టి సాధారణ జలుబుతో బాధపడేటప్పుడు హోం రెమిడీస్ ప్రయత్నించడం మంచిది. ముఖ్యంగా ఎఫెక్టివ్, ఖర్చులేని, ముఖ్యంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వాటిని ఉపయోగించడం మంచిది. కాబట్టి రెండే రెండు వంటింటి వస్తువులు దగ్గు, జలుబు నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

మన పూర్వకాలం నుంచి దగ్గు, జలుబు నివారించడానికి తేనె, వెల్లుల్లి ఉపయోగిస్తున్నారు. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్ ని చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తాయి. ఈ లక్షణాల నుంచి కూడా చాలా త్వరగా.. ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. హానికారక బ్యాక్టీరియాను నివారిస్తుంది.

వీటిల్లో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు.. గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు, దగ్గును చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తాయి. కాబట్టి ఈ పవర్ ఫుల్ న్యాచురల్ మెడిసిన్స్ ని దగ్గు, జలుబు నివారించడానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..

Kitchen Ingredients To Treat Cold And Cough!

తేనె, వెల్లుల్లి సిరప్
రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్ లో వేసుకుని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. దీన్ని రోజంతా తీసుకుంటూ ఉండాలి. అప్పడప్పుడు గ్యాప్ ఇస్తూ.. దీన్ని తీసుకుంటూ ఉంటే.. దగ్గు నుంచి.. వెంటనే ఉపశమనం పొందవచ్చు.

Kitchen Ingredients To Treat Cold And Cough!

తేనె, వెల్లుల్లి టీ
ఈ రెండు పదార్థాలు.. సాధారణ జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. హానికారక బ్యాక్టీరియా నివారించడంలోనూ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్ మళ్లీ రాకుండా అరికడుతుంది. ఒక గ్లాసు మరుగుతున్న నీటిలో వెల్లుల్లి రెబ్బ వేయాలి. కొద్దిసేపు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. కొన్ని టీస్పూన్ల తేనె కలపాలి. ఇప్పుడు దాన్ని వడకట్టి.. వేడివేడిగా తాగుతూ ఉంటే.. వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాలన్నీ మాయమవుతాయి.

Kitchen Ingredients To Treat Cold And Cough!

ఈ రెండు పద్ధతులను ఉపయోగించే సాధారణ దగ్గు, జలుబు నుంచి త్వరిత ఉపశమనం పొందండి. వీటిని రోజంతా తాగుతూ ఉంటే.. దగ్గు, జలుబు తగ్గడంతో పాటు, ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువ కాకుండా.. నివారించవచ్చు.

English summary

2 Kitchen Ingredients To Treat Cold And Cough!

2 Kitchen Ingredients To Treat Cold And Cough! Take a look at the 2 simple, yet powerful, ways in which you can consume these 2 ingredients for best results.
Story first published:Tuesday, June 14, 2016, 15:19 [IST]
Desktop Bottom Promotion