Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
పాలు హెల్తీనే కానీ.. మోతాదు మించితే పాయిజనే..!!
పాలు ఆరోగ్యకరమైనవని అందరికీ తెలుసు. అందుకే.. పసిపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నిత్యం పాలు తాగమని సూచిస్తుంటాం. పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడకపోయినా.. బుజ్జగించి తాగించడం అలవాటు అయింది. ఎందుకంటే.. ఇందులో పోషక విలువలు మెండుగా ఉంటాయి. అలాగే.. క్యాల్షియం చాలా ఎక్కువగా పాల ద్వారా పొందవచ్చు. మరి పాలతో పొంచి ఉన్న ప్రమాదమేంటి ? పాలు ఎందుకు పాయిజన్ అంటున్నాం.. ? అని ఆలోచిస్తున్నారా ??
మేకపాలలోని ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా ?
నిజమే పాలు ఆరోగ్యానికి మంచిదే.. కానీ.. మోతాదు మించితే మాత్రం అనారోగ్య సమస్యలకు కొని తెచ్చుకున్నట్లే అని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మహిళలు ఎవరైతే.. రోజుకి మూడు గ్లాసుల కంటే ఎక్కువ పాలు తాగుతారో.. వాళ్లకు ఎముకల సమస్యలు వస్తాయని స్టడీస్ నిరూపించాయి. ఎక్కువ మోతాదులో పాలు తీసుకునే మహిళల్లో బోన్ ఫ్రాక్చర్ రిస్క్స్ ఎక్కువగా ఉంటుందని తేల్చాయి. అంతేకాదు.. త్వరగా మరణించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి.

రోజుకి మూడు కంటే ఎక్కువ గ్లాసుల పాలు తాగడం వల్ల ఎక్కువగా మహిళలకే రిస్క్. పాలలో షుగర్ కాంపౌండ్ అయిన గాలక్టోజ్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇది శరీరానికి ఎక్కువ మోతాదులో అందితే.. ఆక్సిడేషన్, ఇన్ల్ఫమేషన్ సమస్యలతో పాటు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలతో మొదలై.. త్వరగా మరణించే అంత ప్రమాదం తీసుకొస్తాయట.
కొకొనట్ మిల్క్ తో క్యాన్సర్ కి చెక్

39 నుంచి 74 వయసు మధ్య గల మహిళలపై ఈ అధ్యయనాలు చేశారు. అలాగే 49 నుంచి 74 ఏళ్ల మధ్య ఉన్న మగవాళ్లపై కూడా ఈ స్టడీస్ చేశారు. అయితే ఎక్కువగా మహిళలకే పాల నుంచి ప్రమాదం ఉందని ఈ స్టడీస్ వివరిస్తున్నాయి. మహిళల్లోనే బోన్ ఫ్రాక్చర్స్ వచ్చే ఇబ్బందులు కనిపిస్తున్నాయని నిరూపించాయి. పాలల్లో ఉండే గాలక్టోజే అసలు సమస్యలకు కారణం.

అలాగని.. పాలు తాగడం మానేయాల్సిన అవసరమా ? అంటే లేదు. ఎందుకంటే.. క్యాల్షియం, ప్రొటీన్స్, విటమిన్స్, రకరకాల పోషకాలు పాల ద్వారానే పొందగలుగుతాం. కాబట్టి రోజుకి మూడు గ్లాసులు మించకుండా.. తీసుకోవాలి. ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే.. రిస్క్ లో పడక తప్పదు. కాబట్టి.. పాలతో ప్రొటీన్స్ పొందే ప్రయత్నం చేయండి.. పాయిజన్ గా ప్రమాదాన్ని తగ్గించుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
