ఎయిడ్స్ పై మీరు తప్పక తెల్సుకోవాల్సిన 9 భయంకరమైన వాస్తవాలు!

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

ప్రపంచంలో కొన్ని పదాలు మాత్రమే ఉన్నాయి, వెన్నులో చలిపుట్టించి, వొణుకు పుట్టించేవి - AIDS అనే జబ్బు ఖచ్చితంగా ఈకోవకు చెందినదే!

వైద్యశాస్త్రంలో సాంకేతిక పురోగమానాలు ఎన్ని జరిగినా, AIDS అనేది ఇప్పటికీ అత్యంత ప్రమాదకర రోగాలలో ఒకటి, దీనికి చికిత్స ఇంకా కనుగొనలేదు!

AIDS వల్ల, తుది ఫలితం ఖచ్చితంగా మరణమే అన్న విషయం మనకు తెలుసు, ఈ వ్యాధి లక్షణాలు మరణానికి దారితీసెంత వినాశకరమైనవి.

world aids day, aids facts

ప్రతి ఏటా వేల మంది ఈ AIDS బారిన పడి, జీవితాలు కోల్పోతున్నారు, చివరికి పిల్లలు కూడా, ఈ వ్యాధి కలిగిన తల్లిదండ్రులు పిల్లలు పుట్టక ముందే సంక్రమింప ఈ వ్యాధిని సంక్రమింపచేస్తున్నారు!

AIDS (అక్వైరేడ్ ఇమ్యూనో డేఫిషియన్సీ సిండ్రోమ్) అనేది HIV వైరస్ (హ్యూమన్ ఇమ్యూనో డేఫిషియన్సీ వైరస్) వల్ల వస్తుంది, ఇది రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసి తద్వారా ఈ వ్యాధిని ఎదుర్కునేందుకు పూర్తిగా శరీర సామర్ధ్యాన్ని నాశనం చేస్తాయి.

HIV వైరస్ అనేది వీర్యం, రక్త ద్రవాలు లేదా రక్తం ద్వారా ఆ వ్యాధికి ప్రభావితమైన వ్యక్తితో అసురక్షిత లైంగిక ;సంపర్కంలో పాల్గొన్నపుడు ప్రసారం చేయబడుతుంది.

AIDS అనేది రేజర్లు, సూదులు మొదలైనవాటిని వేరొకరికి ఉపయోగించడం వల్ల కూడా రక్తంలోకి సోకి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

AIDS అనేది మన శ్రేయస్సుకి సంబంధించిన ప్రతి అంశానికి ప్రభావితం అయి, రోగనిరోధక శక్తిని బలహీన పరుస్తుంది, వ్యదిగ్రస్దులపై అనేక వ్యాధులకు దారితీస్తుంది, AIDS కు సంబంధించిన కొన్ని సాధారణ లక్షణాలు ప్రత్యేకంగా ఉన్నాయి.

అవి పొత్తికడుపు నొప్పి, గొంతు నొప్పి, నిరంతరం ఫ్లూ, ఆకలి తగ్గడం, నాలిక మీద పుండు, జననే౦ద్రియాలపై వాపు, నిరంతరం విరోచనాలు మొదలైనవి.

కొన్ని సమయాలలో లక్షణాలను తగ్గించే చికిత్సలు ఉన్నాయి, అయితే, చివరిగా, మొత్తం రోగనిరోధక వ్యవస్ధ పాడయిపోయి, చికిత్స పనిచేయడం ఆగిపోతుంది, అందుకే AIDS అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి!

కాబట్టి, ప్రతి ఒక్కరూ AIDS పై తెల్సుకోవాల్సిన 9 భయంకరమైన వాస్తవాలు!

వాస్తవం #1: AIDS కి చికిత్స లేదు

వాస్తవం #1: AIDS కి చికిత్స లేదు

ప్రస్తుతం AIDS కి చికిత్స లేదు, అయినప్పటికీ, వైద్య పరిశోధకులు, ఫార్మా సుటికల్ కంపెనీలు ఈ చికిత్సను కనుగొనడానికి నిరంతరం కృషిచేస్తున్నాయి. శరీరంలో వ్యాధి సోకిన కణాలపై దాటిచేసే లక్ష్యంతో ఇప్పటి వరకు AIDS మీద 100 కు పైగా మందులను పరీక్షించారని చెప్పారు.

వాస్తవం #2: అసురక్షిత శృంగారం

వాస్తవం #2: అసురక్షిత శృంగారం

AIDS ప్రారంభ కేసులలో కొన్ని 1959 లో కాంగో (ఆఫ్రికా) లోని, కిన్షాసా నుండి ఉద్భవించాయి. తరువాత, 1960 లో, AIDS యునైటెడ్ స్టేట్స్, యూరోప్, తరువాత ఏషియన్ దేశాలకు సంక్రమించింది. నేడు, అసురక్షిత శృంగారం వల్ల కాకుండా, చట్టవిరుధ్ద మందులను ఉపయోగించిన వ్యక్తుల సూదులను పంచడం ప్రధాన కారణం.

వాస్తవం #3: అవగాహన కల్పించడం

వాస్తవం #3: అవగాహన కల్పించడం

గణాంకాలు, పరిశోధన అధ్యయనాల ప్రకారం, ప్రపంచంలోని 40% మంది ప్రజలు, వారికి AIDS ఉందని చాలా ఆలస్యమయ్యేంత వరకు గ్రహించలేకపోతున్నారు. ఈ ప్రజలు ఇది సాధారణంగా వచ్చే ఫ్లూ లేదా ఇతర సాధారణ కారణం అని చికిత్స తీసుకోవట్లేదు. కాబట్టి, అవగాహన కల్పించడం, ప్రత్యేకంగా పల్లెటూళ్ళలో ఇది చాలా ముఖ్యమైనది.

వాస్తవం #4: పరిశుభ్రత లేకపోవడం

వాస్తవం #4: పరిశుభ్రత లేకపోవడం

AIDS అనేది ఆసుపత్రులలో కలుషితమైన శస్త్రచికిత్స పరికరాల ద్వారా కూడా వ్యాపించవచ్చు, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలలో, AIDS రోగులకు ఉపయోగించిన శస్త్రచికిత్స పరికరాలను ఉపయోగించడం, శుభ్రంగా ఉపయోగించక పోవడం ద్వారా కూడా జరగవచ్చు. కాబట్టి, ఆసుపత్రులు శుభ్రత, రక్షణ విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం.

 వాస్తవం #5: వ్యాధి సోకిన తల్లి

వాస్తవం #5: వ్యాధి సోకిన తల్లి

AIDS అనేది స్త్రీ గర్భిణిగా ఉన్నపుడు రక్తం ద్వారా బిడ్డ జన్మించక ముందే ఆ వ్యాధి బిడ్డకు సోకుతుంది కూడా. తల్లి తన బిడ్డకు పాలిచ్చినపుడు కూడా ఈవ్యాధి సోకుతుంది. కాబట్టి, AIDS ఉన్న స్త్రీ, గర్భందాల్చక పోవడం మంచిది!

వాస్తవం #6: మూడవ ప్రపంచ దేశాలలో ఇది సహజం

వాస్తవం #6: మూడవ ప్రపంచ దేశాలలో ఇది సహజం

ఈమధ్య జరిగిన పరిశోధన ప్రకారం, ప్రపంచంలో AIDS తో జీవించేవారు 36.7 మిలియన్ల మందికంటే ఎక్కువ ఉన్నారు! వారిలో, తల్లిదండ్రుల ద్వారా వ్యాధి సంక్రమించిన పిల్లలు 1.8 మిలియన్ కి పైగా ఉన్నారు. AIDS అనేది మూడవ ప్రపంచ దేశాలు, అభివృద్ది చెందుతున్న దేశాలలో చాలా సాధారణం.

వాస్తవం #7: సురక్షిత సంపర్కం

వాస్తవం #7: సురక్షిత సంపర్కం

లైంగిక సంక్రమణ వ్యాధులు పరీక్షించబడిన లైంగిక భాగస్వామి కలిగి, సురక్షిత లైంగిక సాధన చేయడం, సూదులు, రేజర్లను పంచక పోవడం, ఎప్పుడూ లైంగిక సంక్రమణ రోగాలను పరీక్ష చేయించుకోవడం మొదలైనవి AIDS ను నివారించే తేలికైన కొన్ని మార్గాలు.

వాస్తవం #8: అంగ సంపర్కం

వాస్తవం #8: అంగ సంపర్కం

AIDS ఎ వయసు, లింగ, జాతి లేదా శృంగార ప్రాధాన్యతల వారినైనా ప్రభావితం చేస్తుంది, ఎక్కువగా అంగ సంపర్కం చేసేవారిలో AIDS అభివృద్ది ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో రుజువైంది. కాబట్టి, అంగ సంపర్క సమయంలో కన్డోమ్ తప్పక ధరించండి.

వాస్తవం #9: రక్త మార్పిడి

వాస్తవం #9: రక్త మార్పిడి

AIDS అనేది ఆసుపత్రులలో రక్త మార్పిడి సమయంలో కూడా సంక్రమించా వచ్చు, ఈ వ్యాధి సంక్రమించిన వ్యక్తి రక్తదానం చేసినపుడు ఇలా జరుగుతుంది. కాబట్టి, రక్తదానం చేసే ప్రతి వ్యక్తి ముందుగా HIV పరీక్ష తప్పక చేయించుకోవాలి.

English summary

World AIDS Day: Scary Facts On AIDS

AIDS is one of the most dangerous diseases that can affect human beings. AIDS/HIV can weaken the immune system and cause a number of devastating symptoms. Here are a few facts on AIDS for you to know.