బాత్రూంలో జారి పడ్డారా?

By: Deepti
Subscribe to Boldsky

బాత్ రూం విశ్రాంతి తీసుకుని, ఒత్తిడి తగ్గించుకునే ప్రదేశం అయినా కూడా, అక్కడ నేల జారుడుగా ఉండి అపాయకరంగా మారవచ్చు. తడినేల ప్రాణం కూడా తీయగలదు! మనలో చాలామంది బాత్రూంలో జాగ్రత్తగా ఉండడానికి కొన్ని చిట్కాలు పాటించడానికి ఇష్టపడకపోయినా, వయస్సు పైబడుతున్నకొద్దీ బాత్ రూంలో జారిపడి దెబ్బల బారినపడే అవకాశాలు పెరుగుతాయి.

మీ ఇంట్లో ముఖ్యంగా పెద్దవారు ఉంటే, బాత్ రూం ప్రమాదాల గూర్చి తెలుసుకోవలసిన కొన్ని నిజాలు చూడండి.

బాత్ రూమ్ టైల్స్ ను శుభ్రం చేయడానికి సులభ చిట్కాలు

నిజం #1

నిజం #1

గణాంకాల ప్రకారం 1/3 వ శాతం వృద్ధులు బాత్ రూంలో ఏడాదికోసారి జారిపడే అవకాశం ఉంది. మీ ఇంట్లో పెద్దవారు (65 ఏళ్ళ పైబడి) ఉంటే, తస్మాత్ జాగ్రత్త!

నిజం #2

నిజం #2

అలా జరిగే అన్ని ప్రమాదాలలో, 65% చిన్న గాయాలుగా మారినా మిగతావి చాలా ప్రాణాంతకం !

నిజం #3

నిజం #3

ఇలాంటి ప్రాణాంతక కేసులన్నీ ఎమర్జెన్సీ కేసులు. జారుడుగా ఉండే బాత్ రూం ప్రాణాంతకం! కొన్నిసార్లు, మాములుగా చిన్నగా జారిపడినా ప్రాణానికి ప్రమాదం కావచ్చు.

నిజం #4

నిజం #4

దోక్కుపోవటం, కోసుకుపోవటం, ఎముకలు విరగటం, వెన్నెముకకి గాయాలు, ఫ్రాక్చర్లు, వంటివి మామూలే. కానీ కొన్ని సంధర్భాలలో చావు కూడా సంభవించచ్చు.

నిజం #5

నిజం #5

సాధారణంగా, బాత్ రూం ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయి? మనం టబ్ లోంచి బయటకి వస్తున్నప్పుడో,టాయిలెట్ సీటుపై కూర్చున్నప్పుడో, తువ్వాలు తీసుకుంటున్నప్పుడో లేదా జారుడు నేలపై నడిచినప్పుడో జరుగుతాయి.

నిజం #6

నిజం #6

వృద్ధాప్యంలో ఇవి ఎందుకు ఎక్కువ జరుగుతాయి? యవ్వనంలో కూడా అప్పుడప్పుడూ జరిగినా వృద్ధులలో ఈ ప్రమాదాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సున్నితమైన ఎముకలు, సరియైన నియంత్రణ లేకపోవటం వల్ల జరుగుతుంది.

బాత్ రూమ్ లో మీరు చేసే అనారోగ్యకరమైన తప్పిదాలు...

నిజం #7

నిజం #7

ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆపే కొన్ని చిన్న పధ్దతులు ఏంటంటే, పెద్దవారికి సాయపడటం, పెద్దవారు బాత్ రూం వాడుతున్నప్పుడు లైట్లు వేసి ఉంచటం, బాత్ రూంలో డోర్ మ్యాట్లు వేసి ఉంచడం, బాత్ రూం నేలను పొడిగా ఉంచడం, పట్టుకోడానికి హ్యాండిల్స్ పెట్టించడం మొదలైనవి చేయండి.

English summary

Facts About Bathroom Falls And Injuries Among The Elderly

Wet floor can even take lives! Here are the reasons why elderly people slip and fall in the washroom.
Story first published: Friday, June 30, 2017, 9:00 [IST]
Subscribe Newsletter