For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెంగ్యూ వచ్చిందా? ఇవి తినండి చాలు!

By Y Bharath Kumar Reddy
|

ప్రతి సంవత్సరం కొన్ని మిలియన్ల మంది డెంగీ జ్వరం బారినపడుతున్నారు. ఇది జనాలను ఎక్కువగా వేధిస్తోంది. డెంగీని మొదటలో ఎదుర్కోవాలి. సకాలంలో వ్యాధి లక్షణాలు గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం కాస్త ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంది. డెంగీ వేగంగా వ్యాప్తి చెందుతుంది. డెంగీ వస్తే విపరీతమైన జ్వరం వస్తుంది. చలి, తీవ్రమైన తల నొప్పి, ఒళ్లునొప్పులు ఉంటాయి. శరీరంపై దద్దుర్లు వస్తాయి. విపరీతమైన దాహం వేస్తుంది.

నోరు ఎక్కువగా ఆరిపోతుంది వాంతులు అవుతాయి. కళ్లలో నొప్పి వస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దగ్గరకు వెళ్ళాలి. డెంగీ రావడం వలన శరీరంలో ఫ్లేట్ లెట్స్ తగ్గుతాయి. ఇలా తగ్గడం వలన రక్తం గడ్డకట్టి ఆగిపోతుంది. ఇలాంటి సమయంలో నొప్పులు ఎక్కువగా వస్తాయి. డెంగీ వచ్చినప్పుడు పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉన్న ద్రవాలను రోగికి ఇవ్వాలి. పరిసరాలను పరిశుభ్రముగ ఉంచుకొని ముఖ్యంగా దోమలు రాకుండా నివారిస్తే ఈ వ్యాధి బారిన పడకుండా ఉంటాం. అలాగే కొన్ని సూచనలు పాటించడం, కొన్ని రకాలు ఆహారాలు, జ్యూస్ లు తీసుకోవడం వల్ల మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మరి మీరు తీసుకోవాల్సిన ఆహారాలు, జ్యూస్ లు ఏమిటో తెలుసుకోండి.

1. బొప్పాయి ఆకులు

1. బొప్పాయి ఆకులు

బొప్పాయి ఆకులు డెంగీ నివారణకు బాగా పని చేస్తాయి. డెంగీ వ‌చ్చిన వారు బొప్పాయి ఆకుల ర‌సం తాగితే ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి. ర‌క్తం వృద్ధి చెందుతుంది. త్వ‌ర‌గా జ్వ‌రం నుంచి కోలుకుంటారు. తాజా బొప్పాయి ఆకులను తీసుకోండి. వాటికి కొద్దిగా నీరు కలిపి పేస్ట్ గా చేసుకోండి. దాన్ని రోజు 4-5 మోతాదులో తింటూ ఉండండి. దీంతో డెంగీ జ్వరం నుంచి మీరు బయటపడొచ్చు. ఇది.. బ్లడ్ ప్లేట్ లెట్స్ ని ఊహించని రీతిలో పెంచుతుంది.

2. కొత్తిమీర

2. కొత్తిమీర

కొత్తిమీరలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచే గుణం కూడా దీనికి ఉంటుంది. కొత్తిమీర తీసుకున్నాక అందులోని గుణాలు శరీరంలోని సిరలు ద్వారా ప్రతి భాగానికి విస్తరిస్తాయి. శరీరంలోని బాక్టీరియాతో పోరాడగల శక్తి దీనికి ఉంటుంది. కొత్తిమీర ఆకులతో జ్యూస్ తయారు చేసుకుని తాగడం మంచిది. డెంగీని నివారించడంలో ఇది నంబర్ వన్ గా పని చేస్తుంది.

3. విటమిన్ సి

3. విటమిన్ సి

విటమిన్ - సి అధికంగా తీసుకుంటే మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరెంజ్, ఎర్ర మిరియాలు, టమోటాలు, స్ట్రాబెర్రీలు, మొలకలు మొదలైన వాటిలో విటమిన్ సీ ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. డెంగీ నివారణకు విటమిన్ - సి సమర్థంగా పని చేస్తుంది.

4. ఆకుకూరగాయలు

4. ఆకుకూరగాయలు

డెంగీ నివారణకు ఆకుకూరగాయాలు బాగా తోడ్పడుతాయి. వీటితో తయారు చేసిన ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల మీలో రోగ నిరోధక శక్తి పెరుగుంతుంది. అలాగే మీ రక్తంలో ప్లేట్లట్స్ పెరగడానికి కూడా ఇవి దోహదం చేస్తాయి. డెంగీతో పోరాడే గుణాలు ఆకుకూరగాయాల్లో ఎక్కువగా ఉంటాయి. అందువల్ల రోజూ ఆహారంలో ఆకుకూరగాయలు ఉండేలా చూసుకోండి.

5. నీరు

5. నీరు

డెంగీ బారినపడిన వ్యక్తి 8 నుంచి 10 గ్లాసుల వరకు నీరు తాగాలి. శరీరానికి అవసరమైన నీరు తాగడం వల్ల బాడీలోని వ్యర్థపదార్థాలన్నీ బయటకు వెళ్తాయి. డీహైడ్రేషన్ సమస్య నుంచి మీరు బయటపడాలంటే కచ్చితంగా నీరు ఎక్కువగా తాగాలి. దీంతో మీ శరీరానికి కావాల్సిన నీరు సమకూరి మీరు ఆరోగ్యంగా ఉంటారు.

6. ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి

6. ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి

డెంగీ వల్ల శరీరంలో ఉన్న మినరల్స్ మొత్తం ఖాళీ అయిపోయి ఉంటాయి. అందువల్ల మీకు ఆ సమయంలో అత్యధిక పోషకాలు కావాలి. ప్రోటీన్లు ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. దీంతో మీ శరీరానికి కావాల్సిన శక్తి మళ్లీ అందుతుంది. మీరు కోల్పొయిన ఎనర్జీ మొత్తాన్ని తిరిగి పొందుతారు.

7. అరటి

7. అరటి

అరటిలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రోజూ అరటిపండ్లను తినడం వల్ల మీరు కోల్పోయిన శక్తిని మళ్లీ తిరిగి పొందుతారు. ఇది డెంగీ నివారణకు బాగా పని చేస్తుంది. అందువల్ల అరటిపండ్లను ఎక్కువగా తీసుకోండి.

8. కొబ్బరి నీరు

8. కొబ్బరి నీరు

కొబ్బరి నీరు కేలరీలకు కేరాఫ్ అడ్రస్ లా ఉంటుంది. ఇందులో అధిక పోషకపదార్థాలుంటాయి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు కొబ్బరి నీరు బాగా పని చేస్తుంది. డెంగీ బారిన పడినప్పుడు రెగ్యులర్ గా కొబ్బరి నీరు తాగితే శరీరానికి అవసరమైన పోషకాలను, విటమిన్లు అందుతాయి.

9. నల్ల ద్రాక్ష జ్యూస్

9. నల్ల ద్రాక్ష జ్యూస్

డెంగీ నివారణకు ఇది బాగా పని చేస్తుంది. ఇది రక్త కణాల సంఖ్యను కూడా పెంచుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పలు పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల డెంగీ బారిన పడిన వారు నల్లద్రాక్ష జ్యూస్ ను ఎక్కువగా తాగాలి.

10. చ్యవాన్ ప్రష్

10. చ్యవాన్ ప్రష్

చ్యవాన్ ప్రష్ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే రక్తం శుద్ధి చేయడంలోనూ ఇది సమర్థంగా పని చేస్తుంది. శరీరంలో రోగనిరోధకత శక్తినిపెంచుతుంది. డెంగీ నివారణకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది మార్కెట్లో విరివిగా లభిస్తుంది.

11. దానిమ్మ జ్యూస్

11. దానిమ్మ జ్యూస్

దానిమ్మ జ్యూస్ రక్త కణాల సంఖ్యను పెంచడంలో బాగా పని చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ ను పెంచగలదు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి దాన్నిమ్మ జ్యూస్ ని ఎక్కువగా తాగడానికి ప్రయత్నించండి.

12. వేప జ్యూస్

12. వేప జ్యూస్

వేప ఆకులు డెంగీ జ్వరం తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి డెంగీ ఫీవర్ వైరస్ ను అరికట్టగలవు. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి బాగా పని చేస్తాయి. వేప ఆకులను బాగా మెత్తగా నూరుకొని ఒక గ్లాస్ వాటర్ లో మిక్స్ చేసుకోండి. ఆ వాటర్ ను తాగుతూ ఉండండి. డెంగీ నుంచి మీకు కాస్త ఉపశమనం లభిస్తుంది.

13. బాసిల్

13. బాసిల్

విభూది తులసి ఆకులు డెంగీ నివారణకు చాలా బాగా ఉపయోగపడతాయి. తులసిలో చాలా ఔషధ గుణాలుంటాయి. డెంగీకి వ్యతిరేకంగా ఇది బాగా పని చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది. మీరు కొద్దిగా తులసి ఆకులను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

14. కాస్సియా రూట్స్

14. కాస్సియా రూట్స్

శరీరంలో ఉష్ణోగ్రత తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇవి బాగా పని చేస్తాయి. వీటనిలో నీటిలో వేసి బాగా మరిగించాలి. వీలైతే కొన్ని తులసి ఆకులను కూడా కలుపుకోవొచ్చు. ఇక నీరు చల్లారాక తాగొచ్చు.

15. మెంతి ఆకు

15. మెంతి ఆకు

ఇవి జ్వరం, గొంతునొప్పి తదితర వాటికి బాగా పని చేస్తాయి. నీటిలో కొన్ని మెంతులు ఆకులు వేసి మరగించండి. అందులో కాస్త ఉప్పు వేయండి. చల్లగయ్యాక ఆ నీటిని తాగండి. మంచి ఫలితం ఉంటుంది. అలాగే మెంతుల పొడిని నీళ్లలో కలుపుకుని తాగితే కూడా ఉపశమనం పొందొచ్చు.

16. గ్రీన్ టీ

16. గ్రీన్ టీ

డెంగీ నివారణకు గ్రీన్ టీ అద్భుతంగా పని చేస్తుంది. గ్రీన్ టీని రోజూ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని డెంగీకి సంబంధించిన వైరస్ లను ఇది ఎదుర్కొంటుంది. డెంగీని నివారించడానికి ఈ రెమెడీ బాగా పని చేస్తుంది.

17. బార్లీ గడ్డి

17. బార్లీ గడ్డి

బార్లీ గడ్డి ద్వారా కూడా డెంగీని తగ్గించుకోవొచ్చు. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ నుంచి శరీరాన్ని కాపాడే గుణం దీనికి ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ వైరస్ గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. దీని ద్వారా జ్యూస్ తయారు చేసుకుంటే డెంగీని సులభంగా నివారించొచ్చు.

18. గోల్డెన్ సీల్

18. గోల్డెన్ సీల్

డెంగీ నివారణకు ఇది బాగా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం ద్వారా వెంటనే కోలుకోవొచ్చు. అందువల్ల డెంగీతో బాధపడే వారు దీన్ని ఎక్కువగా తీసుకుంటే మంచిది.

19. హెర్మాల్ విత్తనాలు

19. హెర్మాల్ విత్తనాలు

ఈ విత్తనాల డికాషన్ గానీ లేదా విత్తనాల పొడిని గానీ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. దీనివల్ల వేగంగా కోలుకుంటారు. డెంగీకి సంబంధించిన వైరస్ లపై ఇందులోని గుణాలు ఎక్కువగా పోరాడతాయి. అందువల్ల డెంగీ బారిన పడిన వారు దీన్ని ఎక్కువగా తీసుకోవాలి.

20. డెవిల్స్ ట్రీ

20. డెవిల్స్ ట్రీ

ఇది పలు రకాల జ్వరాలను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీరు జ్యూస్ ను తయారు చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. అది మీ శరీరంలో ఉష్ణోగ్రతను బాగా తగ్గించేందుకు సాయం చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తి పెరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

21. వేప బాగా పని చేస్తుంది

21. వేప బాగా పని చేస్తుంది

వేపలో యాంటీ ఫంగల్, అనాల్జేసిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచుతుంది. అంటువ్యాధులపై వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఇందులో ఉంటాయి. రోగనిరోధక శక్తి కూడ పెరుగుతుంది. అందువల్ల వేప ఆకులతో తయారు చేసుకునే రసాన్ని ఎక్కువగా తాగండి.

22. కకమచి

22. కకమచి

కకమచి సిరప్ కు ఎన్నో గుణాలున్నాయి. ఇది శరరీం నుంచి హానికరమైన టాక్సిన్లను బయటకు పంపగలదు. జీర్ణ వ్యవస్థ పని తీరును ఇది మెరుగుపరుస్తుంది. హానికరమైన టాక్సిన్లను చంపే గుణం దీనికి ఉంటుది. అందువల్ల డెంగీతో బాధపడేవారు కకామచి సిరప్ ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు.

23. ఉసిరి

23. ఉసిరి

దీంతో చాలా ప్రయోజనాలుంటాయి. ఇందులో ఉండే విటమిన్ సీ శరీరంలో ఐరన్ స్థాయి పెరిగేందుకు తోడ్పడుతుంది. డెంగీ వచ్చిన సమయంలో ఉసిరి జ్యూస్ గానీ లేదా ఉసిరికాయలను నేరుగాగానీ తీసుకోవడం చాలా మంచిది.

24. తులసి టీ

24. తులసి టీ

తులసి ఆకుల మాదిరిగానే తులసి టీ మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగేందుకు తోడ్పడుతుంది. డెంగీకి సంబంధించిన వైరస్ లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. అందువల్ల తులసితో తయారుచేసిన టీ తాగడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు. కొద్దిగా నీటిని తీసుకుని అందులో కొన్ని తులసి ఆకులు వేసి మరగించండి. చల్లారక ఆ నీటిని తాగండి. ఇలా రోజూ చేస్తూ ఉంటే త్వరలోనే కోలుకుంటారు.

25. తవ

25. తవ

డెంగీ నివారణకు దీన్ని బాగా ఉయోగిస్తారు. ఇది రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్యను పెంచుతుది. డెంగీ జ్వరం త్వరగా తగ్గేలా చేస్తుంది. అలాగే డెంగీ వల్ల వచ్చే ఒళ్లు నొప్పులను, కీళ్ల నొప్పులను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఈ సూచనలన్నీ పాటిస్తూ డాక్టర్లు చెప్పిన విధంగా నడుచుకుంటే డెంగీ ఈజీగా వెళ్లిపోతుంది.

English summary

25 Natural Home Remedies To Treat Dengue Fever

Dengue fever is a mosquito-borne disease and can be cured using natural remedies like papaya leaves, coriander leaves, etc. Some of the other symptoms that come along with dengue are headache, rashes, sudden high fever, nausea and vomiting. Treating these at the right time becomes very important.
Story first published:Saturday, November 11, 2017, 17:12 [IST]
Desktop Bottom Promotion