జిన్సెంగ్ తో పెరుగుతోంది సెక్స్ సామర్థ్యం

By: Y BHARATH KUMAR REDDY
Subscribe to Boldsky

ఈ రోజుల్లో చాలామంది పని ఒత్తిడి, మానసిక ఆందోళనతో సెక్స్ లైఫ్ కు దూరమవుతున్నారు. ఇక మగవారిలో సెక్స్ సామర్థ్యం కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల చాలామంది లైంగికంగా ఆనందంగా ఉండలేకపోవుతున్నారు. అమెరికవాళ్లు, చైనీయులు శతాబ్దకాలంగా జిన్సెంగ్ ను ఉపయోగిస్తున్నారు. ఇది పురుషుల్లో లైంగిక వాంఛలు పెంచేందుకు భలే పని చేస్తుందంట. జిన్సెంగ్ శరీర శక్తిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒంట్లో సత్తువను పెంచుతుంది. జిన్సెంగ్ క్యాప్సుల్ రూపంలో, శక్తి ద్రావణాల రూపంలో, చూర్ణం, వైన్ రూపంలో లభిస్తుంది. ఎవరి సౌకర్యం మేరకు వారు వారికి ఇష్టమైన విధంగా దీన్ని తీసుకోవొచ్చు. లేదంటే 5 నుంచి 6 జిన్సెంగ్ వేరు ముక్కలను తీసుకొని నీటిలో కలిపి వేడి చేస్తే జిన్సెంగ్ టీ తయారవుతుంది. ఇలా మాత్రమేకాకుండా, వేరు నుంచి చిన్న ముక్కను వేరుచేసి దాన్ని సూప్ లలో కూడా కలుపుకుని తాగొచ్చు. జిన్సెంగ్ ను సలాడ్, సూప్, ఇతర ఆహార పదార్థాల్లోనూ కలుపుకుని తాగొచ్చు... తినొచ్చు. ఇక మగవారు స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి దీన్ని ఉపయోగించొచ్చు. కానీ దీని తీసుకునే ముందు ముందు వైద్యుడిని సంప్రదిస్తే మంచిది. టెస్టోస్టెరాన్ స్థాయిల ఇంప్రూవింగ్ కు, స్పెర్మ్ చలనం తక్కువ ఉంటే ఎక్కువ చేసుకునేందుకు, వీర్యకణాల సంఖ్య పెంచేందుకు, పురుషులు వంధ్యత్వాన్ని అధిగమించేందుకు ఇది ఒక పవర్ ఫుల్ మందు. జిన్సెంగ్ గురించి కలిగే మరిన్న లాభాల గురించి తెలుసుకోండి.

టెస్టోస్టెరోన్ స్థాయిని పెంచుతుంది

టెస్టోస్టెరోన్ స్థాయిని పెంచుతుంది

జిన్సెంగ్ టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచుతుంది. సెక్స్ వల్ లైఫ్ కు స్పెర్మ్ ఎంతో కీలకం. హైపోథాలమస్, సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి చేసేందుక ఇది బాగా పని చేస్తుంది. టెస్టోస్టెరాన్ స్థాయి పెరిగితే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. అలాగే సెక్స్ లైఫ్ కు సరైన రక్త ప్రసరణ కూడా చాలా అవసరం. జిన్సెంగ్ గుండెనాళాలకు రక్త ప్రసరణ మెరుగయ్యేందుకు దోహదపడుతుంది. మీరు సెక్స్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేయాలన్నా.. లైంగిక సామర్థ్యం పెంచుకోవాలన్నా జిన్సెంగ్ మీరు కచ్చితంగా తీసుకోవాల్సిందే మరి.

స్పెర్మ్ ప్రొడక్షన్ పెంపొందుతుంది

స్పెర్మ్ ప్రొడక్షన్ పెంపొందుతుంది

మగవారిలో స్పెర్మ్ ప్రొడక్షన్ ను పెంపొందించేందుకు జిన్సెంగ్ ఉపయోగపడుతుంది. వీర్యకణాల సంఖ్యను డెవలప్ చేసేందుకు సహకరిస్తుంది. వీర్యం ఉత్పత్తి సరిగ్గా జరగకపోతే మగవారు సెక్స్ లైఫ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. లైంగికంగా వారు బలహీనులుగానే ఉంటారు. వీర్య ఉత్పత్తి పనితీరు సక్రమంగా లేకపోవడమే ఇందుకు కారణం. వృషణాలు వీర్యాన్ని తక్కువగా ఉత్పత్తి చేసే సమస్యతో చాలా మంది ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారు జిన్సెంగ్ ను తీసుకోవాలి. దీంతో సమస్య పరిష్కారం అవుతుంది.

స్పెర్మ్ కౌంట్ ను పెంచుతుంది

స్పెర్మ్ కౌంట్ ను పెంచుతుంది

మగవారిలో లైంగిక సామర్థ్యం తక్కువ ఉండడానికి ప్రధాన కారణం స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడమే. మగవారిలో 20 మిలియన్ల కంటే వీర్యకణాలు తక్కువగా ఉంటే వారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్నట్లు లెక్క. వీర్య కణాల సంఖ్యను పెంచేందుకు జిన్సెంగ్ బాగా ఉపయోగపడుతుందంట. మరి ఇంకెందుకు ఆలస్యం మీలో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటే వెంటనే జిన్సెంగ్ తీసుకోండి సామర్థ్యం పెంచుకోండి.

స్పెర్మ్ చలనము పెంచుట

స్పెర్మ్ చలనము పెంచుట

కొందరిలో వీర్యకణాల సంఖ్య ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ వాటికి సరిగ్గా చలనం ఉండదు. దీంతో సంతానోత్పత్తి సమస్యలు తలెత్తుతాయి. తక్కువ చలనం ఉండడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. జిన్సెంగ్ ను రెగ్యులర్ గా తీసుకుంటే వీర్యకణాల్లో చలనం పెరుగుతుంది. దీనివల్ల మొత్తం వీర్యకణాల్లో కనీసం 50% కంటే ఎక్కువ కణాలు చొచ్చుకపోయే తత్వాన్ని పెంపొందించుకుంటాయి.

స్పెర్మ్ క్వాలిటినీ పెంచుతాయి

స్పెర్మ్ క్వాలిటినీ పెంచుతాయి

చాలామంది మగవారిలో స్మెర్మ్ బాగా ఉన్నా అది అంత క్వాలిటీగా ఉండదు. దీంతో సంతానలేమి సమస్యతో బాధపడుతుంటారు. వీర్యకణాల్లో చలనం తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. అలాగే అండాన్ని ఫలదీకరించే శక్తి కూడా వీటికి ఉండదు. స్పెర్మ్‌ కాన్‌సెంట్రేషన్‌ (వీర్యం సాంద్రత) మిల్లీలీటర్‌ సెమెన్‌కు 20 మిలియన్ల స్పెర్మ్‌గా లేదా అంతకన్నా ఎక్కువగా ఉండాలి. 10 మిలియన్ల కౌంట్‌ లేదా అంతకన్నా తక్కువ కౌంట్‌ను స్పెర్మ్‌ కాన్‌సెంట్రేషన్‌ తక్కువగా ఉండడం (సబ్‌ఫెర్టిలిటీ)గా వ్యవహరిస్తారు. ఈ కౌంట్‌ 40 మిలియన్లకు మించడాన్ని అధిక సంతానసాఫల్యతగా గుర్తిస్తారు. అయితే జిన్సెంగ్ ను రెగ్యులర్ తీసుకోవడం ద్వారా వీర్యకణాల్లో నాణ్యత పెరుగుతుంది. స్పెర్మ్ కణాలు ఇక దూసుకెళ్తాయి. అందడాన్ని ఫలదీకరణం చేస్తాయి. దీంతో సంతానాలేమి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. అందువల్ల వీర్యకణాల నాణ్యతను పెంచుకోవాలంటే జిన్సెంగ్ కచ్చితంగా అవసరమే.

స్పెర్మ్ సంరక్షణ

స్పెర్మ్ సంరక్షణ

వీర్యకణాలను కాపాడటానికి జిన్సెంగ్ బాగా సహాయపడుతుంది. అత్యంత సూక్ష్మంగా ఉండే స్పెర్మ్ బలహీనపడకుండా ఉండేందకు ఇది తోడ్పడుతుంది. దీనివల్ల మగవారిలో సంతానోత్పత్తి పెంపొందుతుంది. వీర్య కణాలు తల నుండి తోక వరకు సుమారు 50 మైక్రోమీటర్ల పొడవు (0.05 మిల్లీమీటరు లేదా సుమారు .0002 అంగుళాలు) ఉంటాయి. వీర్య స్కలనం జరిగిన తర్వాత బయటకు వచ్చే స్మెర్మ్ సెల్స్ చల్లగా గాలి తగిలితే కొంత సేపటికే నశించి పోతుంది.. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే చాల సమయం ఆరోగ్యంగా ప్రాణంతో జీవించి ఉంటాయి. స్కలనం జరిగినప్పుడు కొన్ని వందల, వేలల్లో స్మెర్మ్ సెల్స్ ఉత్పత్తి అవుతాయి.. పురుషులు స్కలనంలో విడుదలయ్యే అన్ని స్మెర్స్ సెల్స్ అండాన్ని చేరాల్సిన అవసరం లేదు, ఆరోగ్యంగా ఉండే ఒక్క స్మెర్స్ సెల్ అండం చేరినా సరే గర్భం పొందడానికి అవకాశాలుంటాయి. కాబట్టి, గర్భం పొందడానికి సహాయపడే ఈ స్మెర్మ్ సెల్ ఎంతో ఆరోగ్యంగా ఉంటేనే సంతానలేమి సమస్య ఉండదు. అందుకు జిన్సెంగ్ బాగా తోడ్పడుతుంది.

అంగస్తంభన

అంగస్తంభన

శృంగారం సంతృప్తికరంగా జరగాలంటే అతిముఖ్య అవసరం అంగస్తంభన. అంగస్తంభన లేకుంటే సెక్స్ లైఫ్ ను ఎంజాయ్ చేయలేరు. చాలా మందిలో అంగస్తంభన సమస్య ఉంటుంది. దీనికి కారణాలు అనేకం ఉంటాయి. అయితే, ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి జిన్సెంగ్ బాగా సహకరిస్తుంది. జిన్సెంగ్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీరు ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అలాగే జిన్సెంగ్ జీవక్రియను పెంచుతుంది. శరీర బరువు తగ్గటానికి జిన్సెంగ్ ఉపయోగపడుతుంది. ఒకవేళ మీ శరీర బరువు తగ్గించుకోటానికి జిన్సెంగ్ ను వాడాలి అనుకునే ముందు వైద్యుడిని తప్పక సంప్రదించండి.

English summary

8 Ways Ginseng Helps To Improve Male Fertility

Ginseng is a powerful herb in overcoming male infertility issues, from assisting with low sperm count to improving sperm motility to boosting testosterone levels. For a couple, trying to conceive a child and unable to do so month after month is very frustrating. The best and healthiest approach is using natural products that can increase your chances, one of them being ginseng.
Story first published: Thursday, November 9, 2017, 8:00 [IST]
Subscribe Newsletter