For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైబిపి ఉన్న వారు ఖచ్చితంగా తినకూడని కొన్ని ఆహారాలు

|

హైబ్లడ్ ప్రెజర్ సైలెంట్ కిల్లర్ . ఇది సెడన్ గా వస్తుంది. వస్తువస్తూనే వివిధ రకాల అనారోగ్య సమస్యలను వెంటబెట్టుకుని వస్తుంది. ప్రస్తుత రోజుల్లో హైబ్లడ్ ప్రెజర్ తో బాధపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. హైబ్లడ్ ప్రెజర్ లక్షణాలున్నా చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. బ్లడ్ ప్రెజర్ లేదా అధిక రక్తపోటు అనేది తీవ్రంగా పరిగణించాల్సిన వ్యాధి. అధిక రక్తపోటులో రక్తనాళాలలో రక్తం నిరంతరం అధికమవుతుంది. అధిక రక్తపోటుకు కారణాలు అనేకం ఉంటాయి. ఒత్తిడి, ఉప్పు అధికంగా తినటం, డాయాబెటీస్ వంటివి అధిక ర్తపోటుకు కారణాలుగా చెప్పవచ్చు. అధిక రక్తపోటు ఉంటే, గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.

సాల్ట్(ఉప్పు)బ్లడ్ ప్రెజర్ ను పెంచుతుందన్న విషయం మనందరికి తెలిసిన విషయమే. మీరు మీ జీవిత కాలం పాటు ఆరోగ్యంగా ఎక్కువ రోజులు జీవించాలనుకుంటే తప్పనిసరిగా మీ డైట్ నుండి సాల్ట్ ఫుడ్స్ ను తినడం తగ్గించాలి. లేదా ఉప్ప వాడకాన్ని తగ్గించాలి. బ్లడ్ ప్రెజర్ ను అధికంగా పెంచడం ఉప్పు కాక, మరికొన్ని ఇతర ఆహారాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనం రెగ్యులర్ గా తినేటటువంటి ఆహారాలే అయ్యుండటం గమనించదగ్గ విషయం.

అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు బ్లడ్ ప్రెజర్ ను పెంచుతాయాని కనుగొన్నారు. రోజంతా మీలో రక్తపోటు అంధికంగా ఉంటే, మీరు సరైన ఆహారనియమాలు పాటించడం లేదని గుర్తించాలి. ఎవరైతే హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నారో, వారు ఈ రీసెర్చ్ ద్వారా నిరూపించబడ్డ ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ నుండి నివారించాల్సి ఉంటుంది.

ప్రొసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి:

ప్రొసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి:

హైబిపితో బాధపడే వారు హైసోడియం ఫుడ్స్, ప్రొసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. క్యాన్డ్ ఫుడ్స్ లో సోడియం కంటెంట్ అధికంగాఉంటుంది. కాబట్టి, హైబిపితో బాధపడే వారు ప్రొసెస్ చేసిన మరియు క్యాన్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

ఆల్కహాల్:

ఆల్కహాల్:

హైబ్లడ్ ప్రెజర్ తో బాధపడే వారు ఆల్కహాల్ తీసుకోవచ్చని ఎలా అనుకుంటారు? ఆల్కహాల్ బ్లడ్ వెజల్స్ యొక్క వాల్స్ ను డ్యామేజ్ చేస్తాయి. అందువల్ల బ్లడ్ ఫ్లో మెరుగ్గా ప్రసరించాలంటే, ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి.

ఉప్పు:

ఉప్పు:

సోడియంను ఎక్కువగా తీసుకోవడం, మరియు నేరుగా తినడం వల్ల నేరుగా రక్తనాళాల మీద ప్రభావం చూస్తుంది. గుండెకు రక్త ప్రసరణ మెరుగ్గా ఉండేట్లు చూసుకోవాలి. ఉప్పును నేరుగా తీసుకోకుండా కూరల్లో వండేటప్పుడు మాత్రమే వినియోగించుకోవాలి.

రెడ్ మీట్ :

రెడ్ మీట్ :

హైబ్లడ్ ప్రెజర్ తో బాధపడే వారు ట్రాన్స్ ఫ్యాట్ ను తీసుకోవడం నివారించాలి . ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్స్ లో రెడ్ మీట్ ఒకటి . ఇందులో ఫాలీ అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్ ఉండటం వల్ల రక్త నాళాల యొక్క వాల్స్ లో ఫ్యాట్ చేరుతుంది. దాంతో రక్తనాళాల్లో రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ రెడ్ మీట్ కు దూరంగా ఉండటం మంచిది . దాంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది

షుగర్ :

షుగర్ :

హైబ్లడ్ ప్రెజర్ కు ముఖ్య కారణం ఓబేసిటి. రోజూ షుగర్, షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువు పెరుగుతారు . బరువు ఎక్కువ పెరగడం వల్ల హార్ట్ కు రక్త ప్రసరణ సరిగా జరగదు . రక్తప్రసరణ ఆలస్యమవుతుంది . రోజులో మీరు తీసుకునే షుగర్ , షుగర్ ఫుడ్స్, షుగర్ బెవరేజెస్ కు దూరంగా ఉండాలి.

బాటిల్ పికెల్స్ :

బాటిల్ పికెల్స్ :

పికెల్స్ లో క్యాలరీలు తక్కువ, కానీ వీటిని నిల్వ చేయడానికి ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాబట్టి, వీటిని తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ నార్మల్ లెవల్స్ కంటే ఎక్కువ పెరగడానికి బాటిల్ పికిల్ కూడా ఒక కారనం . కాబట్టి, హై సోడియం ఫుడ్స్ ను తినకుండటమే మంచిది.

సీఫుడ్స్ :

సీఫుడ్స్ :

సీఫుడ్స్ లో సోడియం అధికంగా ఉంటుంది. ప్రాన్స్, స్క్విడ్స్ , క్లామ్స్ వంటి వాటిలో సోడియం కంటెంట్ అధికంగా ఉంటుంది. వీటిలో ఉండే ఫాస్పరస్, పొటాషియం లు సోడియంగా మారడం వల్ల హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడే వారికి సీఫుడ్ అంత మంచిది కాదు.

ఫ్రోజోన్ ఫుడ్స్ :

ఫ్రోజోన్ ఫుడ్స్ :

ఫ్రోజోన్ ఫుడ్స్ హైబ్లడ్ ప్రెజ్ ఆహారపదార్థాలుగా చెప్పబడుతున్నది . ఈ ఫ్రోజోన్ ఫుడ్స్ లో అధనంగా సోడియం కలిగి ఉంటుంది.అధిక సోడియం ఉన్న ఫ్రోజోన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలున్నాయి.

ఫ్రెంచ్ ఫ్రైస్

ఫ్రెంచ్ ఫ్రైస్

థియేటర్లో సినిమా చూడాలంటే పొటాటో చిప్స్ లేదా పోటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ చేతిలో ఉండాల్సిందే?హైబ్లడ్ ప్రెజర్ ను పెంచే ఆహారాల్లో ఇది ఒక ఫుడ్ . ఫ్రెంచ్ ఫ్రైస్ లో ఫ్యాట్ మరియు సోడియం అధికంగా ఉంటుంది.

డోనట్స్

డోనట్స్

డోనట్స్ రోజూ లేదా వారానికొకసారైనా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇదుంలో ఎక్కువ ఫ్యాట్ మరియు అధిక క్యాలరీలు కలిగి ఉంటాయి . ఇవి మీ బీపిని మరింత పెంచుతాయి.

న్యూడిల్స్ :

న్యూడిల్స్ :

బ్యాచులర్స్ కు ఒక ఫేవరెట్ ఫుడ్ నూడిల్స్. తినడానికి టేస్టీగా మరియు తయారుచేయడానికి సులభంగా ఉంటాయి నూడిల్స్. అయితే, హైబ్లడ్ ప్రెజర్ ను పెంచే వరెస్ట్ ఫుడ్స్ లో నూడిల్స్ కూడా ఒకటి. ప్యాకెట్ లో ఉండే ఈ నూడిల్స్ లో ఎక్కువ సోడియం జోడించి ఉంటుంది.

ప్రొసెస్డ్ మీట్:

ప్రొసెస్డ్ మీట్:

ప్రొసెస్డ్ మీట్స్ చాలా వరెస్ట్ ఫుడ్స్. ఇది హై బ్లడ్ ప్రెజర్ ను అమాంతంగా పెంచుతాయి. అందుకు ముఖ్య కారణం వాటిలో పూర్తిగా కెమికల్ ప్రిజర్వేటివ్స్ కలిగి ఉంటాయి.

English summary

Avoid These Foods If You Are Suffering From Blood Pressure

Avoid These Foods If You Are Suffering From Blood Pressure, Avoid These Foods If You Are Suffering From Blood Pressure,High blood pressure is one of those silent creepers that appears suddenly and then brings with it a lot of health ailments. Today, maximum people suffer from high blood pressure and many of them also ignore it.
Desktop Bottom Promotion