For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యవంతమైన ఆహారాలే అయినప్పటికీ, శరీరంలో వాపులు వస్తాయి...

|

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ జీవించాలంటే అందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అంతే కాదు, ఆరోగ్యంగా జీవించాలన్నా...ఆరోగ్యంగా బరువు తగ్గించుకోవాలన్నా ...బరువు పెరగాలన్నా ఫుడ్స్ బాగా సహాయపడుతాయి. అయితే ఏలాంటి ఆహారాలు మిమ్మల్ని లావుగా మారుస్తున్నాయి...ఎలాంటి ఆహారాలు మిమ్మల్ని స్లిమ్ గా మరియు ఫిట్ గా మారుస్తున్నాయో తెలుసుకోవాలి . బరువు పెరగడం అనేది దాచిపెట్టాల్సి విషయం కాదు, శరీరం అదంతట అదే బరువు పెరుగుతుంటుంది.

మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాలే మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. వాటిలో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు బరువును తగ్గిస్తాయి, అయితే మనం అనుకొన్న దానికంటే ఎక్కువ పనిచేయకపోవడాన్ని, లేదా వాటి ప్రభావం మరో విధంగా ఉంటే వెంటనే గుర్తించాలి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేయడానికి బదులుగా సైలెంట్ గా శరీరంలో వాపులు మరియు నడుము చుట్టూ ఫ్యాట్ చేరడం మరియు శరీరం మొత్తం ఫ్యాట్ తో అధిక బరువుకు దారితీస్తాయి.

ఈ ఆహారాలు మనం రెగ్యులర్ గా తినే హెల్తీ ఫుడ్సే అయినా, వీటిలో టాక్సిన్స్ మరియు అంతర్గతంగా ప్రేగులకు అలర్జీ కలిగించేవి మరియు బరువు పెంచే అలర్జియన్స్ ను కలిగి ఉంటాయి. చాలా వరకూ ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల వారికి తెలియకుండానే అలర్జీలకు గురి అవుతుంటారు. సహజంగా ఈ ఆహారాలు నార్మల్ హార్మోనుల ఫంక్షన్స్ ను డిస్టర్బ్ చేస్తుంటాయి. అంతే కాదు మెటబాలిక్ రేట్ ను తగ్గిస్తాయి. ఫలితంగా శరీరంలో ఫ్యాట్ చేరుతుంది.

కాబట్టి శరీరాన్ని నిరంతరం వాపులకు గురి చేస్తూ అధిక బరువు ఉన్నట్లుగా కనిపించేలా చేసే ఈ ఆహారాలకు మీ రెగ్యులర్ డైట్ నుండి టర్మినేట్ చేస్తూ వాటికి స్థానంలో ప్రత్యామ్నాయ ఆహారాలను తీసుకోవాలి. మరి బాడీ స్వెల్లింగ్ కు కారణం అయ్యే ఆహారాలేంటో చూద్దాం...

1.పీనట్ బట్టర్:

1.పీనట్ బట్టర్:

ఆరోగ్యానికి పీనట్స్ చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. కానీ పీనట్స్ లో కొన్ని రకాల ఫంగస్ ఉంటుందని మీకు తెలుసా? ఈ ఫంగస్ బాడీ క్యాలరీలు కరిగించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా అలర్జీ మరియు ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది ఫలితంగా బరువు పెరుగుతారు.

2.పీనట్స్ కు ప్రత్యామ్నాయంగా:

2.పీనట్స్ కు ప్రత్యామ్నాయంగా:

పీనట్ బట్టర్ కు ప్రత్యామ్నాయంగా బాదం బట్టర్ బెటర్ గా ఉంటుంది. ఇందులో న్యూట్రీషియన్స్ మరియు అమినో యాసిడ్స్, ఎల్ -ఆర్జిన్స్ అధికంగా ఉన్నాయి . ఈ న్యూట్రీషియన్స్ హ్యోమన్ గ్రోత్ ఆర్గాన్స్ ను శరీరంలో పెంచుతుంది. ఇది మెటబాలిజంను ప్రోత్సహిస్తుంది. దాంతో లీన్ మజిల్స్ ను పొందవచ్చు.

3.రిఫైండ్ వెజిటేబుల్ ఆయిల్:

3.రిఫైండ్ వెజిటేబుల్ ఆయిల్:

మనం రెగ్యులర్ గా వంటలకు ఉపయోగించే నూనెలు 40శాతం బరువు పెరగడానికి కారణం అవుతాయని మీకు తెలుసా? ఈ రిఫైండ్ ఆయిల్స్ లో ఉండే టాక్సిన్ వల్ల బాడీ ఇన్ఫ్లమేషన్ కు కారణం అవుతాయి. ఈ నూనెలు హార్మోనుల ఉత్పత్తికి అంతరాయం కల్పిస్తుంది. మరియు మెటబాలిజం ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది.

4.రిఫైండ్ ఆయిల్స్ కు ప్రత్యామ్నాయంగా:

4.రిఫైండ్ ఆయిల్స్ కు ప్రత్యామ్నాయంగా:

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఆలివ్ ఆయిల్, కోకనట్ ఆయిల్ మరియు మస్టర్డ్ ఆయిల్ ను ఉపయోగించుకోవచ్చు . ఈ నూనెలో రిఫైన్ చేయబడవు మరియు వీటిలో టాక్సిన్స్ అనేటివి ఉండవు . ఈ నూనెలు మీకు బరువు తగ్గించుకోవడానికి మాత్రమే కాదు శరీరంలో అవయవాలు మరింత హెల్తీగా మరియు మెటబాలిక్ రేటును మెరుగుపరుస్తాయి.

5.తృణధాన్యాలు:

5.తృణధాన్యాలు:

తృణధాన్యాలు కూడా బరువు పెరగడానికి కారణం అవుతాయి. కానీ తృణధాన్యాలలో ఉండే గులిటిన్ అలర్జీకి కారణం అయ్యే వారిలో మాత్రమే ఈ సమస్యను ఎదుర్కొంటారు. తృణధాన్యాలలో ఉండే గులిటిన్ ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ కు కారణం అవ్వడంతో పాటు మెటబాలిజంను తగ్గిస్తుంది. ముఖ్యంగా అలర్జీకు కారణం అయ్యే వారిలో బరువు పెరగడం మరియు హార్మోనుల సమస్యలు తలెత్తుతాయి.

6.తృణధాన్యాలకు ప్రత్యామ్నాయంగా:

6.తృణధాన్యాలకు ప్రత్యామ్నాయంగా:

తృణధాన్యాలు తిన్నప్పుడు కడుపుబ్బరంగా ఉండటం మరియు ఇతర హెల్త్ సమస్యలున్నప్పుడు గోధుమపిండి లేదా ఇతర తృణధాన్యాలు తీసుకోవడం మానేయాలి. గులిటిన్ కంటెంట్ కు అలర్జీకి గురి అవుతున్నట్లైతే తృణధాన్యాలకు ప్రత్యామ్నాయంగా ఓట్స్ తీసుకోవడం మరింత ఆరోగ్యకరం.

7.ఆర్టిఫిషియల్ షుగర్స్:

7.ఆర్టిఫిషియల్ షుగర్స్:

జీరోక్యాలరీ షుగర్స్ బరువు పెరగడానికి మరియు డయాబెటిక్ కాంట్రరీకి పాయిజినస్ గా నమ్ముతారు . కాబట్టి, జీరో క్యాలరీలతో తయారుచేసిన ఆహారాలన్నింటికి దూరంగా ఉండాలి. ఇవి క్సిలిటోల్ అనే కంటెంట్ ఉత్పత్తి అవ్వడంతో శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ కు అంతరాయం కలిగిస్తుంది. ఫలితంగా డయాబెటిస్, ఇన్ఫ్లమేసన్ మరియు బరువు పెరగడానికి కారణం అవుతుంది.

8.ఆర్టిఫిషియల్ షుగర్స్ కు ప్రత్యామ్నాయంగా హనీ:

8.ఆర్టిఫిషియల్ షుగర్స్ కు ప్రత్యామ్నాయంగా హనీ:

ఆర్టిఫిషియల్ షుగర్స్ కు ప్రత్యామ్నాయంగా తేనె, షుగర్ కేన్, డేట్స్ మొదలగు వాటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వీటిలో ఉండే నేచురల్ షుగర్స్ ఇన్సులిన్ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయం కలిగించవు.

English summary

Healthy Foods That Cause Your Body To Swell Up

There are some foods that have earned a good reputation in the health industry and are considered as weight loss foods, but to our dismay these foods are not what we think they are. These foods silently cause your body to swell and also cause fat to accumulate around the waistline and the whole body.
Story first published: Tuesday, January 19, 2016, 15:53 [IST]
Desktop Bottom Promotion