Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
వామ్మో..!! నడుమునొప్పి అని ఫీలవుతున్నారా ?
ఉదయం లేచిన దగ్గర నుంచి మహిళలకు ఉరుకులు పరుగులే. నిద్రలేవగానే.. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని.. ఆఫీసులకు పరుగులు పెట్టాలి. అక్కడికి వెళ్లింది మొదలు.. దాదాపు 8 నుంచి 10 గంటల సేపు నిర్విరామంగా కూర్చుని వర్క్ చేయాల్సిందే. అందులోనూ.. కంప్యూటర్లలో చూసి వర్క్ చేయాల్సిన పరిస్థితి.
ఇలా ఎక్కువసేపు కదలకుండా.. కూర్చోవడం వల్ల మహిళలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అన్నింటికన్నా ఎక్కువగా వేధిస్తున్న సమస్య నడుంనొప్పి. తరచుగా ఈ సమస్యతో సతమతమవుతున్నారు మహిళలు. కొన్ని సందర్భాల్లో ఇది ఎక్కువ అవడం వల్ల.. అటు ఇటు కదలలేని పరిస్థితులు కూడా ఫేస్ చేస్తున్నారు. దీనికోసం ఏవో పెయిన్ కిల్లర్స్, క్రీమ్ లు వాడినా.. ఫలితం అంతంతమాత్రంగానే ఉంటోంది.

అల్లంను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న పాత్రలో కొన్ని నీళ్లు తీసుకుని బాగా మరిగించాలి. అందులో అల్లం ముక్కలు వేసి.. 10 నిమిషాలు కాంచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లార్చి.. కాస్త తేనె కలుపుకుని తాగితే.. వెంటనే నడుం నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
నడుం నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే.. హోం రెమిడీస్ ప్రయత్నించడం మంచిది. ఒక పాత్రలో కప్పు నీరు తీసుకోవాలి. అందులో 10 తులసి ఆకుల్ని వేసి నీరు సగం అయ్యేంత వరకు మరిగించాలి. తర్వాత చల్లారనిచ్చి, వడకట్టి.. చిటికెడు ఉప్పు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నడుంనొప్పి ఉన్నప్పుడు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

నొప్పిని, వాపును తగ్గించడంలో ఐస్‌ను మించింది మరొటి లేదు. అందుకే కొన్ని ఐస్ ముక్కల్ని ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి.. దాన్ని టవల్‌లో చుట్టాలి. దీంతో నొప్పి ఉన్న ప్రాంతంలో కనీసం పదిహేను నిమిషాల పాటు ఉంచాలి. ఇలా నొప్పి తగ్గేంత వరకూ అరగంటకొకసారి చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చాలా హాయిగా అనిపిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
