For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలో రక్తం గడ్డ కట్టడాన్ని నివారించే 7 హెర్బ్స్ అండ్ స్పైసీస్

|

ధమనలు లేదా సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్ల హార్ట్ స్టోక్ లేదా హార్ట్ డిసీజ్ కు కారణమవుతుంది. అలాగే బాడీలో ఇంటర్నల్ బ్లీడింగ్ లేదా ఇంటర్నల్ గా రక్తప్రసరణ సరిగా జరగకపోతే , ప్రాణాంతకంగా మారుతుంది. శరీరంలో సిరలు లేదా ధమనుల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారించడానికి కొన్ని నేచురల్ హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి .

శరీరంలో బ్లడ్ క్లాట్ ఏర్పడినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి ? క్లాట్స్ ఏర్పడి ప్రదేశాన్ని బట్టి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. ధమనులు లేదా సిరల్లో రక్తం గడ్డకట్టినప్పుడు బాడీలో రక్త ప్రసరణ సరిగా జరగదు. దాంతో శరీరంలో కొన్ని అవయవాలకు రక్తం సరిగా సరఫరా జరగదు. దాంతో ఆ ప్రదేశంలో వాపు రావడం, నొప్పిగా ఉండం వంటి లక్షణాలు కనబడుతాయి. వెంటనే చికిత్స తీసుకోకపోతే ప్రాణానికి ప్రమాధం.

అదృష్టవశాత్తూ, ఇటువంటి ప్రాణాంతక సమస్యను నివారించుకోవడానికి కొన్నినేచురల్ రెమెడీస్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత నివారించుకోవడం కంటే..ఇటువంటి ప్రాణాంతక వ్యాధలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది . బ్లడ్ క్టాట్స్ ను నివారించడానికి కొన్ని ముఖ్యమైన హెర్బ్స్ అండ్ స్పైస్ ను మీకోసం పరిచయం చేస్తున్నాము . ఇవి సిరలు లేదా ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. ఇంకా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన హెర్బ్స్ అండ్ స్పైసీస్ ను వివిధ రకాల మెడిసిన్ తయారీలో మరియు థెరఫీలలో వినియోగిస్తున్నారు. ఈ హెర్బ్స్ అండ్ స్పైసీస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ స్పైసీస్ అండ్ హెర్బ్స్ రక్తంను పల్చగా మార్చే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. హార్ట్ హెల్త్ ను హెల్తీగా మెయింటైన్ చేయడం మంచిది. ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో మరియు బ్లడ్ క్లాటింగ్ సమస్యతో బాధపడుతున్నట్లైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. అలాగే నేచురల్ రెమెడీస్ ను ఉపయోగించడానికి ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. మరి బ్లడ్ థిన్నింగ్ హెర్బ్స్ అండ్ స్పైసీస్ ఏంటో తెలుసుకుందాం..

అల్లం

అల్లం

అల్లంలో గొప్ప ఔషధ గుణాలున్నాయి. ఇవి చాలా ఎఫెక్టివ్ గా బ్లడ్ క్లాట్స్ ను నివారిస్తాయి . అలాగే ప్రాణాంతక వ్యాధులైన స్ట్రోక్ లేదా హార్ట్ డిసీజ్ లను దూరం చేస్తుంది.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్కలో బ్లడ్ థిన్నింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఈ మసాల దినుసు రక్తం గడ్డ కట్టకుండా నివారిస్తుంది.. అలాగే ఇదివరకే ధమనులు, సిరల్లో ఏర్పడ్డ బ్లడ్ క్లాటస్ ను కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మసాలా దినుసులు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిందే..

కేయాన్ పెప్పర్:

కేయాన్ పెప్పర్:

కేయాన్ లో ఉండే థెరఫిటిక్ లక్షణాల వల్ల దీన్ని ప్రపంచ మొత్తంగా ఉపయోగిస్తున్నారు. అందులో ఒకటి బ్లడ్ క్లాట్స్ ను దూరం చేయడం. కేయాన్ పెప్పర్ లో ఉండే ఈ ఔషధ గుణాల వల్ల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

పసుపు

పసుపు

బ్లడ్ క్లాట్స్ ను నివారించడంలో నేచురల్ రెమెడీ పసుపు. పసుపులో చెప్పలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు బ్లడ్ థిన్నింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.కాబట్టి, పసుపును రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే బ్లడ్ క్లాట్స్ నివారించుకోవచ్చు. ఈ వండర్ ఫుల్ పవర్ ఫుల్ హెర్బ్, దాదాపు అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

పుదీనా:

పుదీనా:

పుదీనాలో విటమిన్ కె పుష్కలంగా ఉంది. ఇది బ్లడ్ క్లాట్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుది. ఈ రిమార్కబుల్ హెర్బ్ బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. హార్ట్ ను హెల్తీగా ఉంచుతుంది. ఇది బ్లడ్ క్లాట్స్ ను నేచురల్ గా తొలగిస్తుంది, కాబట్టి, దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి

ఓరిగానో:

ఓరిగానో:

బ్లడ్ థిన్నింగ్ ప్రొపర్టీస్ కలిగిన మరో హెర్బ్ ఓరిగానో. గడ్డ కట్టిన రక్తం కరిగించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. బ్లడ్ క్లాట్ నివారించడంలో ఫర్ఫెక్ట్ నేచురల్ రెమెడీ!

 థైమ్:

థైమ్:

బాడీలో ఇంటర్నల్ బ్లడ్ క్లాట్స్ ను కరిగించే హెర్బ్స్ లో థైమ్ ఒకటి. ఈ వెజిటేరియన్ హెర్బ్ లో ఉండే కొన్ని ఎఫెక్టివ్ గుణాలు కొలెస్ట్రాల్ లెవల్స్ ను కూడా తగ్గిస్తుంది.

English summary

7 Herbs And Spices That Can Prevent Blood Clots

7 Herbs And Spices That Can Prevent Blood Clots,Formation of blood clots in the veins or arteries can increase the risk of a stroke or a heart disease. In other words, these internal clumps of blood can lead to life-threatening situations. There are natural remedies that you could try to prevent the formation
Story first published: Friday, September 2, 2016, 13:32 [IST]
Desktop Bottom Promotion