Latest Updates
-
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా..
ఉపయోగాలు తెలుసుకుంటే ఇక మీదట మీరు ఉల్లిపాయ పొట్టును పారేయరు!
ఉల్లిపాయలను నిత్యం మనం వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తామనే సంగతి తెలిసిందే. ఉల్లిపాయల వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. కొందరు వీటిని పెరుగు, మజ్జిగ వంటి పదార్థాల్లో వేసుకుని తాగుతారు. ఇక కొందరు పచ్చి ఉల్లిపాయలను మాంసాహారం, పప్పు వంటి వాటితో నంజుకుని తింటారు. ఈ క్రమంలో ఎలా తిన్నా ఉల్లి పాయలు మనకు ఆరోగ్యాన్ని కలిగించేవే. అయితే ఉల్లిపాయలే కాదు, వాటిపై ఉండే పొట్టు వల్ల కూడా అనేక ప్రయోజనాలున్నాయి..

మన శరీరానికి కావల్సిన కీలక పోషకాలు ఉల్లిపాయల్లో లభిస్తాయి. అయితే మీకు తెలుసా..? కేవలం ఉల్లిపాయలే కాదు, వాటిపై ఉండే పొట్టు కూడా మనకు ఉపయోగకరమే. చాలా మంది ఉల్లిపాయలను పొట్టు తీసి వాడుకుంటారు. అయితే ఆ పొట్టు వల్ల కూడా మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఈ నీటిని నొప్పులు, వాపులున్న చోట రాసుకుంటే నొప్పులు, వాపులు తగ్గుతాయి.
ఉల్లిపాయ పొట్టును రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే పొట్టు తీసేస్తే ఆ నీటిని ఉపయోగించుకోవచ్చు. ఈ నీటిని నొప్పులు, వాపులున్న చోట రాసుకుంటే నొప్పులు, వాపులు తగ్గుతాయి. చర్మ సమస్యలు తగ్గిపోతాయి.

2. దోమలు, ఈగలు రావు
ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో ఉల్లిపాయ పొట్టును వేయాలి. అనంతరం ఆ పాత్రను కిటికీలు లేదా గుమ్మం వద్ద పెడితే ఇంట్లోకి దోమలు, ఈగలు రావు. ఉల్లిపాయ పొట్టు నుంచి వచ్చే వాసన వాటికి నచ్చదు. అందుకే అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

3. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది
తలస్నానం చేసేటప్పుడు జుట్టును నీటితో కడిగి షాంపూ పెట్టకముందే ఉల్లిపాయ పొట్టుతో బాగా మర్దనా చేయాలి. దీంతో వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. జుట్టు దృఢంగా పెరుగుతుంది. చుండ్రు, ఇతర సమస్యలు పోతాయి.

4. శరీరంలో ఉన్న ఇన్‌ఫెక్షన్లు నయమవుతాయి
పైన చెప్పిన విధంగా ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగితే దాంతో శరీరంలో ఉన్న ఇన్‌ఫెక్షన్లు నయమవుతాయి. ఎందుకంటే ఆ సూప్ యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అందుకే ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.

5. కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి
ఉల్లి పొట్టులో ఉండే మాంగనీస్, పొటాషియం, విటమిన్ సి, బి6లు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతాయి,.

6. రక్తపోటు సమస్యలు, గుండె పోటు సమస్యలు , అజీర్ణ సమస్యలు తగ్గుతాయి
ఉల్లిపొట్టుతో ఒక రకమైన డ్రింక్ తయారుచేసుకుని రోజుకు రెండు సార్లు తాగితే రక్తపోటు సమస్యలు, గుండె పోటు సమస్యలు , అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. అందుకు చేయాల్సిందల్లా

7. మీ ఆహారం బాగా జీర్ణం అవుతుంది
ఒక ఉల్లిగడ్డ తీసుకుని ఆ పొట్టు అంతా తీసి, రెండు కప్పుల నీటిలో వేసి బాగా నానబెబ్టాలి. తర్వాత ఈ నీటిని పొట్టుతో సహా మరిగించాలి. అలానే ఓ ఇరవై నిముషాలు ఉంచాలి. 10 నిముషాల తర్వాత పొట్టును నీటిలోంచి బయటకు తీసి గోరువెచ్చగా ఉండగా తాగాలి. ఇలా పొద్దున్న రాత్రి రెండు సార్లు చేస్తే మంచిది.
ఇలా చేయడం వల్ల రక్త పోటు సమస్య తగ్గుతుంది, మీ ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ఫ్యాట్ కరిగించి, మెటబాలిజం రేటు పెంచుతుంది.

8. మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది.
ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగుతుంటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. తద్వారా అధిక బరువు తగ్గడమే కాదు, గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

9. పలు రకాల క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది
ఉల్లిపాయ పొట్టుకు చెందిన సూప్ లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. దీనికి తోడు అందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. క్వర్సెటిన్ అని పిలవబడే ఓ రకమైన యాంటీ ఆక్సిడెంట్ ఇందులో ఉంటుంది. అందుకని ఆ సూప్ తాగితే పలు రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. క్యాన్సర్ కణతుల వృద్ధిని తగ్గించే గుణం ఉల్లిపాయ పొట్టు సూప్‌లో ఉంది.



Click it and Unblock the Notifications