బ్రహ్మి-టీ వల్ల, మీ ఆరోగ్యానికి లభించే 7 అద్భుతమైన ప్రయోజనాలు

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఒక కప్పు టీ మిమ్మల్ని తెలివైన వారిగా చేయగలదా? వినడానికి హాస్యాస్పదంగా ఉంది కదా, కానీ బ్రాహ్మి-టీ తో ఇది అసాధ్యం అనేది కానే కాదు!

బ్రహ్మి (లేదా) బాకోపా మొన్నీరి, ఆయుర్వేదంలో అత్యంత విలువైన ఒక మొక్క. ఇది ఆయుర్వేదం సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క పేరునే ఈ మొక్కకు పెట్టబడింది.

బ్రహ్మిని "గ్రేస్ హెర్బ్" (లేదా) "వాటర్ హిస్సోప్" అని కూడా పిలుస్తారు. దీనిని టీ రూపంలో వినియోగించినప్పుడు, ఈ హెర్బ్ అనేది మంచి పరిమళాన్ని మరియు పునరుజ్జీవనమును కలిగి ఉంది. దీనితో మీ ఆరోగ్యమును పెంపొందించడానికి 7 రకాల మార్గాలున్నాయి.

1. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది :

1. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది :

మెదడు యొక్క పనితీరుపై, బ్రహ్మి యొక్క ప్రభావంతో కీర్తి చెందేదిగా ఉంటుంది. ఇది న్యూరాన్ల మధ్య కమ్యూనికేషన్ను మెరుగుపరిచేందుకు, న్యూరాన్లను బలపరిచేదిగా ఉంటుంది.

2. జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది :

2. జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది :

బ్రహ్మి, హిప్పోకాంపస్ను బలపరుస్తుంది కాబట్టి, ఈ 'టీ'తో మెరుగైన జ్ఞాపకశక్తిని పొందవచ్చు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక, మరియు ప్రాదేశిక జ్ఞాపక శక్తులను ప్రేరేపించేదిగా చేస్తుంది.

బ్రహ్మి-టీ ను త్రాగటం వల్ల న్యూరాన్స్ కణాల యొక్క సాంద్రత తగ్గిపోతుంది. ఇది నేర్చుకోవడాన్ని మరియు జ్ఞాపకశక్తిని తగ్గించే చర్యలను తగ్గిస్తుంది, మీ మానసిక ఆరోగ్యాన్ని పరిశీలనలో ఉంచండి.

3. డిప్రెషన్ను తగ్గిస్తుంది :

3. డిప్రెషన్ను తగ్గిస్తుంది :

డిప్రెషన్ అనేది అత్యంత సాధారణమైన మనోవ్యాధి-రుగ్మతలలో ఒకటి. మీరు ఈ పరిస్థితితో వ్యవహరిస్తే, బ్రహ్మి-టీ ద్వారా మీకు ఉపశమనమును కలగుతుంది. బ్రహ్మి-టీ లో ఉండే యాంటిడిప్రెసెంట్ అనేవి, ఔషధాలలో వాడే మందుల మాదిరిగానే మనోవ్యాధిని తగ్గించే ప్రత్యామ్నాయ లక్షణాలను కలిగి ఉంటుంది.

4. ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది :

4. ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది :

ఈ మాట వినగానే, మీరు ఆత్రంగా ఉన్నారా ? ఒక కప్పు బ్రహ్మీ-టీ ను మరగబెట్టండి. జ్ఞానశక్తి యొక్క పనితీరును మెరుగుపరచడమే కాకుండా, ఇది మీకు విశ్రాంతిని కలిగించుటలో కూడా సహాయం చేస్తుంది.

ఫైటోథెరపీ లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ను యొక్క పనితీరును బ్రహ్మి తగ్గిస్తుందని కనుగొనబడింది. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారి యొక్క మానసిక స్థితిలో గణనీయమైన స్థాయిలో మెరుగుదలను కలిగి ఉన్నట్లుగా భావాలను అనుభూతి చెందారు. పైన ఉన్న ఈ రెండూ ప్రయోజనాలు ఒత్తిడిని తగ్గించగలవు.

5. మెదడును సంరక్షిస్తుంది:

5. మెదడును సంరక్షిస్తుంది:

మీ మెదడు, ఒత్తిడి నుండి ఉపశమనమును చెందినట్లుగా, న్యూరాన్లను ఉత్పత్తి చేస్తూ, బ్రాహ్మి-టీ మీ మెదడును రక్షిస్తుంది. అల్జీమర్స్ మరియు జ్ఞాపకశక్తి తగ్గటం వంటి నరాల సంబంధిత వ్యాధులకు నుండి మీ మెదడుకు ఎదురయ్యే ప్రమాదాలను తగ్గిస్తుంది. ఇది వయస్సులో వచ్చే జ్ఞానశక్తి తగ్గిపోవటం వంటి చర్యలను కూడా వెనుకకు తీసుకుంటుంది.

అయితే, మీరు కేవలం బ్రహ్మి-హెర్బ్-టీ మీద మాత్రమే ఆధారపడలేరు. ప్రతిరోజు వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం మరియు మానసిక కార్యకలాపాల వంటి అన్ని చర్యల ద్వారా మీ మెదడును పరిరక్షిస్తాయి.

6. రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది :

6. రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది :

రోగనిరోధకత విషయానికి వస్తే, ఎచినాసియా అనేది స్పాట్లైట్ను దొంగిలిస్తుంది. అయితే, ఎథ్నోఫార్మాకాలజీ జర్నల్ ప్రకారం, బ్రహ్మి అనేది చాలా ప్రయోజనకారిగా ఉంది.

ప్రతిరక్షక ఉత్పత్తిని ప్రోత్సహించేటప్పుడు, ఎచినాసియాతో పోలిస్తే, బ్రహ్మి అనేది చాలా ప్రభావశాలిగా పని చేస్తుంది. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు క్లిష్టతరంగా మారిన టి-హెల్పర్ కణాలను నియంత్రించడం ద్వారా ఇది దీన్ని చేస్తుంది. మీ శరీరానికి అదనపు మోతాదు లభిస్తుంది.

7. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది :

7. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది :

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి బ్రహ్మి చాలా సహాయం చేస్తుంది.

బ్రహ్మి-టీ ని త్రాగటం వల్ల మీ గుండె కండరాలకు మరియు ధమనులకు విశ్రాంతిని కలుగ చేస్తుంది. నిజానికి, మీ ఆరోగ్యం మొత్తానికి సంబంధించిన రక్త నాళాలను మెరుగుపరుస్తాయి. ఇది మీ గుండెపోటు తర్వాత కూడా, మీ గుండె కండరాలకు వాటిల్లిన నష్టాన్ని కూడా తగ్గుతుంది.

ఈ శక్తివంతమైన పానీయం యొక్క ప్రయోజనాలను పొందడంలో సహాయపడే వంటకాన్ని గూర్చి మీరు తెలుసుకోండి.

8. తులసి బ్రహ్మి-టీ ని తయారుచేసే విధానం :-

8. తులసి బ్రహ్మి-టీ ని తయారుచేసే విధానం :-

వాడుకకు: 2 కప్పులు

సమయం: 10 నిమిషాలు

కావలసినవి:

½ టీ స్పూన్ ఎండిన సేంద్రీయ తులసి ఆకులు

½ టీ స్పూన్ ఎండిన సేంద్రీయ బ్రహ్మి ఆకులు

2 కప్పుల నీరు

9. తయారీ విధానం:

9. తయారీ విధానం:

ఒక పాన్ లో, 2 కప్పుల నీటిని బాగా మరిగించాలి.

ఆ నీటిలో తులసి మరియు బ్రహ్మి ఆకులను రెండింటిని జోడించండి.

ఆ మిశ్రమాన్ని 2 నుండి 3 నిమిషాల పాటు అలానే మరగనివ్వండి.

మరింత రుచి కోసం, తేనెను (లేదా) నిమ్మ రసాన్ని వేసి బాగా కలపాలి.

అలా దానిని వడకట్టి, ఒక కప్పులో తీసుకొని సేవించాలి.

తులసితో కలసిన బ్రహ్మి జంటలు, ఈ పానీయం యొక్క శక్తికి, శాంతింపజేసే ప్రభావాన్ని కలిగి ఉంది. వీటి కలయిక వల్ల ఈ మూలికలు మీరు రోజును మరింత అందంగా ఉంచేందుకు సహాయం చేస్తుంది!

English summary

7 Amazing Health Benefits Of Brahmi Tea For Your Health

Brahmi is also known as the “Herb of Grace” or water hyssop.1 When consumed as a tea, this herb is both delicious and rejuvenating. Here are 7 ways it can help boost health.
Story first published: Friday, December 8, 2017, 18:45 [IST]
Subscribe Newsletter