For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెస్ట్ సైజ్ సెడన్ గా పెరగడానికి గల రీజన్స్ ఏంటి..?

|

అనుకోకుండా.. తమకు తెలియకుండానే తమ ఒంట్లో జరిగిపోతున్న ఈ మార్పులకు ఆ చిన్ని బుర్రలు తబ్బిబ్బై తడబడిపోతుంటే.. మరోవైపు ఈ క్రమం ఏ కాస్త ముందువెనకలైనా.. కంట్లో దీపంలా చూసుకునే తల్లిదండ్రులు విపరీతంగా మధనపడిపోతుంటారు. ఏది సహజమైన మార్పో.. ఏది అసహజమో.. ఏది జాప్యమో.. ఏది లోపమో తెలియక విపరీతమైన వేదన అనుభవిస్తుంటారు.

కాస్త ముందువెనకలు సహజం. అయితే ఎప్పుడు దేన్ని తేలికగా తీసుకోవాలి.. ఎప్పుడు త్వరగా స్పందించాలన్నది తెలియటం చాలా అవసరం. ఆడిపల్లల్లో బ్రెస్ట్ సైజ్ లో మార్పులు రావడమనేది సహాజం. కొన్ని సందర్బాలో డైట్ కారణంగా చిన్న పాటు మార్పులు జరగడం సహజం, అయితే మరికొన్ని సందర్భాల్లో ప్రెగ్నెన్సీ వంటి మేజర్ సందర్బాల్లో బ్రెస్ట్ లో మార్పుల, బ్రెస్ట్ పెద్దగా పెరగడం జరగుతుంది.

ఇటువంటి మార్పులు అందరు మహిళల్లో కనబడదు. కొందిరిలో మాత్రమే కనబడుతుంది. బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉంటేనే సౌకర్యవతంగా ఫీలయ్యే వారు చాలా మంది మహిళలు ఉంటారు. అయితే కొంత మందికి స్థనాల సైజ్ పెద్దగా ఉండాలని కోరుకుంటారు.

సహజంగా స్తనాల్లో మార్పు వస్తే ప్రమాధం లేదు కానీ, సెడెన్ గా ఉన్నట్లుండి స్తనాలు పెద్దగా మారితే మాత్రం అందుకు కొన్ని బలమైన కారణాలుంటాయి. అవేంటో ఒక సారి తెలుసుకుందాం...

బరువు పెరగడం వల్ల:

బరువు పెరగడం వల్ల:

సెడన్ గా బరువు పెరగడం వల్ల బ్రెస్ట్ లో సైజ్ పెరగుతుంది. బ్రెస్ట్ ఎన్ లార్జ్ అవుతుంది. స్తనాల్లో ఫ్యాట్ టిష్యులు పెరగడం వల్ల బ్రెస్ట్ సైజ్ ఆటోమ్యాటిక్ గా పెరుగుతుంది. బరువు తగ్గితే క్రమంగా స్తనాల సైజ్ తగ్గుతుంది.

ప్రెగ్నెన్సీ:

ప్రెగ్నెన్సీ:

మహిళ గర్భం పొందిన తర్వాత ఆమె శరీరంలో అనేక హార్మోనులు ప్రభావం వల్ల, బ్రెస్ట్ కణాలకు ఎక్కువ రక్త ప్రసరించడం వల్ల స్తనాల సైజ్ పెరుగుతుంది. గర్భిణీలు నెలలు నిండే కొద్ది శరీరం బరువు పెరగడంతో స్తనాలు కూడా పెరుగుతాయి. స్తనాల్లో ముట్టుకుంటే నొప్పి, సలుపు, వాపు వంటి లక్షణలు కనబడుతాయి. కొంత మంది మహిళలలో గర్భధారణ చివర సమయంలో ఇటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి.

 కాంట్రాసెప్టివ్ :

కాంట్రాసెప్టివ్ :

బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం వల్ల బ్రెస్ట్ సైజ్ లో మార్పులు సంభవిస్తాయి. స్తనాలు పెద్దగా పెరుగుతాయి, బర్త్ కంట్రోల్ పిల్స్ ఈస్ట్రోజ్ స్థాయిలు పెంచడం వల్ల బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది.

పబ్బరిటి(యవ్వనంలోకి):

పబ్బరిటి(యవ్వనంలోకి):

కౌమార దశ నుండి యవ్వనంలోకి మారే సమయంలో శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అదే విధంగా బ్రెస్ట్ ఎన్ లార్జ్ అవుతుంది. ఈ సమయంలో స్తనాలు పెద్దగా పెరగడం సహజం.

ఇంటర్ కోర్స్:

ఇంటర్ కోర్స్:

దంపతులు రతిలో పాల్గొన్నప్పుడు, మహిళ స్తనాల్లో బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది, హార్ట్ రేటు పెరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో స్తనాలు పెద్దగా మార్పు చెందుతాయి.

పీరియడ్స్ సమయంలో :

పీరియడ్స్ సమయంలో :

మహిళల్లో అండోత్సర్గం సమయంలో, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ లు ఎక్కువ ఉత్పత్తి అవ్వడం వల్ల స్తనాలు నిండుగా కనబడుతాయి. పెద్దగా వాపు, నొప్పితో సలుపుతాయి. అందుకు కారణం బ్రెస్ట్ ప్రదేశంలో రక్తప్రసరణ ఎక్కువగా ఉండటం. కొన్ని సందర్భాల్లో వాటర్ రిటెన్షన్ వల్ల కూడా స్తనాలు పెద్దగా కనబడుతాయి. ప్రతి అమ్మాయిలో పీరియడ్స్ కు ముందు స్తనాలు నార్మల్ సైజ్ కంటే పెద్దగా కనబడుతాయి. పీరియడ్స్ అయిన తర్వాత నార్మల్ స్థితికి చేరుకోకపోతే, వెంటనే గైనకాలజిస్ట్ ను సంప్రదించాలి.

మోనోపాజ్ :

మోనోపాజ్ :

మహిళలు మోనోపాజ్ స్థాయికి చేరుకున్నప్పుడు, బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది. ఇది ఫ్యాట్ టిష్యుల కారణంగా పెరుగుతుంది. మోనోపాజ్ దశలో ఫ్యాట్ టిష్యులు పెరగడం వల్ల స్తనాలు నార్మల్ కంటే పెద్దగా కనబడుతాయి.

బ్రెస్ట్ లంప్స్ :

బ్రెస్ట్ లంప్స్ :

స్తనాల సైజ్ లో మార్పులు కనిపించినప్పుడు, వ్యక్తిగత పరిశీల చాలా అవసరం, గడ్డలు, లేదా కణుతులు ఉన్నట్లు గమనిస్తే వెంటనే డాక్టర్ ను కలవాలి. లంప్స్ కారణంగా స్తనాలు పెద్దగా మారుతాయి. చాలా వరకూ ఇవి సీరియస్ ప్రాబ్లమ్ కాకపోయినా, లంప్స్ కారణంగా ఆ ప్రదేశంలో విపరీతమైన నొప్పి ఉంటుంది.

English summary

Reasons For Sudden Increase In Breast Size

It is quite natural to experience several changes in the size of the breasts throughout all stages of life. Sometimes, even minor changes in diet could be the reason and in some cases, major changes like pregnancy could be the reason for the increased size.
Desktop Bottom Promotion