ముక్కు గురించి 15 ఆసక్తికరమైన మరియు సరదా నిజాలు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మనం రోజంతా దానితో గాలి పీలుస్తూనే ఉంటాము. కానీ అదొకటి ఉంది అనే సంగతిని మనం మరచిపోతుంటాం, గుర్తించం. మొటిమలు వస్తేనో, జలుబు చేస్తేనో, మనకు ఊపిరి పీల్చుకోవడానికి కష్టం అయితేనో, ఆ సమయంలో మనకు ముక్కు ఒకటి ఉంది అనే విషయం గుర్తుకు వస్తుంటుంది.

వాతావరణం లో ఉన్న సూక్ష్మ క్రిములన్నింటిని మీ శరీరంలోకి రాకుండా మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది. పసందైన వంటకాల వాసనను మీరు ఆస్వాదించేలా చేస్తుంది ముక్కు. ముక్కు అనేది ఒకటి లేకపోతే మన జీవితం ఇప్పుడు మనం అనుభవించేదిలా అస్సలు ఉండేది కాదు.

15 Interesting and Fun Facts About Your Nose That Will Blow Your Mind!

ముక్కు గురించి ఇప్పుడు మనం కొన్ని సరదా విషయాలను తెలుసుకుందాం. వీటిని తెలుసుకోవడం ద్వారా మనం మొత్తంగా ఆరోగ్యంగా ఉండటానికి ఈ చిన్ని అవయవం ఎంతలా ఉపయోగపడుతుందో తెలిస్తే ఖచ్చితంగా ముక్కుని మీరు అభినందిస్తారు.

#1 అప్పుడే పుట్టిన పిల్లలు ఊపిరి పీలుస్తూ, అదే సమయంలోనే అమ్మ పాలు కూడా త్రాగగలరు. కానీ, మీరు ఆ పని చేయలేరు.

#1 అప్పుడే పుట్టిన పిల్లలు ఊపిరి పీలుస్తూ, అదే సమయంలోనే అమ్మ పాలు కూడా త్రాగగలరు. కానీ, మీరు ఆ పని చేయలేరు.

ఒకే సరి తింటూ గాలి పీల్చడం అసాధ్యం. ఒకసారి ప్రయత్నించి చూడండి. మీకు ఏమిజరుగుతుందో మీకే అర్ధం అవుతుంది. మీకు అసలు విషయం అర్ధం అయ్యింది అనుకుంటున్నా. కానీ, మీరు పుట్టినప్పుడు ఆ పని చేయగలరు. శ్వాసకోశ వ్యవస్థ అప్పుడే పుట్టిన వారికి పెద్దయిన పిల్లలకు మరియు పెద్దలకు కొద్దిగా విభిన్నంగా ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లలు ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్వాస తీసుకుంటూ అమ్మ పాలు తాగుతూ ఉంటారు. కానీ, ఒకసారి పాలు వక్షోజం నుండి తీసుకున్న తర్వాత అది గాలి తీసుకొనే మార్గం వృద్ధి చెందేంత వరకు ఈ మింగడం మరియు గాలి ఒకే మార్గంలోనే వెళ్తూ ఉంటాయి.

#2 మీరు పీల్చుకున్న గాలికి తేమని అందిస్తుంది ముక్కు :

#2 మీరు పీల్చుకున్న గాలికి తేమని అందిస్తుంది ముక్కు :

ఊపిరితిత్తులులు పొడిగాలిని అస్సలు సహించలేవు. మీ గొంతుకు కూడా పొడి గాలిని అస్సలు ఓర్చుకోలేదు. అందుచేత మీరు ఎప్పుడైతే గాలిని పీలుస్తారో అటువంటి సమయంలో ముక్కు గాలికి తేమని అందించి శరీరంలోకి పంపిస్తుంది. అలా తేమతో ఉన్న గాలి మన శ్వాసకోశ మార్గం ద్వారా శరీరం లోకి ప్రవేశిస్తుంది.

సరదా నిజం :

మీ ముక్కులో రంద్రాలు పొడిగా ఉంటాయి, ఎందుచేతనంటే మీ ముక్కులో ఉండే శ్లేష్మం రోజు చివరికి వచ్చేసరికి తేమని అంత కోల్పోతుంది.

#3 కాలుష్యం ,అలర్జీలు మరియు సూక్ష్మక్రిముల నుండి రక్షిస్తుంది :

#3 కాలుష్యం ,అలర్జీలు మరియు సూక్ష్మక్రిముల నుండి రక్షిస్తుంది :

ముక్కు లోపల ఉండే ఉబ్బిపోయినటువంటి ప్రాంతాలన్నీ కణాలతో నిర్మించబడి ఉన్నాయి. వాటి నుండి చిన్నపాటి వెంట్రుకలు బయటకు వస్తాయి వాటినే సీలియా అంటారు. ఇవి మనం పీల్చే గాలిలోని కాలుష్యాన్ని, క్రిమికీటకాలు మరియు సూక్ష్మ క్రిములను శుద్ధి చేసి మంచి వాయువుని శ్లేష్మం దగ్గరకి పంపి ఆ తర్వాత మన శరీరంలోకి పంపబడుతుంది.

ఈ ప్రక్రియ చాలా అతిముఖ్యమైనది. ఎందుకంటే ఊపిరితిత్తులు, బయట నుండి వచ్చే ఏ చిన్న విదేశీ కణాలను కూడా అవి తట్టుకోలేవు మరియు సూక్ష్మక్రిములు ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ లకు ఇవి చాలా సున్నితంగా ప్రతిస్పందిస్తాయి.

మీకోసం ఒక చిన్న సమాచారం ఏమిటంటే, శ్లేష్మం లో బంధించబడ్డ కాలుష్యకారకాలను మరియు విదేశీ క్రిములను మెల్లగా గొంతు ద్వారా పొట్ట లోకి పంపడం జారుతుంది. ఆ తర్వాత పొట్టలో ఉన్న శక్తివంతమైన ఆమ్లాలు వాటిని నాశనం చేస్తాయి.

#4 మీరు పీల్చే గాలిని వెచ్చగా మారుస్తుంది :

#4 మీరు పీల్చే గాలిని వెచ్చగా మారుస్తుంది :

మన ఊపిరితిత్తులు ఎలా అయితే పొడిగాలిని అస్సలు సహించలేవో, అలానే చల్ల గాలిని కూడా ఊపిరితిత్తులు అస్సలు సహించలేవు. అందుచేత మీరు పీల్చే గాలికి తేమని జతచేసి వెచ్చగా చేసి ఊపిరితిత్తులకు పంపిస్తుంది ముక్కు.

#5 మీకు గనుక వాసన చూసే సామర్థ్యం లేకపోతే ఆహారాన్ని అస్సలు రుచి చూడలేరు :

#5 మీకు గనుక వాసన చూసే సామర్థ్యం లేకపోతే ఆహారాన్ని అస్సలు రుచి చూడలేరు :

అవును మీరు విన్నది నిజమే! వివిధ రకాలరుచులు చూడాలంటే ఖచ్చితంగా వాసన చూడటం ఆవశ్యకం. మీరు కావాలంటే గమనించండి ఏ వ్యక్తులకు అయితే జలుబు చేసి ఉంటుందో లేదా జలుబు వల్ల ఊపిరి తీసుకోవడం కష్టం అవుతూ ఉంటుందో అటువంటి వారు, తాము తింటున్న ఆహారం రుచిగా తమకు అనిపించడం లేదని తరచూ పిర్యాదులు చేస్తుంటారు.

కొంతమంది తాము తినే ఆహారం విసర్జనలాగ అనిపిస్తుంది అని చెబుతుంటారు. వాటిని మీరు నమ్మండి. మనందరికీ మూత్ర విసర్జన ఏ రుచులో ఉంటుందో మనకు తెలిసే ఉంటుంది. ఎందుచేతనంటే ఖచ్చితంగా మనం ఆ వాసనని పీల్చి ఉంటాం కాబట్టి.

#6 వాసన చూసే సామర్థ్యం వల్ల ఆహారం లో విషం ఉన్నా మరియు ఏ ఇతర ప్రమాదాలు పొంచి ఉన్నా మీరు పసిగట్టగలరు మరియు సంరక్షించబడతారు :

#6 వాసన చూసే సామర్థ్యం వల్ల ఆహారం లో విషం ఉన్నా మరియు ఏ ఇతర ప్రమాదాలు పొంచి ఉన్నా మీరు పసిగట్టగలరు మరియు సంరక్షించబడతారు :

మీ ముక్కు కేవలం ఆహారం యొక్క రుచిని చూడటానికి మాత్రమే పనికి వస్తుంది అనుకుంటే పొరపాటు. వాటి దగ్గర ఉన్న బలమైన గ్రాహకాల సహాయంతో పొగను, శక్తివంతమైన ప్రమాదకరమైన వాయువులను మరియు చెడిపోయిన ఆహారాన్ని ఇలా ఎన్నింటినో ముందుగానే పసిగట్టి మనకు చెప్పేస్తుంటాయి. దీని వల్ల మనల్ని మనం వ్యాధులు మరియు చావుల నుండి సంరక్షించబడతాము.

#7 మీరు ఎలా మాట్లాడతారు అనే విషయం మీ యొక్క ముక్కు ఆకారం పై ఆధారపడి ఉంటుంది :

#7 మీరు ఎలా మాట్లాడతారు అనే విషయం మీ యొక్క ముక్కు ఆకారం పై ఆధారపడి ఉంటుంది :

మనం మాట్లాడే కంఠ ధ్వని మన శరీరంలోని మూడు అవయవాల పని తీరు వల్ల బయటకు వస్తుంది. ముక్కు, పుర్రెలో ఉండే వాయువు ఎముక రంధ్రాలు మరియు స్వర పేటిక. ఈ మూడింటి పై ఆధారపడి మన స్వరం ఉంటుంది.

స్వర పీఠికలో స్వర నాళాలు ఉంటాయి. ఎప్పుడైతే మీరు మాట్లాడతారో ఆ సమయంలో అవి ప్రకంపనలకు లోనవుతాయి. ఆ ప్రకంపనలు మీ ముక్కు మరియు పుర్రెలో ఉండే వాయువు ఎముక రంద్రాలు ద్వారా ప్రతి ధ్వనిస్తుంది. ఈ మూడింటి కలయిక ద్వారా మన స్వరం అనేది ఏర్పడి ఒక ఖచ్చితత్వం అయిన శబ్దం బయటకు వస్తుంది.

మీరు కావాలంటే గమనించండి. మీ ముక్కుని గనుక మూసివేస్తే మీ స్వరం అనూహ్యంగా బిగ్గరగా మారుతుంది. జలుబు వల్ల లేదంటే మరే ఇతర ముక్కుకు సంబంధించిన వ్యాధి వల్ల అయినా బాధపడుతుంటే, అటువంటి సమయంలో అపారమైన మరియు ఊహించుకోలేనంత మార్పు మీ యొక్క స్వరంలో కనపడుతుంది.

#8 మీరు ఎవరినైనా ఇష్టపడుతుంటే అందుకు మీ ముక్కే కారణం :

#8 మీరు ఎవరినైనా ఇష్టపడుతుంటే అందుకు మీ ముక్కే కారణం :

మీరు ఎవరినైనా చూసి ఆకర్షణకు లోనయ్యారంటే దానికి కారణం మీ ముక్కే. ఎందుచేతనంటే వాళ్ళు మీ పక్కన ఉన్నప్పుడు మీరు ఒక శృంగార భావనకు లోనవుతారు మరియు పునరుత్పత్తికి వారి దగ్గర మంచి జన్యువులు ఉన్నాయనే విషయం మీకు తెలియకుండానే ఉపచేతనం గా ముక్కు వాటిని గుర్తిస్తుంది.

అవును ఈ విషయాలన్నీ మీకు వినడానికి చాలా వింతగా మరియు శృంగారం ప్రతిధ్వనించనివిగా అనిపించవచ్చు. కానీ, ప్రేమ అనేది మన మెదడులో ఉండే రసాయనాల యొక్క పనితీరు పై ఆధారపడి ఉంటుంది. వీటి వల్లనే ప్రేమ పుడుతుంది మరియు మీరు ఇతర వ్యక్తులతో సంభాషించేటప్పుడు విడుదలయ్యే ఫెరొమోన్స్ పై ఆధారపడి ఉంటుంది. మీరు ఇలా ఇతరులతో సంభాషిస్తున్నప్పుడు మీ ముక్కు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే, ఆ సమయంలో అది ఇతర వ్యక్తి యొక్క చెమట యొక్క వాసనను పీల్చి ఆ వ్యక్తి మీకు సరైన వారు అవునా కదా అనే విషయాన్ని గుర్తించి మీకు తెలియజేస్తుంది.

ఇంకొక నిజం ఏమిటంటే, చాలా అధ్యయనాల ప్రకారం ఒకే వాసన కలిగిన ఏ ఇద్దరు వ్యక్తులు గాని ఆకర్షితులు కారు. మన తల్లిదండ్రుల విషయంలో కూడా ఇదే జరిగి ఉంటుంది. జన్యుపరంగా మన వ్యవస్థ అలా రూపొందించబడి ఉంటుంది కాబట్టి మనం మన రక్తసంసంబంధీకుల పట్ల ఆకర్షితులం కాము.

#9 వాసన యొక్క భావానికి మరియు మీ యొక్క జ్ఞాపకాలకు సంబంధం ఉంది :

#9 వాసన యొక్క భావానికి మరియు మీ యొక్క జ్ఞాపకాలకు సంబంధం ఉంది :

మీరు పానీపూరి తిన్న ప్రతిసారి మీకు మీ చిన్నతనం ఎందుకు గుర్తొస్తుంది అని మీరు ఆశ్చర్యపోయారా లేదా ఏదైనా ఒక సుంగంధ ద్రవ్యాన్ని వాసన చూడగానే మీరు ద్వేషించే లేదా ప్రేమించే వ్యక్తి మీకు గుర్తుకు వస్తున్నాడా ?

ఇలా ఎందుకు జరుగుతుందంటే, మీ వాసన యొక్క భావం మరియు మీ యొక్క జ్ఞాపకాలకు మధ్య అవినాభావ సంబంధం ఉంది.

#10 కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు మిమల్ని శాంతింపచేస్తాయి లేదా మిమ్మల్ని ఉత్తేజ పరుస్తాయి :

#10 కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు మిమల్ని శాంతింపచేస్తాయి లేదా మిమ్మల్ని ఉత్తేజ పరుస్తాయి :

ముక్కు లోపల సుగంధ ద్రవ్యాలను వాసనను చూడగల 400 శక్తివంతమైన ద్రావకాలు ఉన్నాయి. మనం ఊహించిన దాని కంటే కూడా ఎన్నో రకాల వాసనలను మన ముక్కు చూడగలదు. మనం పీల్చే వాసనలు నరాల్లో ఉండే ఘణ శక్తి ద్వారా మెదడుకి చేరుతుంది. సుగంధ ద్రవ్య రకాన్ని బట్టి అందుకు సంబంధించిన ప్రతిస్పందనను తెలియజేసే సామర్థ్యం ముక్కు ద్వారా మెదడు తెలియజేస్తుంది.

ఇంకొక నిజం ఏమిటంటే, తైల మర్దనంలో కొన్ని రకాల మంచి వాసనగల నూనెలు మరియు పూలను వాడుతుంటారు. వీటి వల్ల ఒక రకమైన ప్రక్రియ అనేది మొదలవుతుంది. మీరు ఆ క్షణం ఓ కొత్త అనుభూతికి లోనవుతారు. మీరు ఏమి కావాలనుకుంటే ఆ స్థితికి చేరుకోగలుగుతారు. శాంతంగా ఉండాలనుకున్నా, ప్రశాంతంగా ఉండాలన్నా మరియు దృష్టిని మరింత కేంద్రీకరించాలన్నా, ఇలా ఏ పని చేయాలన్న మీరు ఆ స్థితికి ఆ సమయం లో చేరుకోగలరు.

 #11 వయస్సు పెరిగే కొద్దీ మీ ముక్కు వంగిపోతుంది :

#11 వయస్సు పెరిగే కొద్దీ మీ ముక్కు వంగిపోతుంది :

19 సంవత్సరాల వరకు ముక్కు సాధ్యమైనంత ఎక్కువ పరిమాణంలో పెరుగుతుంది. మీ అమ్మ గనుక మీ ముక్కుని మరింత పొడవు పెంచాలని ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నాన్ని ఇక ఆపమని చెప్పండి. ఎందుకంటే అది పనిచేయదు.

ఒకసారి ముక్కు సాధ్యమైనంత ఎక్కువ పరిమాణానికి చేరిన తర్వాత ముక్కు వంగి పోవడం ప్రారంభం అవుతుంది. గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ చర్య అనేది జరుగుతుంది. ముక్కు చివరన ఉండే ఎలాస్టిన్ ఫైబర్లలో నెమ్మదిగా పగుళ్లు రావడం మొదలవుతుంది.

#12 మీరు ఎలా తుమ్ముతారు అనే విషయం జన్యుపరంగా నిర్దేశించబడుతుంది :

#12 మీరు ఎలా తుమ్ముతారు అనే విషయం జన్యుపరంగా నిర్దేశించబడుతుంది :

మీరు విన్నది నిజమే! మీరు తుమ్మే విధానం ఖచ్చితంగా మీ తల్లి దండ్రుల్లో ఎవరికో ఒకరికి దగ్గరిగా ఉంటుంది. ఎందుకంటే ఈ విషయం జన్యు పరంగా నిర్దేశించబడి ఉంటుంది. వారిద్దరిలో ఎవరో ఒకరి గుణం మీకు వచ్చి ఉంటుంది.

ఎప్పుడైనా మీ చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా తుమ్ము రాకపోయినా వచ్చినట్లు నటిస్తుంటే గనుక, వారికి కొద్దిగా విరామం ఇవ్వండి. వారు కీచు మని తుమ్మే కుటుంబానికి చెందిన వారు వారయ్యే అవకాశం ఉంది.

#13 శ్లేష్మంలో ఉండే తెల్ల రక్త కణాలు మరియు ఎంజైములు వ్యాధుల పై పోరాడతాయి :

#13 శ్లేష్మంలో ఉండే తెల్ల రక్త కణాలు మరియు ఎంజైములు వ్యాధుల పై పోరాడతాయి :

శ్లేష్మం కొద్దిగా అసహ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఎండిపోయినప్పుడు లేదా ముక్కులోపల ఉండి పోయినప్పుడు మీకు అలా అనిపించి ఉండవచ్చు. కానీ, క్రిములను నాశనం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా మీరు పీల్చే గాలిలో ఉన్న వైరస్ లు మరియు ఇతర హానికర సూక్ష్మ జీవులు శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది.

ఈ ప్రక్రియ జరగడానికి గాను శ్లేష్మం లో ఉండే ఎంజైములు వ్యాధులతో పోరాడుతూ ఉంటాయి మరియు తెల్లరక్త కణాలు ఎంతగానో సహాయపడుతూ ఉంటాయి.

#14 65 సంవత్సరాలు దాటిన తర్వాత వ్యక్తులు వాసన చూసే సామర్ఢ్యన్ని పోగొట్టుకుంటారు :

#14 65 సంవత్సరాలు దాటిన తర్వాత వ్యక్తులు వాసన చూసే సామర్ఢ్యన్ని పోగొట్టుకుంటారు :

మీకు 65 సంవత్సరాలు దాటినా తర్వాత దాదాపు 50% వాసనలను గుర్తించే సామర్ఢ్యన్ని కోల్పోతారు.

ముసలి వాళ్ళు అందుచేతనే సాధారణమైన ఆహారం తినడానికి ఇష్టపడతారు. ఈ విషయాన్ని విని ఆశ్చర్యపోయారు కదా ?

#15 పురుషులతో పోల్చినప్పుడు స్త్రీలకు వాసన చూసే శక్తి ఎక్కువగా ఉంటుంది :

#15 పురుషులతో పోల్చినప్పుడు స్త్రీలకు వాసన చూసే శక్తి ఎక్కువగా ఉంటుంది :

మీరు విన్నది నిజం. ఎప్పుడైనా మీ భార్య ఇంట్లో ఎదో చెడు వాసన వస్తుంది అని మీకు గనుక చెబితే ఆ విషయాన్ని మీరు తప్పకుండా నమ్మండి.

English summary

15 Interesting and Fun Facts About Your Nose That Will Blow Your Mind!

15 Interesting and Fun Facts About Your Nose That Will Blow Your Mind!
Story first published: Tuesday, December 26, 2017, 10:10 [IST]