Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
ఆయిల్ పుల్లింగ్ వల్ల పొందే అమోఘమైన ప్రయోజనాలు
ఆయిల్ పుల్లింగ్ నోటిని శుభ్రం చేయడానికే కాదు.. ఆరోగ్యానికి కూడా మంచిదే. ఆరోగ్యపరంగా దీని ఉపయోగాలు అమోఘం. కాబట్టే మన పూర్వీకులు కూడా.. ఈ పద్ధతిని పాటించేవాళ్లు. ఈ ప్రక్రియ నోటి వరకే పరిమితం అయినప్పటికీ.. శరీరంలోపలి భాగాలను ఆరోగ్యంగా మారుస్తాయి. ఆయిల్ పుల్లింగ్ కి ఉపయోగించే నూనెల వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.
ఆయిల్ పుల్లింగ్ కి రకరకాల ఎసెన్షియల్ ఆయిల్స్ మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. వీటిని ఉపయోగించడం ఆరోగ్యానికి కూడా మంచిది. కొబ్బరినూనె, ఆలివ్ నూనె, నువ్వుల నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్ ని ఆయిల్ పుల్లింగ్ కి ఉపయోగించవచ్చు. 15 నుంచి 20 నిమిషాల ఆయిల్ పుల్లింగ్ చేస్తే చాలు.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. కాకపోతే.. వీటిని ఎట్టిపరిస్థితుల్లో మింగకూడదు.

చర్మానికి
ఆయిల్ పుల్లింగ్ వల్ల చర్మానికి మంచిదని చాలా మందికి తెలియదు. ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల చర్మం హెల్తీగా మారడంతోపాటు, గ్లోయింగ్ గా మారుతుంది. నోటి ద్వారా శరీరం లోపలికి వెళ్లే బ్యాక్టీరియాను నోట్లోనే నాశనం చేసే సత్తా ఆయిల్ పుల్లింగ్ కి ఉంది. దీనివల్ల రక్తం శుద్ధి అయి, మొటిమలు, ఇతర చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.
హార్మోన్ పనితీరుకి
మనం ఆరోగ్యంగా ఉండటానికి హార్మోన్ల పనితీరు సజావుగా ఉండాలి. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆయిల్ పుల్లింగ్ అలవాటు చేసుకోవడం వల్ల హార్మోనల ఇంబ్యాలెన్స్ సమస్య దరిచేరకుండా.. జాగ్రత్త పడవచ్చు.

రోగనిరోధక శక్తి
ఉదయాన్నే ఆయిల్ పుల్లింగ్ చేసేవాళ్లలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. రకరకాల అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి పొందడానికి ఆయిల్ పుల్లింగ్ చాలా చక్కటి ఉపాయం. తలనొప్పితో బాధపడుతున్నప్పుడు కూడా.. 20 నిమిషాలు ఆయిల్ పుల్లింగ్ చేస్తే చాలా మంచి ఫలితం పొందవచ్చు.
తెల్లటి పళ్లకి
ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల పళ్ల మిళమిళ మెరిసిపోతాయని నిపుణులు చెబుతున్నారు. రోజుకి కనీసం 20 నిమిషాలు ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల.. పళ్లకు గారపట్టడానికి కారణమయ్యే సూక్ష్మక్రిములను నాశనం చేయవచ్చట. అలాగే యాంటీ వైరల్ లక్షణాలు ఉండటం వల్ల.. ఇవి పళ్లు తెల్లగా మెరిసిపోవడానికి సహాయపడతాయట.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications