For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్రకు భంగం కలగకూడదనుకుంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే...

|

ఈ యాంత్రిక జీవనశైలిలో వర్క్ ప్రెజర్, ఫ్యామిలీ కమిట్మెంట్, ఫైనాన్స్ మరియు మరికొన్ని ఇతర కారణాల వల్ల నిద్రను కోల్పోతున్నారు. తగినంత నిద్రలేకుంటే మానసిక, శారీరక సమస్యలు తప్పవు. నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలు తప్పవు. నిద్రలేమి చాలా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎంత బిజీ జీవితమైన నిద్ర కోసం కొన్ని గంటలు కేటాయించకపోతే మానసిక ప్రశాంతత దూరమవుతుంది. అనేక వ్యాధులు దరిచేరే ప్రమాదం ఉంది.

మానసిక ఒత్తిళ్ళు నిద్రకు శత్రువులు. అనవసర ఆందోళనలు ప్రతికూల ఆలోచనలు నిద్రాదేవిని దూరం చేస్తాయి. సానుకూల దృక్పథం, సర్దుబాటు తత్వం అలవరచుకుంటే మనలో ప్రశాంతత ఏర్పడుతుంది. నిద్ర సరిగా రాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటిలో ఒకటి మానసిక ఆందోళన. ఒత్తిడికి గురయ్యేవారు కూడా సరిగా నిద్రపోలేరు. అనారోగ్యం, శరీరంలో ఏదైనా ఒక భాగంలో నొప్పులు లేదా భారీకాయం వంటి అంశాల వల్ల సరిగ్గా నిద్రపట్టదు. అటువంటి సమస్యలకు తోడు మానసిక ఆదుర్దా, అతి ఆలోచనలు కలిగి ఉంటే నిద్రలేమి ఏర్పడుతుంది. ఇటు వంటి అసౌకర్యాలను వీలైనంత త్వరగా దూరం చేసుకోవాలి.

నిద్రకు ఉపక్రమింపచేసే 13 ఆశ్చర్యకరమైన ఆహారాలు

మరో ముఖ్యం కారణం కూడా ఉంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగకపోయినా నిద్రపట్టదు. జీర్ణక్రియ తీవ్రస్థాయిలో జరుగుతున్నప్పుడు నిద్రరావటం కష్టం.అంతే కాదు మనం తీసుకొనే ఆహారాలు కూడా మన నిద్ర మీద ప్రభావం చూపుతుంది. కొన్ని రకాల ఆహారాలు నిద్రను ప్రోత్సహిస్తే, మరికొన్ని ఆహారాలు ముఖ్యంగా జంక్ ఫుడ్స్ లేదా కెఫిన్ వంటివి నిద్రలేమి సమస్యలకు దారితీస్తుంది.

రాత్రిపూట ఫాలో అవ్వాల్సిన సింపుల్ అండ్ హెల్తీ డైట్

ప్రతి ఒక్కరికీ రోజుకు 7-8గంటల నిద్ర అవసరం అవుతుంది. సరిపడా నిద్రపోవడం వల్ల స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ ఉత్పత్తి కాకుండా ఉంటుంది. నిద్రలో ఉన్నప్పుడు శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి మనం తినే ఆహారం మరియు స్లీపింగ్ హ్యాబిట్స్ మీద ఏకాగ్రత కలిగి ఉండటం వల్ల మనం హెల్తీ లైఫ్ ను పొందవచ్చు. కొన్ని నిద్రపట్టకుండా చేసే ఆహారాలను తెలుసుకొని వాటికి దూరంగా ఉండటం వల్ల మంచి నిద్రను పొందుతారు . రి ఆ ఆహారాలేంటో తెలుసుకుందాం....

 కెఫిన్ :

కెఫిన్ :

కెఫిన్ బ్రెయిన్ మీద ప్రభావం చూపుతుంది, ఇది మనకు నిద్రపట్టకుండా చేస్తుంది. నిద్రించడానికి 5 గంటలు ముందు నుండే ఇది పనిచేస్తుంది. కాబట్టి అత్యవసరం పరిస్థితిలో తప్ప మిగిలిన సమయాల్లో సాయంత్ర కెఫిన్ తీసుకోవడా నివారించాలి. అలాగే పోస్ట్ డిన్నర్ తర్వాత కూడా నివారించుకోవాలి.

 స్పైసీ ఫుడ్స్:

స్పైసీ ఫుడ్స్:

స్పైసీఫుడ్స్ అతి కారంగా ఉన్న ఆహారాలు, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు, కారంగా ఉన్న సాస్ ఫుడ్స్, కారంగా ఉన్న పెప్పర్ ఫుడ్ తినడం వల్ల కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. ఈ నిరుపయోగకరమైన ఆహారాలను రాత్రి నిద్రించే ముందు తినకపోవడం వల్ల మీకు మంచి నిద్ర పట్టవచ్చు. కావట్టి ఎక్కువ కారం ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి.

 రెడ్ మీట్:

రెడ్ మీట్:

రాత్రి సమయంలో మాంసాహారాన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. అయితే పూర్తిగా నిలిపివేయడం కంటే ఈ ప్రోటీన్ ఫుడ్ ను తగిన మోతదాలో తీసుకోవడం మంచిది. అది కూడా లేట్ నైట్ కాకుండా త్వరగా తీసుకొంటే ఆరోగ్యానికి మంచిది. మాంసాహారం తీసుకొన్న తర్వాత వేడి నీళ్ళు లేదా వేడి పాలను త్రాగి నిద్రించడం వల్ల అటు జీర్ణశక్తికి ఇటు మీ గాఢ నిద్రకు ఎటువంటి భంగం కలగదు.

జంక్ ఫుడ్స్:

జంక్ ఫుడ్స్:

నిద్రకు ఉపక్రమించే ముందు జంక్ ఫుడ్స్ బర్గర్, లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్ వంటివి తినడం వల్ల జీర్ణవ్యవస్థ మందగించి జీర్ణం కావడం చాలా కష్టంగా మారి నిద్ర సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి నిద్రకు ముందు వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది.

చాక్లెట్స్:

చాక్లెట్స్:

చాక్లెట్స్ హెల్తీ ఫుడ్దే అయినా, ఇందులో ఎక్కువ ప్రయోజనాలున్నా...ఇందులో షుగర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల రాత్రుల్లో నిద్రించడానికి ముందు తీసుకోకపోవడం మంచిది.

ఐస్ క్రీమ్:

ఐస్ క్రీమ్:

గ్రీసీ ఫుడ్స్, అంటే క్రీమ్(ఐస్ క్రీమ్స్), ఆయిల్, ఫ్యాట్ ఫుడ్స్, రాత్రి సమయంలో తినడం మానేయాలి. వీటిని రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల మిమ్మల్ని అలసటకు గురిచేయడమే కాకుండా మరుసటి రోజు ఉదయానికి బద్దకస్తులుగా మార్చుతుంది. కడుపులో వీటివల్ల వికారం ఏర్పడి, విరేచనాలకు దారితీస్తుంది. బరువు పెరగడానికి దారితీసి ఆ ఫ్యాట్ ఫుడ్ ను నిద్రకు ముందు తీసుకోకపోవడం చాలా మంచిది.

పండ్లు:

పండ్లు:

ఫ్రూట్స్ డిజర్ట్ కు ఒక మంచి ఎంపికే అయినా, ఇది నిద్ర మీద ఎఫెక్ట్ ను చూపుతుంది . పండ్లలో ఉండే షుగర్ నిద్రలేమికి దారితీస్తుంది.

 పాస్తా:

పాస్తా:

ఫాస్ట్ ఫుడ్ సంబంధించిన పాస్తా పిండితో కూడినటువంటి ఆహారం. ఒక రకమైనటువంటి నిశితమైన ధాన్యంతో తయారు చేయబడిన పాస్తా తినడం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకొని, నిద్రకు అంతరాయ్యం కలిగిస్తుంది. కాబట్టి నిద్రించే ముందు వీటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో సల్ఫర్ నిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల దీనిలో వాసన కూడా చాలా ఘాటుగా ఉంటుంది. ఇలాంటి ఘాటైన మసాల దినుసులు, వెల్లుల్లి రాత్రి సమయంలో తినడం వల్ల శరీరంలో వేడి పుట్టి రక్తంలో హెచ్చుతగ్గులు ఏర్పడుతుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థ నిదానంగా జరిగి తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకొని గాస్ట్రిక్ కు దారితీస్తుంది. కాబట్టి రాత్రి సమయంలో వెల్లుల్లికి దూరంగా ఉండటమే మంచిది.

చీజ్:

చీజ్:

చీజ్ ఫ్యాట్స్ తో నిండి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు అసౌకర్యం కలిగిస్తుంది . కాబట్టి దీన్ని నిద్రించడానికి ముందు తినకుండా ఉండటమే మంచిది.

క్యాండీ బార్స్/ షుగర్ స్వీట్స్/మిఠాయి:

క్యాండీ బార్స్/ షుగర్ స్వీట్స్/మిఠాయి:

షుగర్ స్వీట్స్ లో హైకార్బొహైడ్రేట్స్ కాబడి ఉంటాయి. వీటిని తినడం వల్ల కడుపు ఫుల్ గా అనిపించక చాలా తింటారు. చాక్లెట్స్, కేక్స్ తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దాంతో శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దాంతో నిద్రాభంగిమ కలుగుతుంది. కాబట్టి కేక్, కుక్కీస్, ఇతర డిసర్ట్స్ కు దూరంగా ఉండటం చాలా శ్రేయస్కరం.

ఆల్కహాల్:

ఆల్కహాల్:

చాలా మంది రాత్రి సమయంలో మద్యపానం సేవించడం వల్ల మంచి నిద్ర పడుతుందనుకుంటారు కానీ అది తప్పు. మద్యం నిద్రకు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండి, ఎక్కువ సార్లు రెస్ట్ రూమ్ కు పోయేలా చేసి నిద్రకు భంగం కలిగిస్తుంది. అతిగా మద్యపానం, నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి నిద్రించే ముందు మితంగా తీసుకోవడం మంచిది.

ఎనర్జీ బార్స్:

ఎనర్జీ బార్స్:

ఎనర్జీ బార్స్ లో ఎక్కువగా షుగర్ కంటెంట్ ఉంటుంది. ఇది శరీరానికి ఎక్స్ ట్రా ఎనర్జీని అందిస్తుంది . నిద్రించే సమయంలో వీటిని తీసుకోవడం వల్ల నిద్రపట్టకుండా చేస్తాయి.

నట్స్:

నట్స్:

ఇది ఒక ఐడియల్ మిడ్ నైట్ స్నాక్ అయినా, వీటిలో ఫ్యాట్ కంటెంట్ ఉండటం వల్ల హార్ట్ బర్న్ మరియు నిద్రలేమికి కారణం అవుతుంది.

లెట్యుస్:

లెట్యుస్:

లెట్యుస్ ఆరోగ్యానికి మంచిదే, కానీ దీన్ని రాత్రుల్లో తినడం వల్ల కడుపుబ్బరానికి దారితీస్తుంది . ఇది నిద్రమీద ప్రభావం చూపుతుంది.

English summary

Avoid These 15 Foods Before Sleep

Avoid These 15 Foods Before Sleep, Work pressure, family commitment, finances, etc, are some of the reasons we usually tend to loose sleep, so the last thing we want us to cause the stressful night is our dining options.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more